చంటబ్బాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంటబ్బాయి
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
నిర్మాణం భీమవరపు బుచ్చిరెడ్డి
కథ మల్లాది వెంకటకృష్ణమూర్తి (చంటబ్బాయి నవల)
చిత్రానువాదం జంధ్యాల
తారాగణం చిరంజీవి (పాండు ఉరఫ్ జేమ్స్ పాండ్),
సుహాసిని (జ్వాల),
సుత్తివేలు,
ముచ్చెర్ల అరుణ (డా. నిశ్చల),
అల్లు అరవింద్,
చంద్రమోహన్,
రావి కొండలరావు (పాండుకి బాస్),
భీమరాజు (ఇనస్పెక్టర్ సౌమిత్రి) ,
అల్లు రామలింగయ్య (డ్రిల్ మాస్టర్ - జ్వాల తండ్రి) ,
సాక్షి రంగారావు,
శ్రీలక్ష్మి (వాగ్దేవి, కవయిత్రి),
పొట్టి ప్రసాద్ (ఎడిటర్) ,
విశ్వనాథమ్ (థమ్)
సంగీతం కె. చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,
పి. సుశీల
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
నిర్మాణ సంస్థ జ్యోతి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

చంటబ్బాయి, 1986లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇందులో చిరంజీవి కంగారు టైపు అయిన, ఇంకా గుర్తింపు పొందని ఒక ప్రైవేటు డిటెక్టివ్‌గా నటించాడు. సినిమాలో హీరోయజమ్ కంటే హాస్యానికి ప్రాధాన్యతనిచ్చారు. Peter Sellers వ్రాసిన "A shot in the dark" అనే కామెడి నవల ఈ కథకు మూలం.

కథ[మార్చు]

పాండురంగారావు ఉరఫ్ "పాండు .. జేమ్స్ పాండ్" కాస్త అయోమయం టైపు చిన్నకారు ప్రైవేటు డిటెక్టివ్. జ్వాల (సుహాసిని) అమే అమ్మాయి ఒక హత్యానేరంలో ఇరుక్కుంటే ఆ కేసు పరిష్కరించే బాధ్యత అతనిమీద పడుతుంది. తన పనిలో పనిగా ఆమెను ఇంప్రెస్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో తన డిటెక్టివ్ ఏజెన్సీ బాస్ (రావికొండలరావు) ఈ హత్య చేశాడని ఋజువు చేస్తాడు.

ఈ కేసు విజయాన్ని చూసిన జ్వాల స్నేహితురాలు డా.నిశ్చల (ముచ్చెర్ల అరుణ) పాండుకు మరొకకేసు అప్పగిస్తుంది. తన తండ్రి (జగ్గయ్య) కు వివాహానికి పూర్వమే పుట్టి, ఎక్కడున్నాడో తెలియని తన సోదరుడు (చంటబ్బాయి) ని వెతికి పట్టుకోవడమే ఆ కేసు లక్ష్యం. ఆ కేసు పరిశోధనలో భాగంగా ఒక యువకుడిని (చంద్రమోహన్) చంటబ్బాయిగా ప్రవేశపెడతాడు పాండు. తరువాత అసలు చంటబ్బాయిని కనుక్కోవడమే ఈ సినిమా కథాంశం.

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

సంభాషణలు[మార్చు]

  • చిరంజీవి: మీరు నిన్నొస్తానని రాలేదేమండీ?
  • సుత్తివేలు: మీరొస్తారని అయ్యగారు పాపం నిన్న సూటు వేసుకున్నారండీ!
  • చిరంజీవి: మళ్ళీ ఎప్పుడొస్తారండీ?
  • సుత్తివేలు: చెప్పండమ్మా, మళ్ళీ ఆ రోజు సూటు వేస్కొంటారు.


