మనోరమ (2009 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనోరమ
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.ఈశ్వరరెడ్డి
నిర్మాణం పి.గోయెంకా
కథ పద్మశ్రీ
తారాగణం ఛార్మీ కౌర్, నిషాన్, ఎం.ఎస్.నారాయణ, అలీ, ప్రదీప్, నర్సింగ్ యాదవ్
సంగీతం కోటి
గీతరచన వెనిగళ్ళ రాంబాబు, మాష్టార్జీ
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ జీ మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ 27-03-2009
భాష తెలుగు

మనోరమ జీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై వి.ఈశ్వరరెడ్డి దర్శకత్వంలో 2009, మార్చి 27న విడుదలైన రొమాంటిక్, థ్రిల్లర్ తెలుగు సినిమా.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

కథ[మార్చు]

హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని కొందరు ఉగ్రవాదులు ప్లాన్ చేసి ఓ యువకుడికి బాంబు పెట్టే పనికి నియమిస్తారు. కోటిలో రద్దీగా ఉండే ప్రదేశాన్ని వెతికి చివరకు 'మనోరమ' కేఫ్‌ని తన టార్గెట్‌గా ఎంచుకుంటాడు ఆ యువకుడు. మధ్యాహ్నం 1గంటల సమయానికి బాంబు పేలేలా సెట్ చేసి ఆ బాంబు ఉన్న బ్యాగ్‌ని కేఫ్‌లో ఉంచుతాడు. ఇంతలో మరికొద్ది రోజుల్లో చనిపోవబోతున్న గీతాంజలి (గిలి) తన స్నేహితురాలితో గడపడానికి హైదరాబాద్ చేరుకుని మనోరమ కేఫ్ ఎదురుగా ఉన్న స్నేహితురాలి అపార్ట్‌మెంట్‌లో ఉంటుంది. గిలి దూరం నుండి ప్రజలను చూస్తూ తన సమయాన్ని గడిపేది. లిప్ రీడింగ్ ఆమె హాబీ. తన స్నేహితుడి ఫ్లాట్ నుండి ఆ రద్దీ ప్రాంతంలోని ప్రజలను చూస్తుండగా, గిలి వాసు అనే అబ్బాయి ఆందోళనతో ఉండటం గమనిస్తుంది. తన ప్రియురాలు లక్ష్మి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడని లిప్ రీడింగ్‌తో టెలిఫోన్ బూత్‌లో జరిగిన సంభాషణ ద్వారా ఆమె అర్థం చేసుకుంటుంది. అయితే వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో లక్ష్మి గృహ నిర్బంధంలో ఉంది. వాసు మనోరమ కేఫ్‌ పరిసరాలలో తిరుగుతున్నాడని తెలుసుకున్న లక్ష్మి సోదరులు ఆ అబ్బాయిని కొట్టడానికి బయలుదేరారు. గిలి తన మొబైల్ ఫోన్ నుండి లక్ష్మితో మాట్లాడటం ద్వారా ఇదంతా తెలుసుకుంటుంది. వాసును ఆత్మహత్య నుండి, లక్ష్మి సోదరుల బారి నుండి రక్షించాలని నిర్ణయించుకుంటుంది. ఈ ప్రక్రియలో, ఆమె మనోరమ వద్దకు వెళుతుంది. బాంబును అమర్చిన హంతకుడు మొదటి చూపులోనే గిలిని ఇష్టపడతాడు. అతను గిలిని బాంబు దాడి నుండి రక్షించాలనుకుంటాడు. అదృష్టవశాత్తూ, నిర్ణీత సమయంలో బాంబు పేలలేదు. గిలి, ఆ హంతకుడు ఇద్దరూ వాసును వెదకడం ప్రారంభిస్తారు. చివరికి సాయంత్రానికి వారిద్దరూ వాసుని కనుగొంటారు. వాసుని హెచ్చరిస్తూ, గిలి తాను కూడా కొద్దిరోజులలో చనిపోతానని వెల్లడించి, జీవితానికి విలువ ఇవ్వమని చెబుతుంది. బాంబు పేలుడు నుండి ఆమెను రక్షించాలనుకున్న హంతకుడికి ఆమె మాటలు కనువిప్పు కలిగిస్తాయి. ఆమె బాంబు దాడిలో కన్నా శాంతియుతంగా చనిపోవడానికి సహాయం చేయాలని నిశ్చయించుకుంటాడు. బాంబు ఉన్న బ్యాగ్‌ని తీసుకెళ్లే క్రమంలో బాంబు పేలుడులో చనిపోతాడు. తన మరణానికి ముందు, అతను గిలికి ఆమె కోసం స్వర్గంలో వేచి ఉంటానని ఒక SMS సందేశాన్ని పంపుతాడు. [1]

పాటలు[మార్చు]

All music is composed by కోటి.

సం.పాటపాట రచయితగాయకుడు (లు)పాట నిడివి
1."లైఫ్ అంటే ఎంజాయ్"వెనిగళ్ళ రాంబాబుమధుమిత4:41
2."హైదరాబాద్‌ అంటేనే పానిపూరి.. ఈ చాట్‌ని మించింది లేదు వోరి"మాష్టార్జీశ్రీకాంత్, మురళి, బేబి సాహితి, మాష్టార్జీ, వెంకట్, శివ, వేణుగోపాల్4:06
3."ఇదివరకెరుగని ఈ కథ"వెనిగళ్ళ రాంబాబుకోటి, గీతామాధురి7:43
4."స్వర్గానికి షార్ట్ రూట్"వెనిగళ్ళ రాంబాబుశ్రీకృష్ణ, రఘురాం, హనుమాన్ మురళి, శ్రీకాంత్, సుధాకృష్ణ4:33
5."ఇదివరకెరుగని ఈ కథ (విషాద)"వెనిగళ్ళ రాంబాబుఉష1:15
Total length:22:18

మూలాలు[మార్చు]

  1. Super Admin. "Manorama – Review". ఫిల్మీబీట్. Retrieved 11 February 2022.

బయటిలింకులు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మనోరమ