యశోద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యశోద
రాజా రవివర్మ గీచిన చిత్రం
సమాచారం
దాంపత్యభాగస్వామినందుడు
పిల్లలుశ్రీ కృష్ణుడు, బలరాముడు, సుభద్ర (దత్తత)

యశోద (సంస్కృతం: यशोदा) భాగవతంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి.

కృష్ణుని పెంచిన తల్లిగా[మార్చు]

నందుని భార్య. మహాభాగవతం ప్రకారం కృష్ణుడి పుట్టుకతో మేమమామకు ప్రాణగండం ఉంటుంది. దీంతో తన సోదరి దేవకి సంతానంపై కంసుడు కనిపెట్టుకుని ఉంటాడు. ఆమెకు మగపిల్లాడు పుడితే తనకు ప్రాణహాని ఉంటుందనే భయంతో గడుపుతుంటాడు. దేవకి వరుసగా ఎనిమిది మంది ఆడపిల్లలకు జన్మనిస్తుంది. తరువాత సంతానంగా ఒక రాత్రి వేళ కృష్ణుడు జన్మిస్తాడు. ఈ విషయం తెలిస్తే మేనమామ కంసుడు కృష్ణుడికి హాని తలపెడతాడనే భయంతో దేవకి బిడ్డను నంద, యశోదలకు ఇచ్చివేయాలని భర్త వసుదేవుడికి చెబుతుంది. దీంతో ఒక బుట్టలో కృష్ణుడిని ఉంచి, దానిని తలపై ఉంచుకుని వసుదేవుడు బయల్దేరుతాడు. నంద-యశోదలకు ఆ బిడ్డను అప్పగించి, ఆమె ఆడ శిశువు యోగమాయను తాను తీసుకుని తిరిగి వస్తాడు. దేవకికి మళ్లీ ఆడపిల్లే పుట్టిందని కంసుడిని, మిగతా జనాన్ని దేవకీ వాసుదేవులు నమ్మిస్తారు. ఆ విధంగా కృష్ణుడికి మేనమామ నుంచి గండాన్ని తప్పిస్తారు. కానీ, తరువాత కాలంలో కృష్ణుడు మధురా నగరాన్ని పాలించే కంసుడిని సంహరిస్తాడు[1].

కృష్ణుని బాల్యంలో లాలించి పెందింది. అతని బాల్య క్రీడల్లో భాగంగా వెన్నదొంగ అయిన కృష్ణుడిని రోటికి కట్టివేయడం, గోపికలను కృష్ణుడు ఆటపట్టించడం, తన నోటిలో విశ్వాన్ని యశోదకు చూపడం వంటివి అబ్బురపరుస్తాయి. ఈ విధంగా కృష్ణుడి బాల్యమంతా గోకులంలో యశోద వద్దనే గడుస్తుంది.సాక్షాత్తూ విష్ణువునే బిడ్డగా లాలించే భాగ్యం దక్కిన గొప్ప తల్లి యశోదమ్మ. ఒకసారి కృష్ణుడు మట్టి తిని, తినలేదని అబద్ధం చెబుతాడు. నోరు తెరవాలని యశోద బలవంతం చేస్తుంది. దీంతో నోరు తెరిచిన కృష్ణుడు తన నోటిలో సప్త సముద్రాలను చూపిస్తాడు. మొత్తం విశాల విశ్వాన్ని కూడా ప్రదర్శిస్తాడు. దీంతో యశోద విస్తుపోతుంది. పాల సముద్రంపై తేలియాడే ఆదిశేషుని పానుపుపై లక్ష్మీ సహితంగా ఉన్న విష్ణువును కూడా యశోద ఆ నోటిలో దర్శిస్తుంది.

తల్లి ప్రేమకు, వాత్సల్యానికి యశోద పెట్టింది పేరు. ఇక, కృష్ణుడి సోదరుడైన బలరాముడి తోనూ యశోదకు ఎంతో అనుబంధముంది. బల రాముడు రోహిణి కుమారుడు. ఈయన సోదరి సుభద్ర. యశోద జన్మనిచ్చిన యోగమాయ అంటే సాక్షాత్తూ కాళి అవతారమే. కృష్ణుడి పుట్టుక గురించి కనిపెట్టుకుని ఉన్న కంసుడు.. అతని బదులు యోగమాయ పుట్టిందని తెలిసి ఆమెను కూడా సంహరించడానికి సిద్ధమవుతాడు. దీంతో ఆమె కంసునికి అందకుండా వింధ్య పర్వతానికి ఎగసిపోతుంది. దీంతో ఆమె వింధ్యవాసిని దేవిగా ప్రతీతి అయ్యింది.[2]

మూలాలు[మార్చు]

  1. "అమ్మంటే…యశోదమ్మ – Telugu patrika" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-05-07. Retrieved 2020-05-10.
  2. Ravindra K. Jain (2002). Between History and Legend: Status and Power in Bundelkhand. Orient Blackswan. pp. 31–32. ISBN 9788125021940.


"https://te.wikipedia.org/w/index.php?title=యశోద&oldid=3713393" నుండి వెలికితీశారు