జుంకే తాబెయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జుంకే తాబెయ్
1985 లో కమ్యూనిజం శిఖరం వద్ద జుంకే తాబెయ్
జననం(1939-09-22)1939 సెప్టెంబరు 22
మిహరు, ఫుకుషిమా, జపాన్
మరణం20 అక్టోబరు 2016 (వయస్సు 77)
కాగో, సైతమా, జపాన్
జాతీయతజపనీయులు
వృత్తిపర్వతారోహకురాలు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిల; ఏడు ఖండాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మొదటి మహిళ.

జుంకో తాబెయ్[1] జపాన్ దేసానికి చెందిన పర్వతారోహకురాలు. ఆమె ప్రపంచంలో ఎత్తెన శిఖరం అయిన ఎవరెస్టు పర్వతం అధిరోహించిన మొదటి స్త్రీగా చరిత్రలో నిలిచింది. ఆమె ప్రతీ ఖండం లోని ఎత్తైన శిఖరాలన్నింటినీ అధిరోహించిన మొదటి మహిళ.[2][3][4]

ప్రారంభ జీవితం[మార్చు]

తాబెయ్ ఏడుగురు సంతానం గల కుటుంబంలో ఐదవ కుమార్తెగా ముహారు, ఫుకుషిమాలో జన్మించింది.[5][6] ఆమె బలహీనమైనదిగా భావించబడినప్పటికీ తన 10 వ యేట పర్వతారోహణకు ప్రారంభించింది. ఆమె తన పాఠశాల తరపున పర్వాతారోహణ కొరకు వెళ్ళి "నాసూ శిఖరం" అధిరోహించింది..[7][8] ఆమెకు పర్వతారోహణపై ఆసక్తి ఉన్నప్పటికీ ఆమె కుటుంబం పేదరికం వల్ల ఆమెకు సహకారం అందించలేకపోయింది. అందువల్ల ఆమె తన ఉన్నత పాఠశాల విద్యాభ్యాస రోజులలో కొన్ని పర్వతారోహణలు మాత్రమే చేయగలిగింది.[6]

వయోజన జీవితం[మార్చు]

ఆమె 1958 నుండి 1962 మధ్య కాలంలో షోవా వుమెన్స్ యూనివర్శిటీలో ఆంగ్ల సాహిత్యం, విద్యను అభ్యసించింది. అచట ఆమె పర్వతారోహణ క్లబ్ లో సభ్యురాలుగా ఉంది.[9] గ్రాడ్యుయేషన్ అయిన పిదప ఆమె జపాన్ లో మహిళా పర్వతారోహణ క్లబ్ (LCC) ప్రారంభించింది. ఆ క్లబ్ యొక్క నినాదం "మమ్మల్ని ఒక విదేశీ ప్రయాణానికి వెళ్ళనివ్వండి". ఇటువంటి క్లబ్ జపాన్ లో మొదటిది. ఆ కాలంలో పురుష పర్వతారోహకులు ఆమెను పర్వతారోహణకు తమతోపాటు రానివ్వనందున, కొందరు పురుషులు ఆమె పర్వతారోహణపై ఆసక్తి తోపాటు ఒక భర్తను వెదుకుకొనుటకు వెళ్ళుతున్నదని అనేవారు. అందువల్ల ఆమె ఈ క్లబ్ ను ప్రారంభించిందని తెలియజేసారు.[10][11] ఈ కాలంలో ఆమె జపాన్ లోని "ఫుజీ పర్వతం", స్విస్ ఆల్ప్స్ లోని మాట్టేర్ హాన్ పర్వతాన్ని అధిరోహించింది. 1972లో తాబెయ్ జపాన్ లోని పర్వతారోహకురాలిగా గుర్తించబడింది.

