వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డ
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

డ అనేది తెలుగు అక్షరమాలలో ఒక హల్లు. ఇది సరళముల (గజడదబ) లో మూడవది. "ట" వర్గానికి చెందిన అక్షరం. వ్యంజనవర్ణములలోని పదుమూఁడవ యక్షరము.[1]

హల్లులలో మూర్ధన్య నాద అల్పప్రాణ ధ్వనిని కలిగి ఉంటుంది. మూర్థన్యమనగా అంగిలి పైభాగము నుండి పుట్టిన ధ్వని. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల లో దీని సంకేతం [ɖ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ḍ].

ఉచ్చారణా లక్షణాలు[మార్చు]

  • స్థానం: మూర్ధం (hard palate)
  • కరణం: మడత వేసిన నాలిక కొన (tip of the tongue curled up)
  • సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాదం (voiced)
  • విశేష ప్రయత్నం: స్పర్శ (stop)
  • నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

డ గుణింతం[మార్చు]

డ, డా, డి, డీ, డు, డూ, డృ డె, డే, డై, డొ, డో, డౌ, డం, డః

"డ" గుణింత అక్షరాలతో ఏకాక్షర పద్యం[మార్చు]

"డ" తో ఏకాక్షర పద్యాన్ని ఏల్చూరి మురళీధరరావు రాసాడు. అది

డండడ డేడిడ డైడా

డండా డోడౌడ డాడడాడా డాడై

డండూడిడౌడడడడా

డండడడడ డండడండ డం! డడ!! డండమ్!!!

ప్రతి పదార్థం[మార్చు]

డం = డమరుకము యొక్క,

డ = శివంకరమైన నాదమునందు;

డ = ప్రీతి గొన్న స్వామీ! పరమేశ్వరా!

డే = దాంపత్యధర్మమును అనుసరించి,

డి = గౌరీదేవిని,

డ = మేని సగభాగమున తాల్చిన దేవా!

డై = వృషభము,

డా = విజయధ్వజముగా కలవాఁడా!

డం = తృతీయనేత్రమందు,

డా = అగ్నిని తాల్చిన విభూ!

డో = దుష్టుల,

డౌ = సంహారమునందు,

డ = రక్తివహించిన ప్రభూ!

డా = శ్రీదేవిని,

డ = వామభాగమున నిలిపికొన్న శ్రీహరిచే,

డా = జయోక్తులతో,

డా = సన్నుతింపబడిన దేవా!

డా = వెన్నెల వంటి,

డై = నందికేశ్వరుని శరీరఛ్చాయ వంటి,

డం = పాల వంటి,

డూ = ఆదిశేషుని వంటి,

డి = గౌరీదేవి వంటి,

డౌ = కామధేనువు వంటి,

డ = శంఖము వంటి,

డ = చంద్రుని వంటి,

డ = అమృతము వంటి, డా=తెల్లని దరహాసము గల ఱేఁడా!

డం = గాయనుల యొక్క,

డ = స్తోత్రములచే,

డ = ప్రసన్నుఁడ వగు,

డ = సర్వేశ్వరుఁడవైన,

డ = పరమేశ్వరా!

డం = దుర్మతులకు,

డ = త్రాసమును కలిగించు,

డం = డమరువు యొక్క,

డ = భీషణమైన ధ్వని కలవాఁడా!

డం! డడ!! డండమ్!!! అని డమరుకోదితముతో శివునికి నాదనివేదనం.

మూలాలు[మార్చు]

  1. "నిఘంటుశోధన - తెలుగు నిఘంటువు Online Telugu Dictionary - Andhrabharati nighaMTu SOdhana - ఆంధ్రభారతి నిఘంటు శోధన Telugu Dictionary Online Telugu Dictionary telugu nighantuvu Telugu Online Dictionaries telugunighantuvu తెలుగునిఘంటువు telugunighantuvulu తెలుగునిఘంటువులు శబ్దరత్నాకరము శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు బ్రౌన్ నిఘంటువు ఆంధ్ర వాచస్పత్యము వావిళ్ల నిఘంటువు వావిళ్ళ నిఘంటువు తెలుగు వ్యుత్పత్తి కోశము తెలుగు వ్యుత్పత్తి కోశం శబ్దార్థ చంద్రిక ఆంధ్ర దీపిక శ్రీ సూర్యరాయ నిఘంటువు Telugu Nighantuvu Nigantuvu Bahujanapalli Sitaramacharyulu Sabdaratnakaram Sabdaratnakaramu Shabdaratnakaram Shabdaratnakaramu Sabda ratnakaramu Shabda ratnakaramu Charles Philip Brown Telugu-English Dictionary, English-Telugu Dictionary Adhunika vyavaharakosamu Shabdaratnakaramu, Urdu Telugu Dictionary". andhrabharati.com. Retrieved 2023-02-18.

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=డ&oldid=3840557" నుండి వెలికితీశారు