వశిష్ఠ నారాయణ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వశిష్ఠ నారాయణ సింగ్
వశిష్ఠ నారాయణ సింగ్
జననం(1946-04-02)1946 ఏప్రిల్ 2
బసంత్‌పూర్, భోజ్‌పూర్ జిల్లా, బ్రిటిష్ ఇండియా
మరణం2019 నవంబరు 14(2019-11-14) (వయసు 73)
పాట్నా, బీహార్, భారతదేశం
వృత్తివిద్యావేత్త
పురస్కారాలుపద్మశ్రీ (2020)
విద్యా నేపథ్యం
చదువుకున్న సంస్థలునటర్హాత్ రెసిడెన్షియల్ స్కూలు
పాట్నా సైన్స్ కాలేజీ
యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కెలీ
పరిశోధనలో మార్గదర్శిజాన్ ఎల్. కెల్లీ
పరిశోధక కృషి
పనిచేసిన సంస్థలుయూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్
ఐఐటి, కాన్పూరు
టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ముంబై
ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్, కోల్‌కతా

వశిష్ఠ నారాయణ సింగ్ బీహార్కు చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త. ఈయన ఆర్యభట్ట గణితంలో సాధించలేని ఎనిమిది సమస్యలలో నాలుగు నుండి ఆరు వరకు సమస్యలను సాధించిన మహా మేథావి.

జీవిత విశేషాలు[మార్చు]

బాల్యం-విద్యాభ్యాసం[మార్చు]

డాక్టర్ వశిష్ఠ నారాయణ్ సింగ్ బీహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ లో లాల్ బహదూర్ సింగ్, లహోసా దేవి లకు మొదటి కుమారునిగా జన్మించాడు . ఈయన ఏప్రిల్ 2 1942 న జన్మించారు. ఆయన తండ్రి రాష్ట్ర పోలీస్ విభాగం పోలీసుగా పనిచేశారు. బాల్యంలో వసిష్ఠ నారాయణ సింగ్ ప్రాథమిక విద్యను స్వంత గ్రామంలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన నెహర్తాట్ పాఠశాలలో ఆరవ తరగతిలో చేరాడు. 1962 లో ఆయన మెట్రిక్యులేషన్ పరీక్షను పాసై బీహార్ రాష్ట్రం మొత్తంలో మొదటి స్థానంలో నిలిచిన ప్రజ్ఞావంతుడు.[1]

అమెరికాలో విద్యాభ్యాసం[మార్చు]

పాఠశాల విద్య తరువాత ఆయన ప్రతిష్ఠాత్మక పాట్నా సైన్సు కళాశాలలో చేరారు. ఆ కాలంలో ఆ కళాశాలకు ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయిన డా. పి. నాగేంద్ర ప్రిన్సిపాల్ గా యున్నారు. ఆయన వశిష్ఠ నారాయణ లోని ప్రతిభను గుర్తించారు. గమ్మత్తుగా అదే సమయంలో అమెరికా లోని కాలిఫోర్నియా-బెర్కిలీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ స్కాలర్ జాన్ ఎల్.కెల్లీ అక్కడే ఉన్నారు. ప్రొఫెసర్ కెల్లీ గణిత శాస్త్రంలోని ప్రముఖ విభాగం అయిన "జనరల్ టోపోలజీ" అనే విశిష్టమైన పుస్తకం వ్రాసి ప్రసిద్ధి పొందారు. ఈ పుస్తకం ఎలాంటి గణీత శాస్త్రవేత్తకైనా కొంత సమయం పట్టిన విశిష్టమైనది. ప్రొఫెసర్ కెల్లీ పాట్నా లోని ప్రపంచ గణిత కాన్ఫరెన్స్ లో పాల్గొనుటకు వచ్చారు. ప్రొఫెసర్ నాగేంద్ర కెల్లీతో ఇంటర్వ్యూ చేసే భాగ్యాన్ని వశిష్ట నారాయణ సింగ్ కు కల్పించారు. ప్రొఫెసర్ కెల్లీ యువ విద్యార్థి అయిన నారాయణ సింగ్ కు అనేక ప్రశ్నలు వేశారు. ఆయన అన్నింటికీ సరైన సమాధానములు చెప్పాడు. ఆయన విశేష ప్రతిభ చూసిన ప్రొఫెసర్ కెల్లీకి ఆయనను తన అధ్వర్యంలో అమెరికాలో బోధించాలనే కోరిక కలిగింది. ప్రిన్సిపాల్ డా.నాగేంద్ర వెంటనే ప్రత్యేక పరీక్షలను వశిష్ఠబాబుకు పెట్టాడు అందులో ఆయన శత శాతంలో ఉత్తీర్ణుడై ఆ కళాశాలలోని విద్యాభ్యాసాన్ని ముగించాడు. ప్రొఫెసర్ కెల్లీ ఆయనకు ఉన్నత చదువు కోసం బర్కిలీ రావాలని అభ్యర్థించాడు. దానికి డా. సింగ్ తన స్వంత ఖర్చులతో యు.ఎస్.ఎ రావడం కష్టమని తెలిపాడు.దానికి ప్రొఫెసర్ కెల్లీ దానికి సహాయం అందిస్తానని వాగ్దానం చేశాడు. ప్రొఫెసర్ కెల్లీ ఆయనకు వీసా, విమాన టికెట్లను ఏర్పాటుచేసి "యూనివర్శితీ ఆఫ్ కాలిఫోర్నియా-బెర్కిలీ" (UCB) లో చేర్చాడు. ఆ విధంగా 1969 లో ఆయన కాలిఫోర్నియా, యు.ఎస్.ఎలో పరిశోధనా స్కాలర్ గా నిలిచాడు.[2][3] వశిష్ట నారాయణ సింగ్ సిగ్గుతో కూడిన వ్యక్తిత్వం అయినందున ప్రొఫెసర్ కెల్లి ఆయనపై విశేషమైన శ్రద్ధ తీసుకున్నారు.ఆయన ఏ హె.ఒ.డి క్రింద పనిచేయకుండా విశేష శైలిలో పి.హె.డి పూర్తి చేసి "నాసా"లో పనిచేయుటకు సంకల్పించారు. అచట ఆయన "సైక్లిక్ వెక్టర్స్ స్పేస్ థియరీ/రీప్రొడ్యూసింగ్ కెర్నల్స్ అండ్ ఆపరేటర్స్ విత్ ఎ సైక్లిక్ వెక్టార్" అనే అంశం పై పరిశోధనలు చేశారు. ఆయన చేసిన పరిశోధన ఆయనను ప్రపంచంలో విజ్ఞానశాస్త్రంలో గొప్ప శాస్త్రవేత్తగా నిలిపాయి. ఆయన 'ఆల్బర్ట్ ఐన్‌స్టీన్" వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్త ల రచనలను కూడా సవాలూ చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.

