ముఫ్తీ మహమ్మద్ సయ్యద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mufti Mohammad Sayeed
ముఫ్తీ మహమ్మద్ సయ్యద్

పదవీ కాలం
మార్చి 1, 2015 – జనవరి 7, 2016
గవర్నరు నరేంద్రనాథ్ వోహ్రా
నిర్మల్ కుమార్ సింగ్
ముందు గవర్నర్ పాలన
తరువాత మెహబూబా ముఫ్తి
(Designate)
పదవీ కాలం
నవంబరు 2, 2002 – నవంబరు 2, 2005
గవర్నరు గిరీష్ చంద్ర సక్సేనా
శ్రీనివాస కుమార్ సిన్హా
ముందు గవర్నర్ పాలన

భారత ప్రభుత్వ హోం మంత్రి
పదవీ కాలం
2 డిసెంబరు 1989 – 10 నవంబరు 1990
ప్రధాన మంత్రి వి.పి.సింగ్
ముందు సర్దార్ బూటాసింగ్
తరువాత చంద్రశేఖర్

వ్యక్తిగత వివరాలు

జననం (1936-01-12)1936 జనవరి 12
బాబా మొహల్లా, బిజ్‌బెహరా, అనంతనాగ్/ఇస్లామాబాద్,జమ్మూ, కాశ్మీర్, బ్రిటిష్ ఇండియా
మరణం 2016 జనవరి 7(2016-01-07) (వయసు 79)
ఎయిమ్స్, న్యూఢిల్లీ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జమ్మూ, కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(1999—ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (1991—1999; 1987 కు ముందు)
జనతా దళ్ (1987—1991)
సంతానం 3 (మహబూబా ముఫ్తీ తో కలసి)

ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ (జననం 12 జనవరి 1936 – మరణం 7 జనవరి 2016) జమ్మూ&కాశ్మీరు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. 2002 -2005 మధ్య తొలిసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. తిరిగి 2015 మార్చి 1న బీజేపీ సహకారంతో తిరిగి రెండోసారి ముఖ్యమంత్రిగా తాను జనవరి 2016లో మరణించేంతవరకు ఉన్నారు. ఆయన 1989 -90 మధ్య కాలంలో కేంద్ర హోంమంత్రిగా వ్యవహరించారు.[1] ఆయన 1990లో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీని స్థాపించారు.[2] ఆయన అనారోగ్యంతో 2016 డిసెంబరు 24 వ తేదీన ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి జనవరి 7 2016 న మరణించారు.[3][4]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన జనవరి 12 1936 న అనంతనాగ్ జిల్లాలోని బిజ్‌బెహరా పట్టణంలో జన్మించారు. ప్రాథమిక విద్యను శ్రీనగర్ లోనూ, న్యాయశాస్త్రం, అరబిక్ భాషలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలను ఆలీఘర్ విశ్వవిద్యాలయంలోనూ రాజకీయాలకు రాకముందే పూర్తిచేసారు.[5]

ప్రముఖ రాజజీయవేత్త అయిన మహబూబా ముఫ్తి ఆయన కుమార్తె.[6]

రాజకీయ జీవితం[మార్చు]

1950ల్లో ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని డెమొక్రాటిక్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ద్వారా ప్రారంభించారు. ఆ తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైంది. కాంగ్రెస్‌ పార్టీని కాశ్మీర్‌లో బలీయమైన శక్తిగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకం. 1967లో సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1972, 1975 లలో కేబినెట్‌ మంత్రి అయ్యారు[7]. 1975లో జమ్ము కాశ్మీర్‌ పీసీసీ చీఫ్‌ అయ్యారు. ఆయన 1987 వరకు కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు.[8] ఆయన 1986లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ చేతులు కలిపాయి[8]. ఆయన 1986లో రాజీవ్ గాంధీ కేబినెట్‌లో పర్యాటక, పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు[7]. 1987 వరకూ కాంగ్రె్‌సలో ఉన్న ఆయన ఆ ఏడాది అక్టోబరులో వీ.పీ.సింగ్‌తో కలిసి జన్‌మోర్చాను స్థాపించారు. 1989 లో ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వీ.పీ.సింగ్‌ నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ సర్కారులో చేరి దేశానికి తొలి/ఏకైక ముస్లిం హోం మంత్రి అయ్యారు[9][10] . 1987లో కాంగ్రె్‌సను వీడిన ముఫ్తీ మళ్లీ పీ.వీ.నరసింహారావు హయాంలో కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు. 1999లో మళ్లీ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తన కుమార్తె మెహబూబా ముఫ్తీతో కలిసి పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ) ని స్థాపించారు. 2002లో కాంగ్రెస్‌తో జతగట్టి తొలిసారి జమ్ము కాశ్మీర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