1975 ఎవరెస్టు అధిరోహణ[మార్చు]

తాబెయ్ యొక్క ఎల్.సి.సి. క్లబ్ లో గల బృధం జపానీస్ వుమెన్స్ ఎవరెస్టు ఎక్స్‌పెడిషన్ (జె.డబ్ల్యూఈ) గా ప్రసిద్ధి చెందింది. ఈ బృందం ఎల్కో హిసానో నాయకత్వంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు ప్రయత్నం చేసింది. ఈ బృందంలో 15 మంది సభ్యులు ఉండేవారు. వారిలో పనిచేసే మహిళలు (ఉపాధ్యాయులు, కంప్యూటరు ప్రోగ్రామర్స్, జూవెనీల్ కౌన్సిలర్) ఉన్నారు.[1] తరువాత తాబె, హిరొకొ హిరకవలు మే 19, 1970లో అన్నపూర్ణ III శిఖరాన్ని అధిరోహించారు. [12]

మహిళా పర్వతారోహక క్లబ్ (LCC) ఎవరెస్టు శిఖరాన్నిఅ ధిరోహించేందుకు నిర్ణయించింది.

ఈ పర్వతారోహణ కొరకు స్పాన్సర్ల కోసం ఆమె సహాయం చేసింది. [13] ఆమె చివరి నిమిషంలో యోమ్లూరి షింబణ్ న్యుస్ పేపర్, నిప్పోన్ టెలివిజన్ సంస్థల నుండి సహాయాన్ని పొందింది. ఆ బృందంలోని సభ్యులు జపాన్ దేశ సరాసరి వేతాన్ంతో సమానమైన మొత్తాన్ని చెల్లించారు. ఈ ధనాన్ని పొదుపు చేయడానికి ఆ బృందం సభ్యులు పర్వతారోహణ కొరకు వాటర్ ఫ్రూప్ పౌచ్ లు, వావర్ గోవ్స్ ను కార్ల యొక్క పాట సీట్ల యొక్క కవర్లతో కుట్టుకొని తయారుచేసుకున్నారు. వారు చైనా నుండి గూస్ ఫెదర్ ను కొనుగోలు చేసి దానితో తాము పడుకొనే సంచులను తయారుచేసుకున్నారు. ఆ పాఠశాలలోని విద్యార్థులు ఉపయోగించని జాం పాకెట్లను వారి ఉపాధ్యాయులకు సేకరించారు..[14] నేపాల్ నుంచి సాహసయాత్ర ప్రారంభించి 1975, మే 16న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. 'ప్రపంచంలో ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళ'గా తన పేరును చరిత్రలో లిఖించుకుంది. వారు 1953లో మొట్టమొదటి సారిగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ వెళ్ళిన మార్గాన్నే ఎంచుకున్నారు.[15]

తరువాత కార్యక్రమాలు[మార్చు]

1990-91 సీజన్ లో ఆమె అంటార్కిటికాలో అత్యున్నత శిఖరం విన్సన్ ను అధిరోహించింది.[16] జూన్ 28, 1992లో ఆమె పుంకాక్ జయ శిఖరాన్ని అధిరోహించి ఏడు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను ఎక్కిన ఘనతను కూడా సొంతం చేసుకుంది. [17][18]

2000లో ఆమె క్యూషు విశ్వవిద్యాలయంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే బృందాలు విడిచిన వ్యర్థాల వల్ల పర్యావరణ నష్టాన్ని కేంద్రీకరిస్తూ పోస్టు గ్రాడ్యుయేషన్ చేసింది. [19]

వ్యక్తిగత జీవితం[మార్చు]

తాబెయ్ మాసనోబు తాబెయ్ ను వివాహమాడారు. ఆయన కూడా 1965లో జపాన్ లో పర్వతారోహణలో పరిచయమయ్యాడు. వారికి ఇద్దరు పిల్లలు: కుమార్తె "నోరికో", కుమారుడు "షిన్యా" [20]

