సాహసవీరుడు - సాగరకన్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాహసవీరుడు - సాగరకన్య
సాహసవీరుడు - సాగరకన్య సినిమా పోస్టర్
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
రచనపరుచూరి సోదరులు
నిర్మాతబూరుగుపల్లి శివరామకృష్ణ
తారాగణంవెంకటేష్,
శిల్పా శెట్టి,
మాలాశ్రీ
ఛాయాగ్రహణంఎ. విన్సెంట్
అజయ్ విన్సెంట్
కూర్పుకె.ఎం. మార్తాండ్
మార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఎం.ఎం.కీరవాణి
నిర్మాణ
సంస్థ
వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్
విడుదల తేదీ
1996 ఫిబ్రవరి 9 (1996-02-09)
సినిమా నిడివి
139 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

సాహసవీరుడు - సాగరకన్య 1996, ఫిబ్రవరి 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మాణ సారథ్యంలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్, శిల్పా శెట్టి, మాలాశ్రీ నటించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించాడు.[1] బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ఈ చిత్రం, 1997లో సాగర కన్య పేరుతో హిందీలోకి అనువాదం చేయబడింది.[2]

కథా నేపథ్యం[మార్చు]

రవిచంద్ర (వెంకటేష్), సాగర కన్య (శిల్ప శెట్టి) అనే మత్స్యకన్య గురించిన ఈ చిత్రమిది. బంగారు రాజు (కైకాల సత్యనారాయణ) ఓడను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. నిధిని కనుగొనడంకోసం మంత్రగత్తెను సంప్రదిస్తాడు. ఒక మత్స్యకన్య సహాయంతో నిధిని తిరిగి పొందవచ్చని తెలుసుకుంటాడు. ప్రమాదవశాత్తు ఒకరోజు సముద్రం నుండి వచ్చిన మత్స్యకన్య శరీరాన్ని కోల్పోయి, ఒక అందమైన అమ్మాయిగా మారుతుంది. ఆమెపై నీరు పడినప్పుడు మళ్ళీ మత్స్యకన్యగా మారుతుంది. రవిచంద్ర దగ్గరికి వచ్చిన మత్స్యకన్యకు బంగారం అని పేరు పెడుతారు. దాంతో బంగారం రవిని ప్రేమిస్తుంది. మత్స్యకన్య గురించి తెలుసుకున్న మంత్రగత్తె, ఆమె ద్వారా నిధిని కనుగొనే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో బంగారం అనేక ఇబ్బందులు పడుతుంది. రవి సాహసంతో మత్స్యకన్యను రక్షిస్తాడు. రవి, అతని బంధువులను కలిపి బంగారం తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతుంది.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

సాహసవీరుడు - సాగరకన్య
పాటలు by
Released1996
Genreపాటలు
Length30:00
Labelమెలోడి మేకర్స్
Producerఎం.ఎం. కీరవాణి
ఎం.ఎం. కీరవాణి chronology
పెళ్ళి సందడి
(1996)
సాహసవీరుడు - సాగరకన్య
(1996)
రాయుడుగారు-నాయుడుగారు
(1996)

ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. అన్నిపాటలు విజయం సాధించాయి. మెలోడి మేకర్స్ ఆడియో కంపెనీ నుండి పాటలు విడుదలయ్యాయి.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."అబ్బబ్బో అబ్బబ్బో (రచన: భువనచంద్ర)"భువనచంద్రఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర5:03
2."ఘడియ ఘడియకో ముద్దు (రచన: భువనచంద్ర)"భువనచంద్రఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర5:10
3."మీనా మీనా (రచన: వేటూరి సుందరరామ్మూర్తి)"వేటూరి సుందరరామ్మూర్తిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎం. ఎం. శ్రీలేఖ5:10
4."శ్రీనాథుని కవితలోని (రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు)"జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:56
5."అప్పనంగ చిక్కెనమ్మ (రచన: వెన్నెలకంటి)"వెన్నెలకంటిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సింధు4:52
6."పెట్టమంది పెట్టమంది (రచన: వెన్నెలకంటి)"వెన్నెలకంటిమనో, కె.ఎస్. చిత్ర5:19
Total length:30:00

మూలాలు[మార్చు]

  1. ఐడ్రీమ్ పోస్ట్, సినిమాలు (7 April 2020). "గురి తప్పిన 'సాహస వీరుడు'". www.idreampost.com (in ఇంగ్లీష్). Archived from the original on 5 ఆగస్టు 2020. Retrieved 22 June 2020.
  2. ఫిల్మీబీట్, సినిమాలు. "Saahasa Veerudu Saagara Kanya Cast & Crew". www.filmibeat.com. Retrieved 22 June 2020.
  3. తెలుగు న్యూస్ 18, సినిమాలు (15 May 2020). "శిల్పాశెట్టి తెలుగులో చేసిన సినిమాలు ఇవే." www.telugu.news18.com. Retrieved 22 June 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

ఇతర లంకెలు[మార్చు]