ప్రత్యూష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రత్యూష
జననం29 ఆగస్టు 1993
మరణం2002 ఫిబ్రవరి 23(2002-02-23) (వయసు 20)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1998 – 2002
తల్లిదండ్రులు
  • సరోజినీదేవి [1] (తల్లి)

ప్రత్యూష (1993ఆగస్టు 29 – 2002 ఫిబ్రవరి 23) ఒక సినీ నటి. ఐదు తెలుగు తెలుగు, పన్నెండు తమిళ సినిమాల్లో నటించింది. రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని మొదలైన సినిమాల్లో గుర్తించదగ్గ పాత్రల్లో నటించింది. ఇంకా అనేక టివి ధారావాహిక కార్యక్రమాల్లో నటించింది.

ఆమె తన స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి కలిసి కోకోకోలాలో విషం కలుపుకుని తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. సిద్దార్థ రెడ్డి మాత్రం బతికాడు. ఈ వార్త అన్ని ప్రముఖ దినపత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది.[2]

జీవితం[మార్చు]

ప్రత్యూష నల్గొండ జిల్లా, భువనగిరిలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి ఆమె చిన్నప్పుడే మరణించాడు. హోటల్ మేనేజ్మెంట్ చదివింది. మోడల్ గా ఉత్తమ స్మైల్ విభాగంలో అవార్డును పొందింది. 17 ఏళ్ళ వయసులో సినీ పరిశ్రమలో ప్రవేశించింది. ఆమె తల్లి సరోజినీ దేవి ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. ఆమె సోదరుడు ప్రణీత్ చంద్ర సినిమాల్లో హీరోగా ప్రయత్నిస్తున్నాడు.

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష
1998 రాయుడు తెలుగు
1999 శ్రీరాములయ్య తెలుగు
1999 సముద్రం చంటి తెలుగు
2000 మనునీధి పూంగొడి తమిళం
2001 ఇది ఏమి ఊరురా బాబు తెలుగు
సూపర్ కుడుంబం అభిరామి తమిళం
స్నేహమంటే ఇదేరా అమృత తెలుగు
పొన్నాన్న నేరం తమిళం
థవసి నందిని తమిళం
కాదల్ పూక్కల్ ఉప్పిలి తమిళం
2002 కలుసుకోవాలని మాధవి తెలుగు
2004 సౌండ్ పార్టీ నందిని తమిళం

మరణం[మార్చు]

ప్రత్యూష 2002 ఫిబ్రవరి 23 న తమ వివాహాన్ని పెద్దలు అంగీకరించడం లేదని తన స్నేహితుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంది. అదే రోజు హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సిద్దార్ధ రెడ్డి మాత్రం చావును తప్పించుకున్నాడు[3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (7 December 2019). "నా కూతురి కేసులో అసలు తీర్పే రాలేదు". Archived from the original on 19 జూలై 2021. Retrieved 19 July 2021.
  2. Feb 25, TNN /; 2002; Ist, 01:53. "Love-struck actress commits suicide | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-11-20. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  3. "Actress' lover convicted in murder case". Sify.com. Archived from the original on 2012-06-24. Retrieved 2012-08-05.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రత్యూష&oldid=4087991" నుండి వెలికితీశారు