గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుంటూరు లోక్ సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°18′0″N 80°24′0″E మార్చు
పటం

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 4 న దీని పరిధికి గుంటూరు జిల్లాను పరిమితం చేశారు.

చరిత్ర[మార్చు]

2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం చాలా మార్పులకు గురైంది. ఇంతకు క్రితం గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు శాసనసభా నియోజకవర్గాలు నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి బదిలీ అయ్యాయి. గతంలో తెనాలి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న తెనాలి, మంగళగిరి శాసనసభా నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో వచ్చిచేరాయి. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం 2022లో జరిగిన జిల్లాల పునర్విభజనలో గుంటూరు జిల్లాకు పరిమితమైంది. ఈ లోక్‌సభ స్థానంలో 18 మండలాలు ఉన్నాయి.

శాసనసభ నియోజకవర్గాలు[మార్చు]

  1. గుంటూరు తూర్పు,
  2. గుంటూరు పశ్చిమ,
  3. తాడికొండ (SC) ,
  4. తెనాలి,
  5. పొన్నూరు,
  6. ప్రత్తిపాడు (SC) ,
  7. మంగళగిరి,

నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]

  • 2001 లెక్కల ప్రకారం జనాభా: 18,36,008 [1]
  • ఓటర్ల సంఖ్య: 12,97,103.
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 18.33%, 3.07%.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
మొదటి 1952-57 ఎస్.వి.ఎల్.నరసింహారావు స్వతంత్ర అభ్యర్ధి
రెండవ 1957-62 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు
మూడవ 1962-67 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ 1967-71 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఆరవ 1977-80 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 ఎన్.జి.రంగా భారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ 1984-89 ఎన్.జి.రంగా భారత జాతీయ కాంగ్రెసు
తొమ్మిదవ 1989-91 ఎన్.జి.రంగా భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 ఎస్. ఎమ్. లాల్ జాన్ భాషా తెలుగుదేశం పార్టీ
పదకొండవ 1996-98 రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు
పన్నెండవ 1998-99 రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు
పదమూడవ 1999-04 యంపరాల వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
పద్నాలుగవ 2004-2009 రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు
పదిహేనవ 2009- 2014 రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు
పదహారవ 2014-2019 గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ
పదిహేడవ 2019 - ప్రస్తుతం గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ

2004 ఎన్నికలు[మార్చు]

2004 ఎన్నికల ఫలితాలను చూపే చిత్రం

  యంపర్ల వెంకటేశ్వరరావు (40.95%)
  జె.హనుమంతరావు గౌడ్ (1.14%)
  ఇతరులు (1.15%)
2004 భారత సార్వత్రిక ఎన్నికలు, గుంటూరు
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ రాయపాటి సాంబశివరావు 4,66,221 56.75 +10.83
తెలుగుదేశం పార్టీ యంపరాల వెంకటేశ్వరరావు 3,36,429 40.95 -10.13
బహుజన్ సమాజ్ పార్టీ జూపల్లి హనుమంతరావు గౌడ్ 9,375 1.14 +1.14
తెలంగాణా రాష్ట్ర సమితి గుండి వెంకటేశ్వర్లు 5,444 0.66 +0.66
స్వతంత్ర రాజకీయ నాయకుడు మువ్వా వెంకటరావు 4,009 0.49 +0.46
మెజారిటీ 1,29,792 15.80 +20.96
మొత్తం పోలైన ఓట్లు 8,21,478 70.06 +5.95
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing +10.83

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు.[2] ప్రజారాజ్యం తరఫున తోట చంద్రశేఖర్ పోటీలో ఉన్నాడు.[3] ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మేడల రాజేంద్రపై విజయం సాధించారు. రాయపాటి సాంబశివరావుకు 403937 ఓట్లు రాగా, రాజేంద్రకు 364582 ఓట్లు వచ్చాయి.

2014 ఎన్నికలు[మార్చు]

సార్వత్రిక ఎన్నికలు, 2014: గుంటూరు
Party Candidate Votes % ±%
తెలుగుదేశం పార్టీ గల్లా జయదేవ్ 618,417 49.68
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వల్లభనేని బాలశౌరి 549,306 44.12
భారత జాతీయ కాంగ్రెస్ అబ్దుల్ వహిద్ షేక్ 46,818 3.76
Jai Samaikyandhra Party మల్లెల వెంకటరావు 5,608 0.45
BSP మల్లెల బాబూరావు 4,223 0.34
AAP కోట వెంకట భవానీ వీర వరప్రసాద్ 2,344 0.19
Pyramid Party of India అబ్బూరి కోటేశ్వరరావు 1,636 0.13
NOTA None of the Above 7,596 0.61
మెజారిటీ 69,111 5.56
మొత్తం పోలైన ఓట్లు 1,244,926 79.19 +2.66
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing

మూలాలు[మార్చు]

  1. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92862&subcatid=17&categoryid=3
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009