మాళవిక (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాళవిక
జననం
శ్వేత కొన్నూర్ మీనన్

(1979-07-19) 1979 జూలై 19 (వయసు 44)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1999 - 2009
2022 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిసుమేష్ మీనన్ (వివాహం.2007)
పిల్లలుఆరవ్, ఆన్య
తల్లిదండ్రులు
  • జయవిభవ్ కొన్నూరు (తండ్రి)
  • ఐశ్వర్య కొన్నూరు (తల్లి)

మాళవిక దక్షిణ భారత చలనచిత్ర నటి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించిన మాళవిక, శ్రీకాంత్ హీరోగా నటించిన చాలాబాగుంది చిత్రం ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.

హీరోయిన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, గ్లామర్‌ లేడీ విలన్‌ ఇలా పలు కోణాల్లో వెండితెరపై కనిపించే మాళవిక 2009 నుంచి సినిమాలకు దూరంగా ఉంది. తిరిగి 2022లో పొన్‌ కుమరన్‌ దర్శకత్వంలో మిర్చి శివ - జీవా నటిస్తున్న మల్టీస్టారర్‌ హాస్యభరిత చిత్రం గోల్‌మాల్‌లో ఓ కీలక పాత్రతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

మాళవిక 1979, జూలై 19న కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో జన్మించింది. బి.కాం వరకు చదివింది.[2]

వివాహం[మార్చు]

2007లో పారిశ్రామికవేత్త సుమేష్ మీనన్ తో మాళవిక వివాహం చేసుకుంది.

నటించిన చిత్రాల జాబితా[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
1999 యునాయి తేడి మాళవిక తమిళం
ఆనంద పూంగత్రే దివ్య తమిళం
రోజవనం సింధు తమిళం
పూపరిక వరుగీరోం ప్రియా తమిళం
చోర చిత్తా చోర కన్నడ
2000 చాలాబాగుంది సీత తెలుగు
కంద కదంబ కతీర్ వేల తమిళం
వేట్రి కోడి కట్టు అముద తమిళం
సీను తమిళం
2001 దీవించండి శ్వేత తెలుగు
శుభకార్యం తెలుగు
నవ్వుతూ బతకాలిరా డా. సంధ్య తెలుగు
లవ్లీ నివేద మహదేవన్ తమిళం
2002 ప్రియ నేస్తమా తెలుగు
పాంటోం పైలే మలయాళం
2003 డర్నా మనా హై నేహ హిందీ
2004 పేరఝాగన్ తమిళం అతిథి పాత్ర
వసూలు రాజా ఎం.బి.బి.ఎస్ ప్రియా తమిళం
అప్పారావు డ్రైవింగ్ స్కూల్ మహాలక్ష్మీ తెలుగు
2005 అయ్యా తమిళం
చంద్రముఖి ప్రియా తమిళం
పాకల్ నక్షత్రంగల్ మలయాళం
నైనా ఖేమి హిందీ
సీ యూ ఎట్ 9 కిమ్, జూలియట్ హిందీ
2006 పాస కిలిగల్ ప్రియా తమిళం
చితిరం పెసుతడి తమిళం అతిథి పాత్ర
తిరుట్టు పయాలే రూపిణి తమిళం
కైవంత కలై తమిళం అతిథి పాత్ర
2007 వ్యాపారి తమిళం
తిరుమగన్ మైనా తమిళం
శబరి తమిళం
మణికండ తమిళం
మాయ కన్నడి మాళవిక తమిళం అతిథి పాత్ర
నాన్ అవనిల్లై రేఖా విగ్నేష్ తమిళం
అర్పుత తీవు తమిళం అతిథి పాత్ర
మచకారన్ మాళవిక తమిళం అతిథి పాత్ర
2008 సింగకుట్టి మాళవిక తమిళం అతిథి పాత్ర
కట్టువిరియన్ తమిళం
కురువి మాళవిక తమిళం అతిథి పాత్ర
ఆయుధం సైవోం మాళవిక తమిళం అతిథి పాత్ర
2009 అరుపడై తమిళం అతిథి పాత్ర
సామ్రాజ్యం తెలుగు అతిథి పాత్ర
ఆంజనేయులు తెలుగు అతిథి పాత్ర
2022 గోల్‌మాల్‌ మంగమ్మ తమిళం చిత్రీకరణలో ఉంది

మూలాలు[మార్చు]

  1. "లేటు వయసులో రెండో ఇన్నింగ్స్‌." www.andhrajyothy.com. Archived from the original on 2022-03-24. Retrieved 2022-03-24.
  2. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "మాళవిక , Malavika(actress)". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 1 July 2017.