చారులత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చారులత
చారులత సినిమా పోస్టర్
దర్శకత్వంసత్యజిత్ రే
స్క్రీన్ ప్లేసత్యజిత్ రే
దీనిపై ఆధారితంరవీంద్రనాధ టాగూరు రాసిన నస్తానిర్హ్ నవల
నిర్మాతఆర్.డి. బన్సాల్
తారాగణంసౌమిత్రా ఛటర్జీ
మాధబి ముఖర్జీ
సైలెన్ ముఖర్జీ
ఛాయాగ్రహణంసుబ్రతా మిత్రా
సంగీతంసత్యజిత్ రే
నిర్మాణ
సంస్థ
ఆర్.డి. బన్సాల్ అండ్ కో
పంపిణీదార్లుఎడ్వర్డ్ హారీసన్ (యుఎస్)
విడుదల తేదీ
1964, ఏప్రిల్ 17
సినిమా నిడివి
117 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

చారులత, 1964 ఏప్రిల్ 17న విడుదలైన బెంగాలీ సినిమా. 1901లో రవీంద్రనాధ టాగూరు రాసిన నస్తానిర్హ్ ("ది బ్రోకెన్ నెస్ట్") నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు సత్యజిత్ రే దర్శకత్వం వహించాడు. ఇందులో సౌమిత్రా ఛటర్జీ, మాధబి ముఖర్జీ, సైలెన్ ముఖర్జీ తదితరులు నటించారు. సత్యజిత్ రే తీసిన విజయవంతమైన సినిమాలలో ఇదీ ఒకటి.

ఈ సినిమాలోని మొదటి, చివరి సన్నివేశాలు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాయి. మొదటి సన్నివేశం, దాదాపు సంభాషణలు లేకుండా చారులత ఒంటరితనం, ఆమె బయటి ప్రపంచాన్ని బైనాక్యులర్ల ద్వారా ఎలా చూస్తుందో చూపిస్తుంది. చివరి సన్నివేశంలో చారులత, ఆమె భర్త దగ్గరికి వచ్చి చేతులు పట్టుకోబోతున్నప్పుడు సినిమా ఫ్రీజ్ అవుతుంది. సినిమాను అందంగా చూపించడానికి ఫ్రీజ్ ఫ్రేమ్ చాలా ఉపయోగం అని ఇది వర్ణించబడింది.[1]

నటవర్గం[మార్చు]

  • మాధబి ముఖర్జీ - చారులత
  • సౌమిత్రా ఛటర్జీ - అమల్
  • శైలెన్ ముఖర్జీ - భూపతి దత్తా
  • శ్యామల్ ఘోషల్ - ఉమపాడ
  • గిటాలి రాయ్ - మాండా
  • భోలనాథ్ కోయల్ - బ్రజా
  • సుకు ముఖర్జీ - నిషికాంత
  • దిలీప్ బోస్ - శశాంకా
  • జయదేవ - నీలోత్‌పాల్ డే
  • బంకీమ్ ఘోష్ - జగన్నాథ్

నిర్మాణం[మార్చు]

రవీంద్రనాధ టాగూరు రాసిన 1901 నవల నస్తానిర్హ్ ( ది బ్రోకెన్ నెస్ట్ ) ఆధారంగా రూపొందించబడింది. సత్యజిత్ రే కు ఈ నవల చాలా ఇష్టం.[2] ఈ సినిమాను 1901 కాలంలో కాకుండా 1880ల కాలంలోని కథగా చేయాలని నిర్ణయించుకున్నాడు, దీనికోసం నెలలు తరబడి పరిశోధనలు చేశాడు. తన సినీజీవితంలో మొదటిసారి ప్రీ-ప్రొడక్షన్ సమయంలో, షూటింగ్ సమయంలో తీరిక లేకుండా పనిచేశాడు.[3] ఆర్ట్ డైరెక్టర్ బన్సీ చంద్రగుప్తా ఆధ్వర్యంలో అన్ని సెట్లు 1880లలో భారతదేశాన్ని సూచించేలా నిర్మించబడ్డాయి. మాధాబీ ముఖర్జీ చారులత పాత్రలో నటించింది. చూయింగ్ పాన్ కు అలవాటు పడిన ఆమె ఆమె పళ్ళు నల్లగా ఉండడంతో అవి కనపడకుండా జాగ్రత్తగా వివిధ యాంగిల్స్ లో షూటింగ్ చేశారు.[4] చారులత సినిమా తనకు ఇష్టమైన సినిమా అని సత్యజిత్ రే తెలిపాడు.[5]

గుర్తింపు[మార్చు]

2013 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని కేన్స్ క్లాసిక్స్ విభాగంలో భాగంగా ఈ సినిమా ప్రదర్శించబడింది.[6] బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ దర్శకుడిగా అవార్డు వచ్చింది. [7]

సంరక్షణ[మార్చు]

1996లో అకాడమీ ఫిల్మ్ ఆర్కైవ్ వారు చారులత సినిమాను భద్రపరచారు.[8]

అవార్డులు[మార్చు]

హోమ్ మీడియా[మార్చు]

2013లో, ది క్రైటీరియన్ కలెక్షన్ హై-డెఫినిషన్ లో, కొత్త సబ్ టైటిల్స్ లతో డిజిటల్ సినిమాగా విడుదల చేసింది.[10]

మూలాలు[మార్చు]

  1. Ray, Satyajit (2015). Prabandha Sangraha. Kolkata: Ananda Publishers. pp. 43–48. ISBN 978-93-5040-553-6.
  2. Robinson. pp. 160.
  3. Robinson. pp. 161.
  4. Robinson. pp. 162.
  5. Robinson. pp. 157.
  6. "Cannes Classics 2013 line-up unveiled". Screen Daily. Retrieved 2021-06-17.
  7. Malcolm, Derek (22 August 2014). "Charulata". London Evening Standard. p. 43.
  8. "Preserved Projects". Academy Film Archive.
  9. "Berlinale 1965: Prize Winners". berlinale.de. Archived from the original on 2015-03-19. Retrieved 2021-06-17.
  10. "Charulata: "Calm Without, Fire Within" – From the Current – The Criterion Collection". Retrieved 2021-06-17.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చారులత&oldid=3848072" నుండి వెలికితీశారు