నోముల నర్సింహయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నోముల నర్సింహయ్య
నోముల నర్సింహయ్య

పదవీ కాలం
2018-2020
నియోజకవర్గం నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1956-01-09)1956 జనవరి 9
పాలెం, నకిరేకల్ మండలం, నల్లగొండ జిల్లా
మరణం 2020 డిసెంబరు 1(2020-12-01) (వయసు 64)
హైదరాబాదు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
సంతానం నోముల భగత్ కుమార్
నివాసం నకిరేకల్

నోముల నర్సింహయ్య (జనవరి 9, 1956 - డిసెంబరు 1, 2020) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా కొనసాగారు గతంలో సీపీఎం శాసనససభపక్షనేతగా పనిచేసిన నర్సింహయ్య సీపీఎం పార్టీ తరపున రెండుసార్లు నకిరేకల్ శాసనసభ నియోజకవర్గం నుండి, టిఆర్ఎస్ పార్టీ తరపున ఒకసారి నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.

జీవిత విషయాలు[మార్చు]

నర్సింహయ్య 1956, జనవరి 9న తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, నకిరేకల్ మండలం, పాలెం గ్రామంలోని యాదవ కుటుంబంలో జన్మించాడు.[1] తన బాల్యంలో తెలంగాణ సాయుధ పోరాటం వంటి కమ్యూనిస్ట్ సాహిత్యం వైపు ఆకర్షితుడయ్యాడు, పురాణ వ్యక్తులచే ప్రేరణ పొందాడు. చిన్నతనం నుండే వ్యవసాయంలో కూడా నిమగ్నమయ్యాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎం.ఏ) బ్యాచిలర్ ఆఫ్ లాస్ (ఎల్ఎల్బి) చేసాడు.

రాజకీయ జీవితం[మార్చు]

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తన విద్యార్థి జీవితంలో, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చురుకుగా నాయకత్వం వహించాడు. తరువాత, ఆయన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)లో చేరాడు. కొంతకాలం నల్గొండ నకిరేకల్ జ్యుడిషియల్ కోర్టులలో న్యాయవాదిగా పనిచేశాడు. నకిరేకల్‌ మండల పరిషత్ అధ్యక్షుడిగా రెండుసార్లు ఎన్నికయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నకిరేకల్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 1999 నుండి 2004 వరకు ఎపి శాసనసభలో సిపిఐ (ఎం) ఫ్లోర్ లీడర్‌గా పనిచేశాడు.

1999లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిసిఎం పార్టీ తరపున పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కటికం సత్తయ్య గౌడ్ పై 5,115 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిసిఎం పార్టీ తరపున పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కటికం సత్తయ్య గౌడ్ పై 24,222 ఓట్ల తేడాతో గెలుపొందాడు.

2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నల్లగొండ జిల్లా భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసి ఓడిపోయాడు. తెలంగాణ ఏర్పాటుపై సిపిఐ (ఎం) పార్టీ వైఖరితో విభేదించి 2014, ఏప్రిల్ 8న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2014 సాధారణ ఎన్నికలలో నాగార్జున సాగర్ (అసెంబ్లీ నియోజకవర్గం) నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఎన్నికల్లో ఓడిపోయాడు.[2][3] తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018) 2018లో నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై 7771 ఓట్ల తేడాతో గెలుపొందాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

నర్సింహయ్మకు లక్ష్మితో వివాహం జరిగింది. వీరి కుమారుడి పేరు నోముల భగత్ కుమార్. భరత్, తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నాడు.[4][5]

మరణం[మార్చు]

నర్సింహయ్య కోవిడ్ -19 వ్యాధినుంచి కోలుకున్న తరువాత ఊపిరితిత్తుల సమస్యకు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ 2020, డిసెంబరు 1న గుండెపోటుతో మరణించాడు.[6][7]

గుర్తింపు[మార్చు]

2021, డిసెంబరు 1న నిడమనూరు మండలంలోని వేంపాడు స్టేజీ వద్ద నోముల నర్సింహయ్య విగ్రహాం ఆవిష్కరించబడింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి డ్రోన్‌ ద్వారా విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నోముల భగత్‌ కుమార్‌, నల్లమోతు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్‌, శానంపూడి సైదిరెడ్డి, పైళ్ల శేఖర్‌ రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.[8]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  2. "'నోముల' టీఆర్‌ఎస్‌కు జంప్".
  3. "Alliances Create Fissures in Parties - The New Indian Express". Archived from the original on 2016-03-05. Retrieved 2020-12-01.
  4. www.tv5news.in, తెలంగాణ (29 March 2021). "ఎవరీ నోముల భగత్‌.. ఫుల్ డీటెయిల్స్ ఇవే...!". Vamshi Krishna. Archived from the original on 29 March 2021. Retrieved 29 March 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. టిన్యూస్ తెలుగు, తెలంగాణ (29 March 2021). "సాగర్ అభ్యర్థి నోముల భగత్ ప్రొఫైల్ ఇదే". Archived from the original on 29 March 2021. Retrieved 29 March 2021.
  6. TRS MLA Nomula Narsimhaiah dies of heart attack
  7. "TRS lawmaker Nomula Narasimhaiah dies of cardiac arrest after post-Covid-19 complications". Hindustan Times. 2020-12-01. Retrieved 2020-12-01.
  8. "ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌దే విజయం". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-01. Archived from the original on 2021-12-07. Retrieved 2021-12-07.