మళ్లీ గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి, ముస్లింలు అధికంగా ఉండే జమ్ము కాశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ కూటమి కట్టడం వెనుక కీలక పాత్ర పోషించారు. రెండోసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. 1989లో కేంద్ర హోం మంత్రిగా సయీద్‌ బాధ్యతలను స్వీకరించిన కొద్ది రోజులకే ఆయన కూతురు రుబైయాను కాశ్మీర్‌ తీవ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. రుబైయా కిడ్నాప్‌ అప్పట్లో దేశంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. సాక్షాత్తూ దేశ హోం మంత్రి కూతురే కిడ్నాప్‌ అయితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. కరుడుగట్టిన ఐదుగురు తీవ్రవాదులను విడిచిపెట్టి రుబైయాను కాపాడుకోవాల్సి రావడం దేశ ప్రతిష్ఠను కొంత దిగజార్చింది.[11]

మరణం[మార్చు]

ముఫ్తి మహమ్మద్ సయ్యిద్ జనవరి 7 2016 న తెల్లవారు జామున డిల్లీ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మరణించారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. అనారోగ్యం కారణంగా ఆయన డిసెంబరు 24 న ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత కొద్ది రోజులుగా వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నారు.[12]

మూలాలు[మార్చు]

  1. "Mufti Mohammad Sayeed: Another chance in a chequered career". Business Standard. 24 December 2014. Retrieved 23 June 2015.
  2. Mukhtar, Ahmad (July 28, 1999). "Mufti floats new regional party in Kashmir". Rediff.com. Retrieved March 5, 2009.
  3. State (1936-01-12). "CM Mufti Muhammad Sayeed passes away | Only Kashmir - Behind the News". Onlykashmir.in. Archived from the original on 2016-01-08. Retrieved 2016-01-07.
  4. "J&K Chief Minister Mufti Mohammad Sayeed dead". The Hindu (in Indian English). 2016-01-07. ISSN 0971-751X. Retrieved 2016-01-07.
  5. "Mufti Mohammad Sayeed: Much more than Delhi's man in Kashmir". Hindustan Times. 7 January 2016.
  6. "Live: Mufti Mohammad Sayeed to be laid to rest in Bijbehara; Seven-day state mourning declared". Daily News and Analysis. 7 January 2016.
  7. 7.0 7.1 "Mufti Mohammed Sayeed: A political opportunist and stalwart of J&K". IBNLive. 7 January 2016.
  8. 8.0 8.1 Malik, Mohammed Sayeed (30 October 2002). "Mufti's fateful links". Rediff.com. Retrieved 5 March 2009.
  9. Prabhat, Abhishek (29 October 2002). "Profile: Mufti Mohammad Sayeed". BBC News. BBC. Retrieved 5 March 2009.
  10. "Mufti: A man caught in the 'mid-stream' tragedy". Hindustan Times. 7 January 2016.
  11. "ముఫ్తి సయీద్‌ కన్నుమూత, 08-01-2016 00:57:37, ఆంధ్రజ్యోతి". Archived from the original on 2016-01-08. Retrieved 2016-01-08.
  12. "జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తి మహమ్మద్ సయ్యిద్ కన్నుమూత". Archived from the original on 2016-01-09. Retrieved 2016-01-08.

ఇతర లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.