Coordinates: 16°26′48″N 77°48′31″E / 16.446663°N 77.808688°E / 16.446663; 77.808688

చిన్నచింతకుంట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిన్నచింతకుంట మండలం, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

చిన్నచింతకుంట
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబ్​నగర్​ జిల్లా, చిన్నచింతకుంట స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్​నగర్​ జిల్లా, చిన్నచింతకుంట స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్​నగర్​ జిల్లా, చిన్నచింతకుంట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°26′48″N 77°48′31″E / 16.446663°N 77.808688°E / 16.446663; 77.808688
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్​నగర్​ జిల్లా
మండల కేంద్రం చిన్నచింతకుంట
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 181 km² (69.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 50,341
 - పురుషులు 24,819
 - స్త్రీలు 25,522
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.27%
 - పురుషులు 54.37%
 - స్త్రీలు 26.90%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నారాయణపేట్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో గతంలో 21  రెవెన్యూ గ్రామాలు ఉండేవి. ఇదే జిల్లాలో కొత్తగా ఏర్పడిన కౌకుంట్ల మండలంలో 4 గ్రామాలు విలీనమయ్యాయి. ప్రస్తుతానికి ఈ మండలంలో 17 గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం చిన్నచింతకుంట

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్​ జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 181 చ.కి.మీ. కాగా, జనాభా 45,107. జనాభాలో పురుషులు 22,235 కాగా, స్త్రీల సంఖ్య 22,872. మండలంలో 9,564 గృహాలున్నాయి.[3]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మొత్తం జనాభా 50,341.అంధులో పురుషులు 24,819 కాగా, స్త్రీల సంఖ్య 25,522. అక్షరాస్యత మొత్తం 40,27%, పురుషుల అక్షరాస్యత 54.37%, స్త్రీల అక్షరాస్యత 26.90%

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. బంద్రెపల్లి
  2. లాల్‌కోట
  3. ఫరీద్‌పూర్
  4. పాలమర్రి
  5. నెల్లికొండి
  6. సీతారాంపేట
  7. దమగ్నాపూర్
  8. వడ్డెమాన్
  9. ఏదులాపూర్
  10. లక్ష్మిదేవిపూర్
  11. ఉండ్యాల
  12. చిన్నచింతకుంట
  13. గూడూర్
  14. అమ్మాపూర్
  15. కురుమూర్తి
  16. మద్దూర్
  17. అల్లిపూర్

కౌకుంట్ల మండలంలో చేరిన గ్రామాలు[మార్చు]

ఈ మండలంలో గతంలో 21 గ్రామాలు ఉండేవి.వాటిలోని ముచ్చింతల, అప్పంపల్లి, దాసర్‌పల్లి, తిర్మలాపూర్ గ్రామాలు 2022 సెప్టెంబరు 26న నూతనంగా ఏర్పడిన కౌకుంట్ల మండలంలో విలీనమయ్యాయి.చేసింది.[4][5]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "కౌకుంట్ల కొత్త రెవెన్యూ మండలంగా జీవో జారీ". 27 September 2022. Archived from the original on 9 October 2022. Retrieved 9 October 2022.
  5. "మూడు కొత్త మండలాలు | Three new zones-MRGS-Telangana". web.archive.org. 2023-12-29. Archived from the original on 2023-12-29. Retrieved 2023-12-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు[మార్చు]