ప్రేమమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమమ్
సినిమా పోస్టర్
దర్శకత్వంచందు మొండేటి
స్క్రీన్ ప్లేచందు మొండేటి
నిర్మాతసూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
తారాగణం
ఛాయాగ్రహణంకార్తీక్ ఘట్టమనేని
కూర్పుకోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
సంగీతంగోపీ సుందర్, రాజేష్ మురుగ‌న్‌
నిర్మాణ
సంస్థ
సితార ఎంట‌ర్ టైన్మెంట్స్‌
పంపిణీదార్లుహారిక & హాసిని క్రియేషన్స్
విడుదల తేదీ
2016 అక్టోబరు 7 (2016-10-07)
సినిమా నిడివి
136 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్30 cr
బాక్సాఫీసు40 crores est.2 crore[1]

ప్రేమమ్ - 2016 తెలుగు సినిమా. ఇది మలయాళంలో ఫస్ట్ రిలీజ్ అయి హిట్ అయింది.

కథ[మార్చు]

తాడేప‌ల్లిగూడెంలో పుట్టి పెరిగిన విక్కి (నాగ‌చైతన్య‌) ప‌ద‌వ త‌ర‌గ‌తిలో సుమ (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌) ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమెకు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌డానికి అనేక ప్ర‌య‌త్నాలు చేస్తాడు. చివ‌ర‌కు సుమ ఓరోజు విక్కితో త‌న‌కు ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడ‌నే విష‌యాన్ని చెప్ప‌డంతో విక్కి ఎంతో బాధ‌ప‌డ‌తాడు. సుమ‌ను స్వార్ధ‌ప‌రురాల‌ని తిట్టుకుంటాడు. ఐదేళ్ల త‌ర్వాత అంటే డిగ్రీ చ‌దువేట‌ప్పుడు విక్కి మ‌రోసారి గెస్ట్ లెక్చ‌ర‌ర్ సితార (శృతిహాస‌న్‌) ను ప్రేమిస్తాడు. సితార వ‌య‌సులో విక్కి కంటే పెద్ద‌దైన ఆ విష‌యాన్ని తేలిక‌గా తీసుకుని ఆమెతో ప‌రిచ‌యం పెంచుకుంటాడు. సితార కూడా విక్కితో చ‌నువుగా మెలుగుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ప్రేమ‌గా మారే లోపు కాలేజ్‌కి సెమిస్ట‌ర్ సెల‌వులు వ‌స్తాయి. సితార పూణేకు బ‌య‌లు దేరుతుంది. కానీ దారిలో ఆమె బ‌య‌లుదేరే బ‌స్సుకు యాక్సిడెంట్ జ‌రుగుతుంది. ఆమె జ్ఞాప‌క‌శ‌క్తిని కోల్పోతుంది. దాంతో విక్కి.., సితార‌కు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌లేకపోతాడు.

సితార వేరొక‌రిని పెళ్ళి చేసేసుకుంటుంది. ప‌దేళ్ల త‌ర్వాత విక్కి పెద్ద చెఫ్‌గా ఎదుగుతాడు. విక్కి పెట్టిన హోట‌ల్‌కు సిటీలో మంచి పేరు వ‌స్తుంది. విక్కి మాత్రం ఎప్పుడూ సితార జ్ఞాప‌కాల్లోనే ఉంటుంటాడు. అయితే ఓసంద‌ర్భంలో విక్కికి సింధు ప‌రిచ‌యం అవుతుంది. కొన్నిరోజుల త‌ర్వాత‌ సింధుకి విక్కి త‌న ప్రేమ‌ను చెబితే సింధు కూడా త‌న ఎంగేజ్‌మెంట్ అయ్యింద‌ని చెబుతుంది. విక్కి మ‌రోసారి బాధ‌ప‌డ‌తాడు. కానీ క‌థ అక్క‌డే ట‌ర్న్ తీసుకుంటుంది. అదెలాంటి మ‌లుపు? విక్కి ప్రేమ స‌క్సెస్ అవుతుందా? అస‌లు విక్కికి, సింధు మ‌ధ్య చాలా సంవ‌త్స‌రాల నుండే ప‌రిచ‌యం ఉంటుంది..అదెలాంటి ప‌రిచ‌యం... ? చివ‌ర‌కు విక్కి ఎవ‌రిని పెళ్ళి చేసుకుంటాడు? అనే విష‌యాలు మిగిలిన కథ

నటులు[మార్చు]

పాటలు[మార్చు]

  • ఎవరే, రచన: శ్రీమణి, గానం.విజయ్ . జేసుదాస్
  • బ్యాంగ్ బ్యాంగ్, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.హరిచరన్
  • ఎన్నోసార్లు , రచన: వనమాలి, గానం.సచిన్ వారియర్
  • ఎవడు ఎవడు, రచన: శ్రీమణి, గానం.రంజిత్
  • అగరొత్తుల, రచన: పూర్ణాచారి, గానం. నరేష్ అయ్యర్
  • ప్రేమ పూసేనే, రచన: పూర్ణాచారీ, గానం. కార్తీక్
  • నిన్నలేని , రచన: కృష్ణ మదినేని, గానం. కార్తీక్

సాంకేతికవర్గం[మార్చు]

  • స‌మ‌ర్ప‌ణ: పి.డి.వి.ప్ర‌సాద్‌
  • నిర్మాణ సంస్థః సితార ఎంట‌ర్ టైన్మెంట్స్‌
  • తారాగ‌ణం: చైత‌న్య అక్కినేని, శృతిహాస‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌,
  • సంగీతం: గోపీసుంద‌ర్‌, రాజేష్ మురుగ‌న్‌
  • చాయాగ్ర‌హ‌ణం: కార్తీక్ ఘట్టమనేని
  • ఆర్ట్: సాహి సురేష్‌
  • క‌థ: అల్ఫోన్స్ పుథ‌రిన్‌
  • ఎడిట‌ర్: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
  • నిర్మాత: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
  • స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: చందు మొండేటి

మూలాలు[మార్చు]

  1. crore-mark-7-days-699531 Premam 1st-week box office collection. Ibtimes.co.in (2016-10-14). Retrieved on 2016-10-18.
  2. ఈనాడు, ఆదివారం అనుబంధం. "కాలాని అలా సాధించాను..!". తలారి ఉదయ్ కుమార్. Archived from the original on 16 ఏప్రిల్ 2020. Retrieved 16 April 2020.

బయటి లంకెలు[మార్చు]

లింక్యులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రేమమ్&oldid=4005432" నుండి వెలికితీశారు