Coordinates: 25°45′37″N 84°08′49″E / 25.760392°N 84.147055°E / 25.760392; 84.147055

బలియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బలియా
బాఘీ బలియా
పట్టణం
బలియా is located in Uttar Pradesh
బలియా
బలియా
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°45′37″N 84°08′49″E / 25.760392°N 84.147055°E / 25.760392; 84.147055
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాబలియా
Regionపూర్వాంచల్
Population
 (2011)[1]
 • Total1,04,424
భాషలు
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
277001
టెలిఫోన్ కోడ్05498

బలియా ఉత్తర ప్రదేశ్‌ లోని పట్టణం, బలియా జిల్లాకు ముఖ్య పట్టణం. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు ఉన్న నిర్వహిస్తుంది. నగరపు తూర్పు సరిహద్దు గంగా, ఘాఘరా నదుల సంగమం వద్ద ఉంది. బలియా వారణాసి నుండి తూర్పున 140 కి.మీ., రాష్ట్ర రాజధాని లక్నో నుండి 380 కి.మీ. దూరంలో ఉంది. పట్టణంలో జయప్రకాష్ నారాయణ్ పక్షుల అభయారణ్యం ఉంది.

భౌగోళికం[మార్చు]

బలియా జిల్లా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రపు తూర్పు భాగంలో, బీహార్ రాష్ట్ర సరిహద్దున ఉంది. ఇది గంగా ఘఘ్రా నదుల సంగమ స్థలం నుండి పశ్చిమంగా వ్యాపించింది. బలియా పట్టణం 25°45'37.4" ఉత్తర అక్షాంశం, 84°08'49.4" తూర్పు రేఖాంశం వద్ద ఉంది.

శీతోష్ణస్థితి[మార్చు]

శీతోష్ణస్థితి డేటా - Ballia (1981–2010, extremes 1956–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 29.0
(84.2)
35.9
(96.6)
42.1
(107.8)
46.5
(115.7)
48.0
(118.4)
47.5
(117.5)
43.0
(109.4)
39.4
(102.9)
37.9
(100.2)
38.1
(100.6)
36.4
(97.5)
34.0
(93.2)
48.0
(118.4)
సగటు అధిక °C (°F) 20.5
(68.9)
25.3
(77.5)
31.5
(88.7)
37.0
(98.6)
38.5
(101.3)
36.6
(97.9)
33.3
(91.9)
33.0
(91.4)
32.5
(90.5)
31.6
(88.9)
28.6
(83.5)
23.5
(74.3)
31.0
(87.8)
సగటు అల్ప °C (°F) 7.1
(44.8)
10.3
(50.5)
15.2
(59.4)
20.8
(69.4)
24.6
(76.3)
26.0
(78.8)
25.6
(78.1)
25.6
(78.1)
24.9
(76.8)
21.2
(70.2)
14.9
(58.8)
9.1
(48.4)
18.8
(65.8)
అత్యల్ప రికార్డు °C (°F) 1.0
(33.8)
0.0
(32.0)
5.0
(41.0)
10.8
(51.4)
15.7
(60.3)
16.3
(61.3)
16.4
(61.5)
17.6
(63.7)
17.0
(62.6)
10.4
(50.7)
5.8
(42.4)
1.4
(34.5)
0.0
(32.0)
సగటు వర్షపాతం mm (inches) 4.8
(0.19)
7.3
(0.29)
1.0
(0.04)
6.8
(0.27)
18.1
(0.71)
93.8
(3.69)
184.2
(7.25)
178.9
(7.04)
149.8
(5.90)
31.8
(1.25)
6.2
(0.24)
1.7
(0.07)
684.4
(26.94)
సగటు వర్షపాతపు రోజులు 0.6 0.6 0.2 0.6 1.3 3.9 8.4 7.7 5.8 1.0 0.5 0.2 30.8
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) 71 64 54 42 48 61 77 80 80 74 68 73 66
Source: India Meteorological Department[3][4]

జనాభా[మార్చు]

