సందడే సందడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సందడే సందడి
దర్శకత్వంముప్పలనేని శివ
రచనచింతపల్లి రమణ (మాటలు), ముప్పలనేని శివ (స్క్రీన్ ప్లే)
నిర్మాతఆదిత్యరామ్
తారాగణంజగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, రాశి
ఛాయాగ్రహణంరమణ రాజ్
కూర్పుకె. రమేష్
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
ఆదిత్యరాం మూవీస్
విడుదల తేదీ
2002 డిసెంబరు 13 (2002-12-13)
సినిమా నిడివి
149 ని
దేశంభారతదేశం
భాషతెలుగు

సందడే సందడి 2002 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఈ చిత్రాన్ని ఆదిత్యరాం మూవీస్ పతాకంపై ఆదిత్య రాం నిర్మించాడు. ఇందులో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, శివాజీ, రాశి, ఊర్వశి, సంఘవి, కోవై సరళ ముఖ్య పాత్రల్లో నటించారు.[1]

కథ[మార్చు]

బాలు, చందు, కామేష్ అనే ముగ్గురు మిత్రులు తమ కుటుంబాల్లో చిన్న చిన్న సమస్యలతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో వ్యాపారాలు సరిగా నడవక ఆత్మహత్య చేసుకోబోతున్న లక్ష్మీనారాయణ అనే వ్యాపారవేత్తను ఆత్మహత్య చేసుకోకుండా ఆపుతారు. అతని వ్యాపారాన్ని తమ ఆలోచనలతో గాడిలో పెట్టి అతని దగ్గర ఉద్యోగస్తులుగా స్థిరపడతారు. ఈ ముగ్గురికీ వివిధ కారణాలతో సంసార సుఖం ఉండదు. చందు భార్య దైవభక్తురాలు. పూజలు, పునస్కారాల పేరుతో భర్తను దగ్గరికి రానివ్వదు. బాలు భార్య ఒక న్యాయవాది. ఆమెకు పనే లోకం. దాంతో ఆమె భర్తను చెంత చేరనివ్వదు. కామేష్ భార్య ఒక టి.వి నటి, ఆమె తన అందాన్ని కాపాడుకోవడం కోసం భర్తకు దూరంగా ఉంటుంది.

ఈ లోపు లక్ష్మీనారాయణ ముగ్గురు కూతుర్లు విదేశాల్లో చదువుకుని అక్కడకు వస్తారు. వాళ్ళు తండ్రి చెప్పినట్లు ఆయన స్నేహితుడి కొడుకులను వివాహం చేసుకోవడానికి ఒప్పుకోరు. అప్పుడు వారికి ఒక ఆలోచన వస్తుంది. ఎవరైనా ముగ్గురు అందమైన యువకులను వాళ్ళను ప్రేమించినట్లు నటింపచేసి తర్వాత మోసం చేస్తే అప్పుడు తమ మాట విని తాము చూసిన సంబంధాలే పెళ్ళి చేసుకుంటారని అనుకుంటాడు. అందుకోసం తనదగ్గర నమ్మకస్తులుగా పనిచేసే చందు, బాలు, కామేష్ ల మీదనే ఆధారపడతాడు లక్ష్మీనారాయణ. ఈ ముగ్గురు కూడా తమకు ఆయన సకల సౌకర్యాలు కల్పిస్తుండటంతో సరేనని ఒప్పుకుంటారు. తీరా వాళ్ళని మోసం చేసే సమయం వచ్చేసరికి వారికి వాళ్ళని నిజంగానే పెళ్ళి చేసుకోవాలనే కోరిక పుడుతుంది. చివరికి వారు తమ భార్యలను వదిలేసి వాళ్ళను పెళ్ళిచేసుకున్నారా లేదా అనేది మిగతా కథ.

నటీనటులు[మార్చు]

పాటల జాబితా[మార్చు]

అవునా అవునా ప్రేమలో , రచన: సామవేదం షణ్ముఖశర్మ, గానం. టిప్పు , సుజాత

రావే రాజకుమారి రచన: కృష్ణసాయి , గానం.రఘు కుంచె , సందీప్ , నిత్య సంతోషినీ

సందడే సందడి, రచన: భువన చంద్ర , గానం . శ్రీరామ్ పార్ధసారధి , కుషి మురళీ,హనుమంత రావు

ఏంది బాయ్ ఏంది బాయ్, రచన: సాహితి, గానం.శంకర్ మహదేవన్

హాయ్ హాయ్ టీనేజ్ సీజన్, రచన: కృష్ణ సాయి, గానం. అనురాధ శ్రీరామ్ , నిత్య సంతోషినీ

బొండాన్న బజ్జినా , రచన: పోతుల రవికిరణ్ , గానం.మాల్గుడి శుభ , రాధిక , గంగ.

మూలాలు[మార్చు]

  1. "Telugu Cinema - Review - Sandade Sandadi - Jagapati Babu, Rajendra Prasad, Sivaji, Sanghvi, Raasi, Urvas, SonaliJoshi, Swapna Madhuri, Sony Raj". www.idlebrain.com. Retrieved 2021-10-04.

బయటి లంకెలు[మార్చు]