ఉద్యోగం[మార్చు]

తన పరిశోధన పూర్తి చేసిన తర్వాత ఆయన తిరిగి భారతదేశం వచ్చారు కానీ వెంటనే అమెరికా వెళ్ళుటకు నిర్ణయించుకున్నాడు. ఆయన అమెరికాలో రెండవసారి పనిచేసిఅన్ కాలంలో వాషింగ్టన్ లో గణిత శాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా నియమింపబడ్డారు. అచట ఆయన ఆ విభాగాధిపతి యొక్క కుమార్తెతో ప్రేమలో పడ్డాడని ఆమెను వివాహం చేసుకుంటాడనీ పుకార్లు వ్యాపించాయి. ఆయన తల్లిదండ్రుల ఒత్తిడి, భారతదేశ ఆదర్శవాద సిద్ధాంతాలకు ప్రాధాన్యతనిచ్చి భారతదేశానికి తిరిగివచ్చాడు. ఆయన బెర్కిలీలో ఉన్నప్పుడు అనేక డ్రగ్స్ తీసుకొనేవాడని పుకార్లు వ్యాపించాయి. ఆయన 1971 లో భారతదేశానికి వచ్చాడు. అపుదు ఐ.ఐ.టి, కాన్పూర్ లో ప్రొఫెసర్ గా చేరాడు. ఆ తరువాత ఎనిమిది నెలలు అచట పనిచేశాడు. ఆ తరువాత ఆయన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో ప్రొఫెసర్ గా చేరాడు. తరువాత 1973 లో కలకత్తా లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో శాశ్వత ప్రొఫెసర్ గా పనిచేశారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

1973 లో ఆయనకు సైనిక అధికరి అయిన డా.దీప్ నారాయణ సింగ్ కుమార్తె అయిన "వందనా రాణి"తో వివాహమైనది. వశిష్ట నారాయణ సింగ్ తల్లిగారి కథనం ప్రకారం వివాహమైన మూడు రోజుల తరువాత ఆయన భార్య బి.ఎ పరీక్షలు వ్రాయుటకు తన కన్నవారింటికి వెళ్ళినదనీ, ఆయన కలకత్తాకు తిరిగి వెళ్లారనీ, ఆయన సహోద్యోగులు ఆయనపై అసూయపడేవారనీ తెలిపారు.[4] అందువల్లనే ఆయనకు మొట్టమొదటిసారి మతిస్థిమితం లేకుండా అయినది. ఆయన కుటుంబం ఆయనకు వారి స్తోమత ప్రకారం వైద్యాన్ని అందించింది. ఆయనను 1976 లో రాంచీ లోని మెంటల్ హాస్పటల్ లో చేర్పించుటకు "నెటర్తాట్ ఓల్డ్ బోయ్స్ అసోసియేషన్" కీలక పాత్ర పోషించింది.

