జ్వాలాద్వీప రహస్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జ్వాలాదీప రహస్యం
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం బి. విఠలాచార్య
తారాగణం కాంతారావు,
కృష్ణకుమారి,
రాజనాల,
ముక్కామల,
సూర్యకళ
సంగీతం ఎస్.పీ. కోదండపాణి
నిర్మాణ సంస్థ మధు పిక్చర్స్
భాష తెలుగు

కథ[మార్చు]

సిద్ధేంద్రయోగి అనే ఒక సన్యాసి మరణాన్ని జయించాలని ప్రయోగాలు చేస్తుంటాడు. కానీ తంత్రాలతో కూడిన ఆ పూజలను రాజు ప్రభాకర వర్మ అంగీకరించడు. ఆస్థానంలో ఉన్న విజ్ఞుల సలహా మేరకు ఆ సిద్ధుడిని చంపకుండా దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు. సైనికులు అతనిని తీసుకు వెళుతుండగా వారి కన్నుగప్పి తప్పించుకోవాలని ప్రయత్నంలో అతని కాలి చిటికెన వేలు తెగిపోతుంది. అలా అడవిలోకి పారిపోతున్న సిద్ధుడు సర్పకేశి అనే దుష్టశక్తిని మరో మాంత్రికుడి నుంచి రక్షించి తన వశం చేసుకుంటాడు. ఆ దుష్టశక్తి సహాయంతో అందరికీ దూరంగా జ్వాలాదీపం అనే దీవిని సృష్టించి తన పూజలు నిర్విఘ్నంగా నెరవేర్చుకుంటాడు. తీరా వరం పొందేటపుడు ఆ శక్తి తను ఇవ్వలేనని, అందునా అతను అంగవికలాంగుడు కాబట్టి అతను అందుకు అర్హుడు కాడని తెలియజేస్తుంది.

అప్పుడు ఆ సిద్ధుడు రాజు సేవకుడిగా పని చేస్తున్న భల్లాటకుడు అనే సేవకుణ్ణి సర్పకేశి సహాయంతో తన వద్దకు రప్పించుకొని తన శక్తితో అతనకి జరామరణాలు లేకుండా చేస్తానని, అందుకు ప్రతిఫలంగా తనను అవమానించిన రాజు ప్రభాకర వర్మను గద్దె దించి వారిని తన కారాగారంలో బంధించమంటాడు. సిద్ధుడు నాగదేవతను ప్రార్ధింఛి భల్లాటకుడికి వజ్రకాయాన్ని మరణం లేకుండా శక్తిని వచ్చేలా చేస్తాడు. కానీ ఎప్పుడూ తనచేతులు రక్తసిక్తం కాకూడదని హెచ్చరిస్తాడు. రాజైన భల్లాటకుడు అందరినీ జ్వాలాదీపంలో బంధించినా చిన్నకుమారుడు ఆనందవర్మ మాత్రం మంత్రి సహాయంతో తప్పించుకొని పెరిగి పెద్దవాడవుతాడు. భల్లాటకుడు రాజ్యంలోని ప్రజలందరూ తననే దేవుడుగా భావించి పూజించమని ఆజ్ఞ జారీ చేస్తాడు. అందుకు వ్యతిరేకించిన వారినందరినీ కఠినంగా శిక్షిస్తుంటాడు. అలా వ్యతిరేకించిన వారిలో రాజు గారి ఆస్థాన సిద్ధాంతి కూడా ఉంటాడు. ఆ సిద్ధాంతిని కూడా భల్లాటకుడు జ్వాలాదీపంలో ఉంచి శిక్షించమనగా ఆయన అతని కుమార్తెను చేపట్టిన వాడిలో అతనికి చావు తప్పదని శాపం ఇస్తాడు.

సమయానికి సిద్ధుడు కూడా వచ్చి తనకు పుత్రిక జన్మించిందని కానీ పుట్టిన జాతకం తండ్రి మరణాన్ని సూచిస్తుందని తెలుపుతాడు. అప్పుడు భల్లాటకుడు పసికందు అని కూడా ఆమెను చంపబోగా సిద్ధుడు ఆమెను వారించి ఆమెను అంతఃపురంలో మగవారికి కనపడకుండా పెంచమని కన్యగానే ఉంచమని సలహా ఇస్తాడు. పెద్దవాడైన ఆనందవర్మ తన పెంపుడు తండ్రి సహాయంతో జరిగిన విషయాన్ని తెలుసుకుని తమకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని బయలుదేరతాడు. రాజుకు వ్యతిరేకంగా మాట్లాడి కారాగారం చేరతాడు. అక్కడ జరిగిన మల్లయుద్ధంలో ఇదివరకే రాజును వ్యతిరేకించిన కంఠీరవుడు అనే యోదుణ్ణి ఓడించి రాజాభిమానాన్ని చూరగొంటాడు. అక్కడే రాజకుమార్తెను చూసి ప్రేమలో పడతాడు.

తరువాత కంఠీరవుని మంచి చేసుకుని అతని సహాయంతో రాజును దెబ్బకొట్టాలని పథకం వేస్తాడు. ఇద్దరూ కలిని జ్వాలాదీపం వెళ్ళి తన తల్లిదండ్రులను విడిపించి రాజకుమార్తెను పెళ్ళి చేసుకోవడంచో కథ ముగుస్తుంది.

గ్యాలరీ[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఎన్నడు చూడని అందాలు కన్నుల ముందర తోచెనులే - పి.సుశీల
  2. చాలునే చెలీ చాలునే చక్కిలిగింతలింక సైప జాలనే - సుశీల
  3. చుక్కలన్ని చూస్తున్నాయి చుక్కలన్ని చూసేను పక్కున నవ్వేను - సుశీల, ఘంటసాల . రచన: దాశరథి.
  4. నమో నాగదేవా నమో దివ్యభావా నమోనమో నాగదేవా - మాధవపెద్ది బృందం
  5. ప్రభో కాలభైరవా దేవరా మంత్రభైరవమీయరా - మాధవపెద్ది, ఎస్.జానకి
  6. రావోయీ ఓ నా రాజువు నీవోయీ ఎవ్వరు లేరు సవ్వడి లేదు - ఎస్. జానకి
  7. లే లే లేతవయసుగల చినదానా నువ్వులేచి లేచి ఇటు రావేల - ఘంటసాల,సుశీల . రచన: సి. నారాయణ రెడ్డి.

వనరులు[మార్చు]