Coordinates: 28°57′N 77°13′E / 28.95°N 77.22°E / 28.95; 77.22

బాగ్‌పత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాగ్‌పత్
పట్టణం
బాగ్‌పత్ is located in Uttar Pradesh
బాగ్‌పత్
బాగ్‌పత్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 28°57′N 77°13′E / 28.95°N 77.22°E / 28.95; 77.22
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాబాగ్‌పత్
Elevation
253 మీ (830 అ.)
Population
 (2011)[1]
 • Total50,310
భాషలు
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
Website

బాగ్‌పత్ ఉత్తర ప్రదేశ్‌లోని పట్టణం. ఇది బాగ్‌పత్ జిల్లా ముఖ్య పట్టణం. ఇది జాతీయ రాజధాని ప్రాంతంలో భాగం. [3]

నగరానికి అసలు పేరు పురాణాల్లో పేర్కొన్న వ్యాఘ్రప్రస్థం. పెద్ద సంఖ్యలో పులులుండే ప్రాంతం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందని ప్రతీతి. [4] మహాభారతంలో కూడా దీన్ని వ్యాఘ్రప్రస్థం అని ప్రస్తావించారు. భారత యుద్ధాన్ని నివారించడానికి, పాండవుల తరపున కృష్ణుడు కోరిన ఐదు గ్రామాలలో ఇది ఒకటి. [5]

మొఘలుల కాలంలో, నగరం లోని ఉద్యానవనాలను సూచిస్తూ దీనికి బాగ్‌పత్ (బాగ్ అంటే హిందూస్థానీలో తోట అని అర్థం) అని పేరు పెట్టారు. [6]

భౌగోళికం[మార్చు]

బాగ్‌పత్ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో, యమునా నది తూర్పు ఒడ్డున ఉంది. ఇది ఢిల్లీ నుండి ఈశాన్యంగా 40 కి.మీ. మీరట్ నుండి పశ్చిమంగా 52 కి.మీ. దూరంలో, ఢిల్లీ- సహారన్‌పూర్ రహదారిపై ఉంది. బాగ్‌పత్ జిల్లాకు ఉత్తరాన షామ్లీ, ముజఫర్‌నగర్ జిల్లాలు, తూర్పున మీరట్ జిల్లా, దక్షిణాన ఘాజియాబాద్ జిల్లా, పశ్చిమాన యమునకు ఆవల, ఢిల్లీ, హర్యానా లోని సోనీపత్ జిల్లాలు ఉన్నాయి. [3]

జనాభా[మార్చు]

2011 భారత జనగణన ప్రకారం, బాగ్‌పత్‌లోని 7880 గృహాల్లో 50,310 జనాభా ఉంది, అందులో 26,435 మంది పురుషులు, 23,875 మంది మహిళలు. 8,781 మంది ఆరేళ్ళ లోపు పిల్లలున్నారు. బాగ్‌పత్‌లో అక్షరాస్యత రేటు 50.7%, పురుషుల అక్షరాస్యత 56.9%, స్త్రీ అక్షరాస్యత 43.8%. బాగ్‌పత్ లో ఏడేళ్ళకు పైబడీన వయసున వారిలో అక్షరాస్యత 61.43% కాగా, ఇందులో పురుషుల్లో అక్షరాస్యత 68.9%, స్త్రీలలో 53.1% ఉంది. షెడ్యూల్డ్ కులాల జనాభా 2,337.[1]

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

  • సత్యపాల్ మాలిక్, రాజకీయ నాయకుడు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Census of India: Baghpat". censusindia.gov.in. Retrieved 13 December 2019.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 23 నవంబరు 2020.
  3. 3.0 3.1 "About District". bagpat.nic.in. Retrieved 7 March 2020.
  4. "इतिहास". bagpat.nic.in (in హిందీ). Retrieved 2 September 2020.
  5. The cities of Delhi. Jain, Ashok Kumar. Management Pub. Co. 1994. ISBN 978-81-86034-00-2.
  6. Cotton, James Sutherland; Burn, Sir Richard; Meyer, Sir William Stevenson (1908). The Imperial Gazetteer of India: Argaon to Bardwān (in English). Clarendon Press. p. 190.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
"https://te.wikipedia.org/w/index.php?title=బాగ్‌పత్&oldid=3798685" నుండి వెలికితీశారు