పెళ్ళి చేసి చూడు (1952 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెళ్ళిచేసి చూడు
(1952 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎల్.వి.ప్రసాద్
నిర్మాణం బి.నాగిరెడ్డి
రచన ఆలూరి చక్రపాణి, పింగళి నాగేంద్రరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి,
జి.వరలక్ష్మి
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం మార్క్యుస్ బార్ట్ లే
కూర్పు సి.పి.జంబులింగం, యం.యస్.మనీ
నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఈ సినిమలో ఒక సన్నివేశము
ఈ సినిమలో ఒక సన్నివేశము

కథ[మార్చు]

ఒక పల్లెలో తన తల్లి (కన్నాంబ), చెల్లి అమ్మడు (జి.వరలక్ష్మి)లతో నివసించే రాజు నాటకాలలో వేషాలేస్తూ ఆ ఊరి స్కూలులో పనిచేస్తుంటాడు. అతని మావయ్య అయిన గోవిందయ్య అదే ఊరిలో ఉంటూ మేనల్లుడిని తన కూతురుకు ఇచ్చి వివాహం చేయాలనుకొంటాడు. అతని పొరుగింటి దూరపు బంధువు భీమన్న ఆమెను ఇష్టపడుతుంటాడు. ఆమె కూడా ఇతడిని పెళ్ళిచేసుకోవలనుకొంటూ ఉంటుంది.

రాజు తన చెల్లి పెళ్ళి అయితే కాని తను పెళ్ళిచేసుకోనని సంబంధాలకోసం వెంకటపతి అనే ఆయనను కలుసుకోవటం కోసం వేరే ఊరు వెళతాడు. అక్కడ పూటకూళ్ళమ్మ ద్వారా దూపాటి వియ్యన్న (ఎస్.వి.రంగారావు) అనే ఆయన ద్వారా పని జరుగుతుందని తెలిసి ఆయన ఇంటికి వెళతాడు. ఆయన తన తండ్రికి స్నేహితుడని తెలుస్తుంది. ఆయన తన కూతురు చిట్టి (సావిత్రి)ని చేసుకోమని అతని చెల్లి పెళ్ళి తను చేస్తానని చెప్పడంతో చిట్టిని పెళ్ళాడుతాడు.

మద్రాసులో ఉద్ధ్యోగం చేస్తున్నవెంకటపతి కొడుకు రమణ (ఎన్.టి.రామారావు)తో వివాహం నిర్ణయిస్తారు. తన కూతురిని పెళ్ళి చేసుకోకపోవడం వలన ద్వేషంతో ఉన్న గోవిందయ్య వెంకటపతిని రెచ్చగొదతాడు. వివాహం పూర్తయ్యే సమయానికి వియ్యన్న అనుకొన్న మొత్తం ఇవ్వలేకపోవడంతో పెళ్ళిపీటలమీద ఉన్న తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాడు వెంకటపతి.

రాజు తన చెల్లి,తల్లి,భార్యల నగలు ఇంటి దస్తావేజులు తీసుకొని వెంకటపతి ఇంటికి వెళ్ళి తన చెల్లిని కాపురానికి తీసుకొని వచ్చేందుకు అనుమతి ఇవ్వమని అడుగుతాడు. వెంకటపతి ససేమిరా అని మోసం చేసి తనకొడుకుతో తాళి కట్టించారని తిట్టి తనకొడుకుకు వేరే పెళ్ళి చేస్తానని చెపుతాడు. రమణ అతడిని ప్రక్కకు తీసుకెళ్ళి తను తండ్రికి తెలియకుండా వస్తానని ప్రస్తుతం వెళ్ళిపొమ్మనీ చెపుతాడు. తరువాత తాను మద్రాసు పోతున్నానని చెప్పి అత్తగారి ఊరు వెళతాడు. అక్కడ కొద్దికాలం ఉండి తన భార్యను తీసుకొని మద్రాసు వెళతాడు.

ఈ లోగా తనకు తండ్రి వేరే సంబంధాలు చూస్తున్నట్టు తెలియడంతో తండ్రి వచ్చేసరికి పిచ్చిఎక్కినట్టుగా నాటకం ఆడుతూ తనకు సేవలు చేసే నర్సుగా తనభార్యను కూడా తనతో తీసుకొని ఊరు వెళతాడు. అక్కడ పిచ్చివాడైన తనకు నర్సులాంటి భార్య అయితే బావుంటుందనిపించేలా తండ్రికి చెప్పి మద్రాసు వెళతారు. అక్కడ గర్భవతి అయిన భార్యను తన అత్తగారి ఇంట దించి ఆమె బిడ్డను కన్న తరువాత తిరిగి తీసుకు వెళతాడు. ఇదంతా గమనించిన గోవిందయ్య రమణ నాటకం బట్టబయలు చేసేందుకు వెంకటపతితో కలసి మద్రాసు వస్తాడు. తండ్రి రాకతో మళ్ళీ పిచ్చి ఎక్కినట్టుగా నాటకం ఆడుతున్న కొడుకును చూస్తాడు. ఇంతలో లోపల పిల్లవాడి ఏడుపు వినబడటంతో లోనికి వెళ్ళి చూస్తారు. అక్కడ కోడలు అమే బిడ్డతో ఉండటం గమనిస్తాడు. ఆమెను వెంటనే ఇంటి నుండి వెళ్ళిపొమ్మని చెప్పి కొడుకుతో నీకు గోవిందయ్య కూతురితో వివాహం నిశ్చయించానని వెంటనే ఇంటికి రమ్మని లేదంటే తన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వననీ చెపుతాడు. తనకు ఆస్తి అవసరం లేదని భార్య వెంటే తానూ పోతానని సామాను తీసుకొని ఆమెను తీసుకొని వెళ్లబోతుంటే వియ్యన్న వచ్చి అతడిని ఆపి గోవిందయ్య కూతురుకు అప్పటికే అతని బంధువు భీమన్నతో పెళ్ళి జరిగిందని మాయమాటలు చెప్పి వెంకటపతిని మోసం చేస్తున్నడని చెపుతాడు. తన తప్పు తెలుసుకొన్న వెంకటపతి కొడుకుని ఆపి కోడలిని మనవడిని వెంటబెట్టుకొని తన ఊరు వెళతాడు.