  • చిరంజీవి: మీరు సాంబారులో ములక్కాడలు చిన్నగా తరిగి వేస్తారా? లేక పొడుగ్గా తరిగి వేస్తారా?
  • ఇన్స్ పెక్టరు: మిస్టర్ పాండు, మీరు కేసును ప్రక్కదోవ పట్టిస్తున్నారు.
  • చిరంజీవి: సౌమిత్రీ, నేను క్లయింటుని నీలా భయ పెట్ట దలచుకోలేదు. మెల్ల మెల్లగా కేసు లోకి దించుతాను.
  • శ్రీ లక్ష్మి: పుట్టేటప్పుడు జీవకళ, చచ్చేటప్పుడు చావు కళ, ఎందుకే నీకీ ఆరాటం చంద్రకళ? నీక్కూడా వద్దు శశికళ...
  • శ్రీ లక్ష్మి: నేను కవిని కాదు అన్నవాడిని కాలితో తంతాను
  • పితా: నీకూ నాకు టాటా, ఇక బైబై ఈ పూట
  • శ్రీ లక్ష్మి: నేను కొత్త వంటలు కనిపెట్టానండీ. వాటి పేర్లు, బంగాళా బౌ భౌ, అరటి పండు లంబా లంబా

విశేషాలు[మార్చు]

  • అల్లు అరవింద్ ఒక చిన్న పాత్రలో నటించాడు. సుహాసిని, చిరుల మధ్య సరిగ్గా శృంగారం మొగ్గలు తొడిగే సమయంలో బాడీగార్డుగా నియమించబడ్డా అల్లు, చిరు పై దాడి చేస్తూ ఉంటాడు. "ఒరేయ్, ఇప్పుడు వద్దు రా, మూడ్ లేదురా" అని చిరు ప్రాధేయపడుతున్నా, "కుదరదు బాస్, డ్యూటీ అంటే డ్యూటీనే" అని చెప్పే అల్లు హాస్యసన్నివేశాలు
  • ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవికి హాస్యనటుడు బ్రహ్మానందం పరిచయమయ్యాడని, చిరంజీవి ప్రోత్సాహంతో బ్రహ్మానందం మద్రాసుకు వచ్చి సినిమాలలో నటించే ప్రయత్నం మొదలుపెట్టాడని ఒక వేదికపై బ్రహ్మానందం, చిరంజీవి చెప్పారు.
  • 'హరిలో రంగ హరి' పాటలో హరిదాసుగా, పోతురాజుగా, మిస్ మేరీగా చిరంజీవి పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి
  • 'అట్లాంటి ఇట్లాంటి' పాటలో ఖైదీ, మగమహారాజు చిత్రాలను కవ్వింపుగా ప్రస్తావించటం జరుగుతుంది.
  • తమిళ పనివాడుగా సుత్తి వీరభద్రరావు ఇంగ్లీషులో మాటాడాలని చేసే ప్రయత్నంలో గ్లాసును throw చేశాడు, ఫోన్ keep చెయ్, which అంటే which నెంబర్లు డయలు చేయటం వంటి సంభాషణలు మరపు రానివి.
  • కవయిత్రిగా శ్రీలక్ష్మి నేను కవిని కాదన్న వాడిని కాలితో తంతాను అన్నప్పుడు, అరటి పండు లంబా లంబా, బంగాళా భౌ భౌ వంటకాలు అచ్చు వేయమన్నప్పుడు ఆ పత్రికా సంపాదకుడు గురయ్యే భావోద్వేగాలకి నవ్వు ఆగదు.
  • ఆసాంతం కడుపుబ్బ నవ్వించిన పాండు, చివరన చంటబ్బాయ్ గా తన దయనీయ బాల్యాన్ని గుర్తుచేసుకొని కంటి నిండా తడి పెట్టించటం.

పాటలు[మార్చు]

  • ఉత్తరాన లేవన్నది ధ్రువ నక్షత్రం, దక్షిణాన లేవన్నది మలయమారుతం
  • హరిలో రంగ హరి
  • అట్లాంటి ఇట్లాంటి హీరోను కాను నేను

బయటి లింకులు[మార్చు]