పొక్కలి బియ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొక్కిలి ధాన్యం కంకులు

పొక్కలి (ఆంగ్లం: Pokkali; (మళయాలం: പൊക്കാളി) ఒక ప్రత్యేక రకమైన బియ్యం. దీనిని ఒక విశిష్టమైన ఉప్పునీటిలో కూడా పెరిగే లక్షణం కలగి. దీనిని సేంద్రీయ పద్ధతిలో కేరళలోని నీరు నిలువవుండే అలపుఝ, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాలలో పండిస్తారు..[1] ఈ రకమైన పొక్కలి బియ్యానికి 2008 సంవత్సరంలో చెన్నైలోని భౌగోళిక గుర్తింపుల రిజిస్ట్రీ నుండి భౌగోళిక గుర్తింపు (GI tag) లభించింది.[2]

క్షారమైన నేలల్లో పేరిగే దీని గుణం అతి విశిష్టమైనది. ఈ వరివంగడాన్ని జూన్ నుండి నవంబరు మధ్యకాలంలో నీటియందు లవణపు శాతం తక్కువగా యున్న కాలంలో పెంచుతారు. అవే వరిమడుల్లో లవణ పరిమాణం అధికంగా ఉండే నవంబరు నుండి ఏప్రిల్ మధ్యన రొయ్యల పెంపకం చేపడతారు.[1] సముద్రంనుండి ఈ పొలాల్లోకి ఈదుకొని చేరే రొయ్యపిల్లలు వరిపంట కోసిన మిగులు వ్యర్ధాలమీద జీవిస్తాయి. గేట్లు ద్వారా ఈ పొలాల్లోని నీటిని అదుపుచేస్తారు. ఈ వరిపంటకు వేరుగా ఎరువులు గాని లేదా కీటకనాశని మందులుగాని ఉపయోగించరు. రొయ్యల విసర్జితాలే ఈ పంటకు బలాన్ని అందిస్తాయి.

సముద్రపు పోటుతో పాటు వచ్చే భూసారం పైరులకు అవసరమైన శక్తిని అందిస్తుంది. నాటిన నారు నీరునిలబడియున్న మడుల్లో సుమారు రెండు మీటర్లు ఎత్తు పెరుగుతాయి. పక్వానికి వచ్చిన వరికంకులు నిలువుగా నిలబడి కొమ్మలు వంగిపోతాయి. అక్టోబరు నెలలో పంటను కోస్తారు. మామూలు వరి మాదిరిగా కాకుండా కంకుల్ని మాత్రమే కోసి మిగిలినభాగాన్ని నీటిలో వదిలేస్తారు. వీటిమీదనే రొయ్యలు జీవిస్తాయి.

ఈ విధంగా సేంద్రీయ పద్ధతిలో పెంచబడిన పొక్కలి బియ్యం ఒక వినూత్నమైన రుచిని, అధిక ప్రోటీన్లను కలిగివుంటాయి. పండించే రైతులు ఈ బియ్యంలో కొన్ని వ్యాధుల్ని నయంచేసే లక్షణాలున్నట్లు పేర్కొంటారు. చిరకాలం నుండి సముద్రంలో రోజంతా వేటకు వెల్లే జాలర్ల కావలసిన బలాన్నిచ్చేవి. అరిజోనా విశ్వవిద్యాలయం శాస్త్రజ్నులు ఈ పొక్కలి బియ్యపు డి.ఎన్.ఏ.ను విశ్లేషించారు.[2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Shrimp, fish and paddy cultivation in same field is lucrative". TheHindu. Retrieved 2013-06-13.
  2. 2.0 2.1 "Pokkali rice is now a brand name". TheHindu. Archived from the original on 2010-11-30. Retrieved 2013-06-13.

బయటి లింకులు[మార్చు]