తారాగణం[మార్చు]

  • నందమూరి తారక రామారావు - వేంకట రమణ
  • గరికపాటి వరలక్ష్మి - అమ్మడు
  • యండమూరి జోగారావు - రాజు
  • సావిత్రి - సావిత్రి
  • యస్.వి.రంగారావు - ధూపాటి వియ్యన్న
  • డాక్టర్ శివరామకృష్ణయ్య - సి.వి.వి.పంతులు
  • టి.యన్.మీనాక్షి - రత్తమ్మ
  • దొరస్వామి - గోవిందయ్య
  • సూర్యకాంతం - చుక్కలమ్మ
  • పుష్పలత - చిట్టి
  • మహంకాళి వెంకయ్య - భీముడు
  • గాదె బాలకృష్ణ "కుండు"రావు - కుండు
  • వల్లూరి బాలకృష్ణ - రమణ సహచరుడు
  • చదలవాడ - వియ్యన్న సహాయకుడు
  • పద్మనాభం - వియ్యన్న సహాయకుడు, పోస్ట్ మాన్
  • యల్.వి.ప్రసాద్ - అతిథి నటుడు
  • బి.వెంకటరామిరెడ్డి - అతిథి నటుడు

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు నిడివి
బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా ఊటుకూరి సత్యనారాయణ ఘంటసాల ఎ.పి.కోమల, కె. రాణి, ఉడుతా సరోజిని 06:29
ఎవడొస్తాడో చూస్తాగా పోటీ ఎవడొస్తాడో చూస్తాగా పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల, జి.భారతి 01:51
పెళ్ళి చేసి చూపిస్తాం మేమే పెళ్ళి పెద్దలనిపిస్తాం పింగళి నాగేంద్రరావు ఘంటసాల పిఠాపురం, వి.రామకృష్ణ 02:44
ఎచ్చటినుండొచ్చారు బల్ చక్కటి రాజులు మీరు పింగళి నాగేంద్రరావు ఘంటసాల శకుంతల, వి.రామకృష్ణ 00:55
ఎక్కడోయి హా ప్రియా హా ఎక్కడోయీ పింగళి నాగేంద్రరావు ఘంటసాల పి.లీల, పిఠాపురం, వి.రామకృష్ణ 04:07
హై ఏవూరిదానవే వన్నెలాడి బల్ ఠీవిగా ఉన్నావే గిన్నెకోడీ పింగళి నాగేంద్రరావు ఘంటసాల శకుంతల, వి.రామకృష్ణ 02:34
ఈ జగమంతా నిత్యనూతన నాటకరంగం పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల
అమ్మా నొప్పులే అమ్మమ్మా నొప్పులే ఉటుకూరి సత్యనారాయణ రామకృష్ణ, స్వర్ణలత ఘంటసాల 03:13

1. "ఎవరో ఎవరో " పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల, పి.లీల 03:19 2. "రాధనురా ఏడవకు" పింగళి నాగేంద్రరావు జి.వరలక్ష్మి, ఘంటసాల జోగారావు, పి.లీల 05:38 10. "మనసా నేనెవరో నీకు తెలుసా" పింగళి నాగేంద్రరావు పి.లీల 02:49 11. "మనసులోని మనసా " పింగళి నాగేంద్రరావు ఘంటసాల 02:42 12. "ఏడుకొండలవాడా వెంకటరమణ" పింగళి నాగేంద్రరావు పి.లీల 02:58 13. "భయమెందుకే చిట్టి" పింగళి నాగేంద్రరావు ఘంటసాల 03:23 16. "ఏ జగన్మాత" పింగళి నాగేంద్రరావు ఘంటసాల 01:43 17. "పోవమ్మ బలికావమ్మ" పింగళి నాగేంద్రరావు ఘంటసాల

  1. పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్ (గాయకులు: ఘంటసాల)

శైలి, శిల్పం[మార్చు]

సినిమా మొదటి సన్నివేశం నాటకంతో ప్రారంభం అవుతుంది. సినీ విమర్శకుడు, రచయిత కొడవటిగంటి కుటుంబరావు దీన్ని విశ్లేషిస్తూ "ఏ ఇతర సినిమా రచయితల కన్న కూడా చక్రపాణి తన కథకు బాగా నాంది చేయగలిగినట్టు కనిపిస్తాడు ...చిత్రంలో ప్రధానాంశం కూడా నాయికా నాయికలు ఆడే నాటకమే ...చిత్రంలో అణువణువునా నాటకం ఉంటూనేవుంది." అన్నాడు.[1]

మూలాలు[మార్చు]

  1. కొడవటిగంటి, కుటుంబరావు (23 May 1952). "సినిమా రచనలో ప్రతిభ". తెలుగు స్వతంత్ర. Retrieved 21 February 2019.[permanent dead link]

ఆధార గ్రంథాలు[మార్చు]

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.

బయటి లింకులు[మార్చు]