1901 లో, బలియా జనాభా 15,278. 2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [5] ఇది 1,02,226. జనాభాలో పురుషులు 54%, మహిళలు 46%. బలియా సగటు అక్షరాస్యత రేటు 65%, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. 58% మంది పురుషులు 42% మంది మహిళలు అక్షరాస్యులు. జనాభాలో 11% మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బలియా జనాభా 1,04,424, వీరిలో 55,459 మంది పురుషులు, 48,965 మంది స్త్రీలు. లింగ నిష్పత్తి 1000 పురుషులకు 883 మంది ఉన్నారు. 6 సంవత్సరాల లోపు వయస్సు గల వారి జనాభా 11,623. బలియాలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 77,331, ఇది జనాభాలో 74.1%, పురుషులలో అక్షరాస్యత 78.0% కాగా, స్త్రీలలో అక్షరాస్యత 69.5%. బలియాలో ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత 83.3% కాగా, వారిలో పురుషుల అక్షరాస్యత రేటు 88.0%, స్త్రీ అక్షరాస్యత రేటు 78.0%. షెడ్యూల్డ్ కులాల జనాభా 8,703 షెడ్యూల్డ్ తెగల జనాభా 3,942. 2011 లో బలియాలో 15,772 గృహాలు ఉన్నాయి. [1]

2 రాజధాని ఎక్స్‌ప్రెస్‌లతో సహా రోజూ అనేక రైళ్ళు బలియా రైల్వే స్టేషన్ గుండా వెళ్తాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాతో పాటు లక్నో, కాన్పూర్, ఆగ్రా, వారణాసి, అలహాబాద్‌లకు వెళ్ళే రైళ్ళు ఈ స్టేషను గుండా వెళ్తాయి

బలియా నుండి రాష్ట్ర రాజధాని లక్నో, వారణాసి, గోరఖ్పూర్, కాన్పూర్, ఆగ్రా, వారణాసి, అలహాబాద్ నగరాలకు రోడ్డు మార్గ సౌకర్యం ఉంది. రాష్ట్ర రవాణా సంస్థ నడిపే బస్సులు ఇక్కడి ప్రజలకు ప్రధానమైన ప్రయాణ సౌకర్యం.

దాద్రి మేళా (పశువుల ఉత్సవం/సంత)[మార్చు]

భారతదేశంలో అతిపెద్ద పశువుల ఉత్సవమైన దాద్రి మేళా బలియా నుండి 5 కి.మీ. దూరంలో జాతీయ రహదారి 31 కి దగ్గరలో జరుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు గంగా నదిలో ప్రజలు పవిత్ర స్నానం చేసి, ఈ ఉత్సవంలో పాల్గొంటారు. భృగు మహర్షి శిష్యుడైన దర్దార్ ముని గౌరవార్థం ఏటా ఈ ఉత్సవం జరుపుతారు. [6] [7]

నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశ కార్తీకపౌర్ణమికి పది రోజుల ముందు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వ్యాపారులు భారతదేశం అంతటి నుండి అనేక జాతుల పశువులను అమ్మకం కోసం తీసుకువస్తారు. కార్తీక పౌర్ణమి నాడు, ఆ తరువాత, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తరువాతి పక్షం రోజుల పాటు వివిధ వస్తువులను అమ్మే అనేక తాత్కాలిక దుకాణాలను ఇక్కడ నిర్వహిస్తారు.[6] [7]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Census of India: Ballia". www.censusindia.gov.in. Retrieved 17 November 2019.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 23 నవంబరు 2020.
  3. "Station: Ballia Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 73–74. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 May 2020.
  4. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M212. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 May 2020.
  5. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
  6. 6.0 6.1 "Dadri Mela, Uttar Pradesh".
  7. 7.0 7.1 "Dadri Mela, Ballia". Archived from the original on 2018-07-13. Retrieved 2020-11-23. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "dadri2" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
"https://te.wikipedia.org/w/index.php?title=బలియా&oldid=3798671" నుండి వెలికితీశారు