భూకైలాస్ (1940 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
‌ఇదే పేరుగల మరొక సినిమా కోసం భూకైలాస్ (1958 సినిమా)‌ చూడండి.
‌భూకైలాస్
(1940 తెలుగు సినిమా)
దర్శకత్వం సుందరరావు నాదకర్ణి
నిర్మాణం ఏ.వి.మెయ్యప్పన్
చిత్రానువాదం ఆర్.నాగేంద్రరావు
తారాగణం ఆర్.నాగేంద్రరావు,
ఎం.వి.సుబ్బయ్యనాయుడు,
లక్ష్మీబాయి,
సురభి కమలాబాయి,
రాయప్రోలు సుబ్రమణ్యం,
మాస్టర్ విశ్వం
సంగీతం ఆర్.సుదర్శనం
సంభాషణలు బలిజేపల్లి లక్ష్మీకాంతం
నిర్మాణ సంస్థ సరస్వతి సినీ ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

1940లో విడుదలైన ఈ భూకైలాస్ చిత్రం మైసూరు శ్రీ సాహిత్య సామ్రాజ్య నాటకమండలి వారి నాటకం యొక్క తెర అనువాదం. అందువలన సన్నివేశ చిత్రీకరణ మొదలైన అంశాలు, రంగస్థల నాటకాన్ని పోలిఉంటాయి. 1958లో విడుదలైన భూకైలాస్ సినిమాతో పోల్చితే ఈ సినిమాలో పాత్రలు వ్యవహారిక భాషనే ఉపయోగించాయి. సుబ్బయ్య నాయుడు రావణుని పాత్రను పోషించగా, నాగేంద్రరావు నారద పాత్రను పోషించి అద్భుతంగా నటించారు. ఆర్. సుదర్శనం సమకూర్చిన సంగీతం సినిమా విజయానికి దోహదం చేసింది. లక్ష్మీబాయి తదితరులు పాడిన "సుమడోలీ.." పాట ఆ రోజుల్లో బాగా ప్రాచ్యురం పొందిందిన సినీ చరిత్రకారుడు రాండర్ గై ఈ సినిమాను సమీక్షించాడు.[1] అప్పట్లో దక్షిణాది రాష్ట్రాల మధ్య అవినాభావ సినిమా సంబంధాలకు అద్దంపడుతూ, ఆంధ్ర దేశంలో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింన ఈ తెలుగు చిత్రంలో నటించిన నటీనటులు ఆర్.నాగేంద్రరావు, సుబ్బయ్య నాయుడు, లక్ష్మీబాయి, సురభి కమలాబాయి కన్నడవారు. నిర్మాత ఏ.వి.మెయ్యప్పన్ తమిళులు, దర్శకుడు సుందరరావు నాదకర్ణి మరాఠీవారు కావటం విశేషం[2]

పాత్రలు-పాత్రధారులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. అత్యాచారులచేత ధర్మవిలయంబై లోకమల్లాడుచో (పద్యం) - హైమావతి
  2. ఆసురూప రేఖా ఇదేకా నాధా నీ విలాస రేఖా ఇదేకా - లక్షీబాయి
  3. ఇదే కదా పార్వతి, శివుని సతికి ఘోరపిశాచి - ఆర్. నాగేంద్రరావు, సుబ్బయ్య నాయుడు
  4. కమలామనో విహారీ శౌరీ గానసుధాలోలా - ఆర్. నాగేంద్రరావు
  5. తగదోయి దనుజేంద్ర ఎంత విపరీతంబోయి (పద్యం) - సుబ్బయ్య నాయుడు
  6. దరియేదో చూచుకోరా మేల్కోరా తరింతువురా - మాష్టర్ విశ్వం
  7. దేవా జీవాధారా దయరాదా నాపై దయరాదా - లక్ష్మీబాయి
  8. నడవరే ఆవుల్లారా పొద్దూకిపోయింది పోరే - మాష్టర్ విశ్వం
  9. నా మాయా నాటకమే జగతి నటకులు జీవులు - సురభి కమలాబాయి
  10. నా జన్మ నేటికి ధన్యమాయె నామనోరధలత కుసుమించె - లక్ష్మీబాయి
  11. ప్రేమనందమయా సదయా నామనోరధము ఈడేరు - లక్ష్మీబాయి
  12. భువనైక జీవా త్రిగుణాను భావ రవి దివసనాధ - పార్వతీబాయి
  13. మహాదేవా నీ మహిమనే గ్రహింప నేపాటి మహాపరాధిని - సుబ్బయ్య నాయుడు
  14. మాయలు సాగునే మా యెడల - లక్ష్మీబాయి,ఆర్. నాగేంద్రరావు, సుబ్బయ్య నాయుడు
  15. శంభోశివ లోకైకగురూ శరణం దేహి మహేశా - సుబ్బయ్య నాయుడు
  16. శ్రీ సర్వమంగళా ముఖభాసురపూర్ణేం దురిచి - సుబ్బయ్య నాయుడు
  17. సాంబ సదాశివ చంద్రకళాధర శంభో శంకర - సుబ్బయ్య నాయుడు
  18. సుమడోలీకేళీ హాళీ ఉయ్యలో జంపాలో - లక్ష్మీబాయి బృందం

మూలాలు[మార్చు]

  1. THE INDIAN MOVIE MOGUL: AV. MEIYAPPAN - Randor Guy Blog[permanent dead link]
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-06-03. Retrieved 2010-06-07.