Coordinates: 20°13′35.454″N 85°52′32.141″E / 20.22651500°N 85.87559472°E / 20.22651500; 85.87559472

చౌసతి యోగిని దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చౌసతి యోగిని దేవాలయం
చౌసతి యోగిని దేవాలయం, హీరాపూర్
చౌసతి యోగిని దేవాలయం, హీరాపూర్
పేరు
ఇతర పేర్లు:యోగిని మందిరం
ప్రదేశం
దేశం: India
రాష్ట్రం:ఒడిషా
జిల్లా:ఖుర్దా
స్థానికం:హీరాపూర్
ఎత్తు:17 m (56 ft)
అక్షాంశ రేఖాంశాలు:20°13′35.454″N 85°52′32.141″E / 20.22651500°N 85.87559472°E / 20.22651500; 85.87559472
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :Hypaethral

చౌసతి యోగిని దేవాలయం (64 యోగినుల మందిరం) (ఒరియా: ଚଉଷଠି ଯୋଗିନୀ ମନ୍ଦିର, ହୀରାପୁର) ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ పట్టణానికి 20 కి.మీ.ల దూరంలో హీరాపూర్ అనే పల్లెలో ఉంది.[1][2]

విశేషాలు[మార్చు]

ఈ మందిరాన్ని 9వ శతాబ్దంలో రాణీ హీరాదేవి నిర్మించినట్లు భావిస్తున్నారు.[3]

ఈ దేవాలయం వృత్తాకారంలో పూర్తిగా ఇసుకరాయితో కట్టబడింది. లోపలి వైపు గోడకు గూళ్లు ఉన్నాయి. ప్రతి గూటిలోను ఒక దేవత బొమ్మ చొప్పున 56 దేవతా ప్రతిమలున్నాయి. ఇవి నల్లని రాతితో చెక్కబడి గోడకు ఇమడ్చబడి ఉన్నాయి. ఈ గుడి మధ్యలో మూల విగ్రహం కాళి రాక్షసుడి తలపై కాలుపెట్టి నిలబడిన భంగిమతో కనిపిస్తుంది. ఈ గుడి మధ్యభాగంలో చండీ మండపం ఉంది. దానిలో మిగిలిన 8 దేవతా విగ్రహాలు నాలుగు వైపులా ఉన్నాయి. కొంతమంది చరిత్రకారులు ఈ చండీ మంటపంలో మహాభైరవుని పూజించినట్లు ఊహిస్తున్నారు.[3]

ఇది పైకప్పు లేని ఒక తాంత్రిక దేవాలయం.[4] ఇక్కడ పంచభూతాలను ఆరాధిస్తూ క్షుద్రపూజలను నిర్వహిస్తారు.

ఇక్కడి పూజారుల స్థల పురాణం ప్రకారం దుర్గాదేవి రాక్షస సంహారం కొరకు 64 గ్రామదేవతల రూపాలలో వెలసింది. ఈ 64 మంది యోగినులు యుద్ధం అనంతరం దుర్గాదేవిని తమ ఉనికిని చాటడానికి ఒక దేవాలయాన్ని సృష్టించాల్సిందిగా కోరారు.[2]

ఈ యోగిని విగ్రహాలు సాధారణంగా స్త్రీ మూర్తుల రూపంలో ఒక జంతువును వాహనంగా చేసుకుని చేతిలో రాక్షసుని తలను పట్టుకుని శక్తి రూపంలో ఉన్నాయి. ఈ ప్రతిమలలో క్రోధము, దుఃఖము, సంతోషము, ఆహ్లాదము, లాలస మొదలైన అన్ని భావాలు వ్యక్తమౌతున్నాయి.[2]

ఇటువంటి మందిరమే ఒడిషా రాష్ట్రం బలంగిర్ జిల్లాలోని రాణిపూర్- ఝరియల్ ప్రాంతంలోను, భారతదేశంలో మరో ఏడుచోట్ల నెలకొని ఉన్నాయి.

హిందూ పురాణాల ప్రకారము 64 సంఖ్య చతుష్షష్ఠి కళలను సూచిస్తున్నది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఒరిస్సా రివ్యూ, గవర్నమెంట్ గెజిట్". ఒరిస్సా రివ్యూ. ఒరిస్సా ప్రభుత్వం, హోమ్‌ శాఖ. 43: 30. 1986.
  2. 2.0 2.1 2.2 "చౌసతి యోగిని టెంపుల్ - ఎ ప్లేస్ ఆఫ్ వండరస్ అక్కల్ట్ - శాండ్ పెబ్బల్స్ టూర్ అండ్ ట్రావెల్స్". శాండ్ పెబ్బల్స్ టూర్ అండ్ ట్రావెల్స్ (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-06-15. Archived from the original on 2016-12-20. Retrieved 2016-12-06.
  3. 3.0 3.1 శరవణన్, వి.హరి (2014). గాడ్స్, హీరోస్ అండ్ దేర్ స్టోరీ టెల్లర్స్: ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ సౌత్ ఇండియా. నోషన్ ప్రెస్. ISBN 9384391492.
  4. "యోగిని టెంపుల్ ఆఫ్ హీరాపూర్". ది హిందూ. 17 Oct 2003.

గ్యాలరీ[మార్చు]

బయటి లింకులు[మార్చు]