సి.హెచ్. మల్లారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.హెచ్. మల్లారెడ్డి
సి.హెచ్. మల్లారెడ్డి


పార్లమెంట్ సభ్యడు
పదవీ కాలం
16 మే 2014 – 11 డిసెంబరు 2018
ముందు సర్వే సత్యనారాయణ
తరువాత రేవంత్ రెడ్డి
నియోజకవర్గం మల్కాజ్‌గిరి

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
11 డిసెంబరు 2018

వ్యక్తిగత వివరాలు

జననం (1953-09-09) 1953 సెప్టెంబరు 9 (వయసు 70)
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి కల్పనా రెడ్డి
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కూతురు
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు
విద్యావేత్త
సామాజిక వేత్త

సి.హెచ్. మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి[1] పార్టీ తరపున మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2019 ఫిబ్రవరి 19న కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[2] 2014లో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యాడు.

జననం[మార్చు]

మల్లారెడ్డి 1953, సెప్టెంబరు 9న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బోయిన్‌పల్లిలో జన్మించాడు.[3] వెస్లీ కో-ఎడ్యుకేషన్ హైస్కూల్‌లో పాఠశాల విద్య, మహబూబియా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్య పూర్తిచేశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

మల్లారెడ్డికి కల్పనారెడ్డితో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె (మమతారెడ్డి), ఇద్దరు కుమారులు (మహేందర్ రెడ్డి, డాక్టర్ భద్రారెడ్డి) ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

2014, మార్చి 19న తెలుగుదేశం పార్టీలో చేరిన మల్లారెడ్డికి 2014, ఏప్రిల్ 9న మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం ఎం.పి. అభ్యర్థిగా పార్టీ టికెట్ ఇచ్చింది. 2014, మే 16న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డే. 2016 జూన్ నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి, తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)లో మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2] 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారముల, నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్నాడు.[5][6][7][8]

మూలాలు[మార్చు]

  1. "Malkajgiri". Election Commission of India. Archived from the original on 2 June 2014.
  2. 2.0 2.1 ఇండియన్ ఎక్స్ ప్రెస్. "TDP's lone Telangana MP, Malla Reddy, joins TRS". Retrieved 14 February 2017.
  3. "Ch. Malla Reddy". india.gov.in. Retrieved 12 February 2017.
  4. వెబ్ ఆర్కైవ్. "ELECTION COMMISSION OF INDIA". web.archive.org. Archived from the original on 2 జూన్ 2014. Retrieved 14 February 2017.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  6. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  7. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  8. Eenadu (16 November 2023). "మళ్లీ మంత్రిస్తారా?". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.