కార్పూరి ఠాకూర్ వారి పరిపాలనలో ఆయనకు రాంచీ లోని "డేవిడ్ క్లినిక్" అనే ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. అచట ఆయన ఆరోగ్య పరిస్థితి వేగంగా వృద్ధి చెందింది. కానీ తరువాతి కాలంలో బీహార్ లో ఏర్పడిన ప్రభుత్వం ఆయన ఆరోగ్యం పై ఖర్చుచేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఆయన 1976 నుండి షిజోఫ్రెనియా అనే వ్యాధితో బాధ పడుతున్నారు. దీని ఫలితంగా ఆయన డేవిడ్ క్లినిక్ నుండి రాంచీ మెంటల్ హాస్పటల్ కు పంపించారు.

అదే కాలంలో అతనికి ఆమె భార్య విడాకులు తీసుకొన్న కారణంగా కూడా మసస్తాపానికి గురయ్యారు. వైద్యులు ఈ దురదృష్టకర సంఘటన జరిగడం తన మానసిక స్మృతి తప్పడానికి కారణమని తెలిపారు. ఆయన ఒక సన్యాసి భార్య (అరుంధతి) ని కోరుకున్నారు. ఆయనకు ఒక స్త్రీ తటస్థించింది. ఆమె ఆయనతో "మీరు ఒక విలువైన వ్యక్తి కావచ్చు, కానీ మీరు నాకు యోగ్యత లేని వ్యక్తి" అని పలికింది. ఈ మాటలు ఆయన హృదయాన్ని గాయపరచింది.

1989 లో ఆయన తండ్రి మరణం తరువాత వశిష్ట బాబు ఆయన స్వగ్రామాన్ని సందర్శించాడు. ఆయన ఒక ఉపన్యాసాన్ని కూడా యిచ్చాడు. ఆ సమయంలో ఆయన సాధారణ స్థితిలోనే ఉన్నాడు. ఆయన తండ్రి అంత్యక్రియలు చేసిన తరువాత రాంచీ వెళ్ళాడు. అచట ఆయన సోదరుడు అయోధ్య ప్రసాద్ వైద్యులతో సంప్రదించి ఆయనను పూనే నుండి వశిష్ట బాబుతో పాటు భగల్పూర్ జనతా ఎక్స్‌ప్రెస్ లో బయలుదేరాడు. దారిలో వశిష్ఠబాబు మధ్యప్రదేశ్ లోని గదర్వారా స్టేషనులో ఎవరికీ తెలియకుండా దిగాడు. తరువాత అతని సోదరుడు అతన్ని కనుగొనేందుకు గట్టి ప్రయత్నం చేశాడు, కానీ ఫలించలేదు.ఆయన కుటుంబం, గ్రామస్థులు ఆయన మరణించాడనీ, ఆయన ఆరోగ్యానికి మరణం అదృష్టమనీ భావించారు. కానీ 1993 లో శరణ్ జిల్లా, డోరిగంజ్ లో ఆయన హఠాత్తుగా కనిపించారు. ఆయన గ్రామస్థులు బసంతపూర్ పుత్రుడికి స్వాగతం యివ్వడానికి బయలుదేరారు.

వశిష్టబాబు "నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్", బెంగలూరులో ప్రభుత్వ ఖర్చులతో చికిత్స కోసం చేరాడు. ఆయన ఫిబ్రవరి 1993 నుండి జూన్ 1994 వరకు ఆ హాస్పటల్ లోనే ఉన్నారు. కానీ కోలుకోలేదు. ఆ వైద్యశాలలోని వైద్యులు ఆయనను యు.ఎస్.ఎలో చికిత్స కోసం పంపించాలని కోరారు. కానీ ఆయనకు భారత దేశంలో మంచి వైద్య సహాయం లేదు లేదా ఆయనను మంచి కుటుంబ వాతావరనంలో ఉంచాలని నిర్ణయించారు. అప్పటి నుండి ఆయన తన సమయాన్ని స్వగ్రామంలోనే గడుపుతున్నారు. ఆయన మెదడులోని వైపరీత్యాలకు మంచి ప్రేమతో కూడిన కుటుంబ వాతావరణమే మందు అని చెప్పారు.

మూలాలు[మార్చు]

  1. "జీవిత విశేషాలు". Archived from the original on 2013-12-21. Retrieved 2014-04-15.
  2. "కాలిఫోర్నియా లో పి.హె.డి". Archived from the original on 2016-01-17. Retrieved 2014-04-15.
  3. "mathematics geneology project". Archived from the original on 2013-12-22. Retrieved 2014-04-15.
  4. "theranveer.blogspot.in". Archived from the original on 2013-12-21. Retrieved 2014-04-15.

ఇతర లింకులు[మార్చు]