ఆమె 2012లో క్యాన్సర్ వ్యాధికి గురి అయ్యారు. అయినప్పటికీ ఆమె అనెక పర్వతారోహణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆమె అక్టోబరు 20 2016 న మరణించింది.[21]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 JWEE 1975+40 official website "Women’s Quest for Everest" Archived 2016-10-28 at the Wayback Machine
  2. Horn, Robert (29 April 1996). "No Mountain Too High For Her: Junko Tabei defied Japanese views of women to become an expert climber". Sports Illustrated. Archived from the original on 13 December 2013.{{cite magazine}}: CS1 maint: unfit URL (link) Retrieved 29 December 2015
  3. Otake, Tomoko, "Junko Tabei : The first woman atop the world", Japan Times, 27 May 2012, p. 7
  4. The American Alpine Journal. American Alpine Club Annual Resources Series. Vol. 67. The Mountaineers Books. 1997. p. 125. ISBN 0930410556.
  5. "Junko Tabei, first woman to conquer Everest, complete 'Seven Summits,' dies at 77". The Japan Times Online (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-10-22. ISSN 0447-5763. Retrieved 2016-10-23.
  6. 6.0 6.1 "Junko Tabei defied Japanese views of women to become an – 04.29.96 – SI Vault". 2013-10-07. Archived from the original on 2013-10-07. Retrieved 2016-10-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "Junko Tabei, first woman to conquer Everest, complete 'Seven Summits,' dies at 77". The Japan Times Online (in అమెరికన్ ఇంగ్లీష్). 22 October 2016. ISSN 0447-5763. Archived from the original on 22 అక్టోబర్ 2016. Retrieved 23 October 2016. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  8. "Japanese Climber Junko Tabei, First Woman To Conquer Mount Everest, Dies at 77". NPR.org. Retrieved 23 October 2016.
  9. "Junko Tabei defied Japanese views of women to become an – 04.29.96 – SI Vault". 7 October 2013. Archived from the original on 7 October 2013. Retrieved 23 October 2016.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  10. "Junko Tabei defied Japanese views of women to become an – 04.29.96 – SI Vault". 7 October 2013. Archived from the original on 7 October 2013. Retrieved 23 October 2016.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  11. "Japanese Climber Junko Tabei, First Woman To Conquer Mount Everest, Dies at 77". NPR.org. Retrieved 23 October 2016.
  12. Frenette, Brad (October 20, 2017). "A Final Interview With the First Woman to Summit Everest". Outside.
  13. "Japanese Climber Junko Tabei, First Woman To Conquer Mount Everest, Dies at 77". NPR.org. Retrieved 23 October 2016.
  14. Junko Tabei Official Blog "エベレストの準備 その5"
  15. "It's 1975. No woman had scaled Mt Everest yet... | Condé Nast Traveller India". Condé Nast Traveller India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2016-10-23.
  16. Kurtenbach, Elaine (31 March 1991). "Japanese Woman Scales Mountains While Ignoring Society's Stereotypes". Los Angeles Times. Retrieved 30 August 2016.
  17. Horn, Robert (29 April 1996). "No Mountain Too High For Her: Junko Tabei defied Japanese views of women to become an expert climber". Sports Illustrated. Archived from the original on 13 December 2013.{{cite magazine}}: CS1 maint: unfit URL (link) Retrieved 29 December 2015
  18. The American Alpine Journal. American Alpine Club Annual Resources Series. Vol. 67. The Mountaineers Books. 1997. p. 125. ISBN 0930410556.
  19. "Junko Tabei, first woman to conquer Everest, complete 'Seven Summits,' dies at 77". The Japan Times Online (in అమెరికన్ ఇంగ్లీష్). 22 October 2016. ISSN 0447-5763. Archived from the original on 22 అక్టోబర్ 2016. Retrieved 23 October 2016. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  20. "Junko Tabei defied Japanese views of women to become an – 04.29.96 – SI Vault". 7 October 2013. Archived from the original on 7 October 2013. Retrieved 23 October 2016.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  21. "Japanese Climber Junko Tabei, First Woman To Conquer Mount Everest, Dies at 77". NPR.org. Retrieved 23 October 2016.

బాహ్య లంకెలు[మార్చు]