జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాదులోని సంస్థ భవనము.

జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థ హైదరాబాదులో తార్నాక ప్రాంతంలో ఉంది. (ఇంగ్లీషు:National Institute of Nutrition. ) జీనోమ్ వ్యాలీలో కూడా తన కార్యకలాపాలును ప్రారంభించింది.

ప్రారంభము[మార్చు]

1918వ సంవత్సరంలో బెరిబెరి వ్యాధి పరిశోధనా సంస్థగా తమిళనాడు లోని కూనూరులో ఒక గదిలో ప్రారంభ మైనది. అనంతర కాలంలో పౌష్టికాహార లోపాల వలన కలిగే వ్యాదుల పరిశోధన ప్రారంభించి 1928 నాటికి పూర్తి స్థాయి పరిశోధన సంస్థగా అభి వృద్ది చెందినది. ఆ తర్వాత ఈ పరిశోధన సంస్థ 1958 వ సంవత్సరంలో హైదరాబాదుకు తరలించబడింది. అప్పటినుండి దిన దినాభి వృద్ధి చెందుతూ పౌష్టికాహార లోపాలపై అనేక పరిశోధనలు చేస్తూ ఉంది. ఈ పరిశోధనాలయం హైదరాబాదులోని తార్నాక ప్రాంతంలో ఉంది.

పేరు మార్పు[మార్చు]

1969వ సంవత్సరంలో ఈ సంస్థ గోల్డన్ జూబిలీ ఉత్సవాలను జరుపుకొన్నది. ఆ సందర్భంలోని ఈ సంస్థ పేరు National Institute of Nutrition (NIN) గా పేరు మార్చారు.

గ్రంథాలయం[మార్చు]

ఈ సంస్థలో అత్యంత ఆధునికమైన విజ్ఞాన సంబంధ గ్రంథాలయం ఉంది. ఈ గ్రంథాలయం ప్రపంచంలోని ఈ తరహా గ్రంథాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందినది. ఇక్కడ పరిశోధనలు చేస్తున్న పరిశోదకులకు ఈ గ్రంథాలయం ఎంతగానో తోడ్పడుతున్నది.

ప్రదర్శన శాల[మార్చు]

ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. వివిధ రకాల జంతులువులు పరిశోధన నిమిత్తము ఇక్కడ ఉంచబడ్డాయి. ఆ పరిశోధన ఫలితాలను పరీక్షించుటకు ఈ జంతువులు ఉపయోగ పడుతున్నాయి.

ప్రస్తుతం ఈ సంస్థ చేపట్టిన కార్య క్రమాలు[మార్చు]