వెంట్రిలాక్విజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెంట్రిలాక్విజం ప్రదర్శిస్తున్న కళాకారుడు

వెంట్రిలాక్విజం వేదికల మీద ప్రదర్శించే ఒక కళ. ఇందులో కళాకారుడు ఒక బొమ్మను చేతిలో ఉంచుకుని దానిని ముఖ కవళికలు మారుస్తూ, తన నోరు కదపకుండా మాట్లాడుతూ బొమ్మ మాట్లాడుతున్నట్లు భ్రమను కలుగజేస్తాడు.[1]

చరిత్ర[మార్చు]

వెంట్రిలాక్విజం మొదట్లో ఒక మతాచారంగా ఉండేది.[2] వెంట్రిలాక్విజం అనే పదానికి లాటిన్ భాషలో కడుపులోనుంచి మాట్లాడటం అనే అర్థం ఉంది.[3] గ్రీకు ప్రజలు దీన్ని గ్యాస్ట్రోమాన్సీ అని పిలిచేవారు. వీరు కడుపులో ఉత్పన్నమయ్యే శబ్దాలను చనిపోయిన వారి గొంతులనీ, వెంట్రిలాక్విస్ట్ ఆ శబ్దాలను అర్థం చేసుకుని చనిపోయిన వారితో మాట్లాడగలడనీ, భవిష్యత్తును గురించి చెప్పగలరనీ విశ్వసించేవారు.

భారతదేశంలో వెంట్రిలాక్విజం[మార్చు]

భారతదేశంలో ఈ కళ అడుగుపెట్టి సుమారు వందేళ్లకుపైగా అవుతుంది. భారతదేశంలో ఈ కళను మొట్టమొదటిసారిగా వై. కె. పథ్యే అనే వ్యక్తి ప్రదర్శించాడు.[4] ఈయన వృత్తి రీత్యా మెజీషియన్. తనకు కావలసిన వస్తువుల కోసం ఇంగ్లండు వెళ్ళేవాడు. అలా అనుకోకుండా అక్కడ ఓ సైనికుడు బొమ్మతో మాట్లాడిస్తూ తన తోటివారిని నవ్వించడం చూసి దానిమీద ఆసక్తి పెంచుకున్నాడు. అమెరికా నుంచి వెంట్రిలాక్విజం మీద ఓ పుస్తకం కూడా తెచ్చుకుని చదివాడు. దాన్ని చదివి సొంతంగా వెంట్రిలాక్విజం నేర్చుకుని 1916లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో వెంట్రిలాక్విజం ప్రదర్శన ఇచ్చాడు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "ఈ బొమ్మ ఎలా మాట్లాడుతుందో తెలుసా..." andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 15 నవంబరు 2016. Retrieved 26 April 2017.
  2. Howard, Ryan (2013). Punch and Judy in 19th Century America: A History and Biographical Dictionary. McFarland. p. 101. ISBN 0-7864-7270-7
  3. The Concise Oxford English Dictionary. 1984. p. 1192. ISBN 0-19-861131-5.
  4. "రాందాస్ పథ్యే గురించి". vpuppets.com. Retrieved 26 April 2017.