రాజీవ్ సాతావ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజీవ్ సాతావ్

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
2 ఏప్రిల్ 2020 – 16 మే 2021
ముందు హుస్సేన్ దల్వాయి
నియోజకవర్గం మహారాష్ట్ర

లోక్ సభ సభ్యుడు
పదవీ కాలం
16 మే 2014 – 23 మే 2019
ముందు సుభాష్ బాపూరావు వాంఖడే
తరువాత హేమంత్ శ్రీరామ్ పాటిల్
నియోజకవర్గం హింగోలి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 21 సెప్టెంబరు, 1974
పూణే, మహారాష్ట్ర , భారతదేశం
మరణం 2021 మే 16(2021-05-16) (వయసు 46)[1]
పూణే, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి ప్రద్న్య సాతావ్
పూర్వ విద్యార్థి ఐ.ఎల్.ఎస్ లా కాలేజీ, పూణే
వృత్తి రాజకీయ నాయకుడు
మార్చి, 2020నాటికి మూలం [2]

రాజీవ్ సాతావ్ భారతదేశానికి చెందిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలోని హింగోలి నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన మహారాష్ట్ర మాజీ మంత్రి రాజనితాయి సాతావ్ కుమారుడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

రాజీవ్ సాతావ్ 1974, సెప్టెంబరు 21న మహారాష్ట్రలోని పూణేలో జన్మించాడు. ఆయన పుణెలోని ఫెర్గుసన్ కాలేజీ నుండి డిగ్రీ, ఐ.ఎల్.ఎస్ లా కాలేజీ నుండి లా పట్టా అందుకున్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

రాజీవ్ సాతావ్ తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రారంభించాడు. ఆయన పంచాయత్ సభ్యుడిగా మొదలై, హింగోలి జిల్లాలో జెడ్పిటిసిగా పై చేశాడు. రాజీవ్ సాతావ్ 2009 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలమ్నూరి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2009లోనే మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2010లో ఆయన యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. రాజీవ్ సాతావ్ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలోని హింగోలి నియోజకవర్గం నుండి పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

రాజ్యసభ సభ్యుడిగా[మార్చు]

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా 2020 సెప్టెంబరులో మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్ల అంశంపై నోటీసులు ఇచ్చాడు.[4] రాజ్యసభలో వ్యవసాయ రంగ బిల్లులను పార్లమెంటులో ఆమోదించడంపై రాజ్యసభలో నిరసన తెలిపినందుకు, సభకు అంతరాయం కలిగించినందుకు ఆయనతో పటు ఎనిమిది మంది సభ్యులను సస్పెండ్ చేశారు.[5]

మరణం[మార్చు]

రాజీవ్ సాతావ్ 2021, మే 16న పూణేలోని జహంగీర్ ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ మరణించాడు.[6][7]

మూలాలు[మార్చు]

  1. "Congress MP Rajeev Satav dies after recovering from COVID-19". The Economic Times. 16 May 2021. Retrieved 16 May 2021.
  2. https://www.india.gov.in/my-government/indian-parliament/shri-rajeev-shankarrao-satav
  3. The Indian Express (17 May 2021). "Rajeev Satav (1974-2021): Unassuming young face who had a meteoric rise in Congress". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 19 మే 2021. Retrieved 19 May 2021.
  4. Telugu, TV9 (15 September 2020). "మొదలైన రాజ్యసభ.. పెద్దల సభ ముందుకు పలు బిల్లులు". TV9 Telugu. Archived from the original on 19 మే 2021. Retrieved 19 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. 10TV (22 September 2020). "కిసాన్ బిల్లు 2020: రైతులపై డెత్ వారెంట్ అంటున్న కాంగ్రెస్.. దేశవ్యాప్తంగా నిరసనలు Protests against Farm Bills". 10TV (in telugu). Archived from the original on 19 మే 2021. Retrieved 19 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. Prime9News (16 May 2021). "కరోనాతో కన్నుమూసిన కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతన్". Prime9News. Archived from the original on 19 మే 2021. Retrieved 19 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. NTV-Telugu News (16 May 2021). "కాంగ్రెస్ లో విషాదం.. కరోనాతో ఎంపి మృతి". NTV-Telugu News. Archived from the original on 19 మే 2021. Retrieved 19 May 2021.