సినిమాస్కోప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చలన చిత్రం యొక్క తెరను మొదట నిర్మించిన చిత్రాల తెర కంటే వెడల్పును పెంచి సుమారు రెండింతలు మరింత విశాలంగా కనిపించేలా రూపొందించారు. ఈ విధంగా చలనచిత్రం యొక్క తెర వెడల్పును పెంచి మరింత స్పష్టమైన స్క్రీన్ ను అందించిన చలనచిత్రంను సినిమాస్కోప్ అంటారు.

A CinemaScope 35 mm film frame showing a circle. It has been squeezed by a ratio of 2:1 by an anamorphic camera lens. The anamorphic projection lens will stretch the image horizontally to show a normal round circle on the screen.

సినిమాస్కోప్ ఒక అనమోర్పిక్ లెన్స్ సిరీస్, వైడ్ స్క్రీన్ సినిమాల షూటింగ్ కోసం 1953 నుండి 1967 వరకు ఉపయోగించారు. 20th Century Fox యొక్క అధ్యక్షుడు 1953లో ఏర్పాటు చేసిన ప్రధాన ఫోటోగ్రఫీ, మూవీ ప్రొజెక్షన్ రెండూ ఆధునిక అనమోర్పిక్ ఫార్మాట్‌కి నాంది పలికాయి. అనమోర్పిక్ కటకముల సిద్ధాంత ప్రక్రియ గతంలో ఉన్న సాధారణ అకాడమీ ఫార్మాట్ యొక్క 1.37:1 నిష్పత్తి చిత్రాన్ని దాదాపు రెండు రెట్లు వెడల్పుతో 2.66:1 కారక నిష్పత్తి వరకు చిత్రాన్ని తయారు చేసేటట్లు చేసింది. అయితే సినిమాస్కోప్ లెన్స్ వ్యవస్థ కొత్త సాంకేతిక అభివృద్ధితో పాతపడిపోయింది, ప్రధానంగా ఆధునిక Panavision ద్వారా, సినిమాస్కోప్ అనమోర్పిక్ ఫార్మాట్ మాత్రం ఈ రోజుకి కొనసాగుతుంది. సినిమా పరిశ్రమ పరిభాషలో చలన చిత్ర నిర్మాతలు, ప్రాజెక్ట్‌నిస్ట్స్ ఇద్దరూ ఇప్పటికీ విస్తృతంగా స్కోప్ అనే సంక్షిప్త రూపానే ఉపయోగిస్తున్నారు. బాష్క్ & లాంబ్ కంపెనీ సినిమాస్కోప్ కటకాల యొక్క అభివృద్ధి కోసం చేసిన కృషికి 1954 లో ఆస్కార్ అవార్డ్ ను గెలుచుకుంది.


ఇవి కూడా చూడండి[మార్చు]

అల్లూరి సీతారామరాజు (సినిమా) - తెలుగులో మొట్టమొదటి సినిమా స్కోప్ చిత్రం.

బయటి లింకులు[మార్చు]