సూర్యుడు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూర్యుడు
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
తారాగణం డా. ‌రాజశేఖర్ ,
సౌందర్య
నిర్మాణ సంస్థ శ్రీ వెంకట రమణ ప్రొడక్షన్స్
భాష తెలుగు

సూర్యుడు, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1998 లో వచ్చిన సినిమా. ఈ చిత్రంలో రాజశేఖర్, సౌందర్య, చరణ్ రాజ్, శ్రీహరి ప్రధాన పాత్రల్లో నటించారు, అన్నపూర్ణ, అలీ, నర్రా వెంకటేశ్వరరావు, జీవ, వేణు మాధవ్, మల్లికార్జున రావు సహాయక పాత్రల్లో నటించారు. మేడికొండ వెంకట మురళీకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి వందేమాటరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు.

చిత్రం తమిళ చిత్రం మరు మలార్చికి రీమేక్. కన్నడంలో, హిందీలోనూ కూడా దీన్ని నిర్మించారు..ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; పేరు లేని ref లలో తప్పనిసరిగా కంటెంటు ఉండాలి

కథ[మార్చు]

సూర్యం ( రాజ్‌శేఖర్ ) తన గ్రామానికి పెద్ద. అతను దయగల సహృదయుడైన వ్యక్తి. గ్రామస్థులు అతన్ని ఎంతో గౌరవిస్తారు. ఎంత అంటే ప్రజలు గ్రామంలో అతని విగ్రహాన్ని కూడా నిర్మించారు. సూర్యం గ్రామ ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు.

వేరే గ్రామంలో మహేశ్వర రావు ( చరణ్ రాజ్ ) గ్రామపెద్ద. అతను తన మామ కుటుంబంతో ( నర్రా వెంకటేశ్వరరావు ) నివసిస్తున్నాడు. మహేశ్వరరావు, అతని బంధువు చక్రం ( శ్రీహరి ) కోపదారి వ్యక్తులని పేరు.

ఓ మారుమూల గ్రామంలో బియ్యం దుకాణం ప్రరంభోత్సవానికి సూర్యాన్ని ఆహ్వానిస్తారు. వేడుక తరువాత సూర్యం అతని కారు డ్రైవరు బాబీ (ఆలీ (నటుడు) తమ గ్రామానికి ఇంటికి వెళుతూంటారు. మార్కెట్లో పండ్లను కొనడానికి సూర్యం కారును ఆపుతాడు. తన గ్రామంలో, అతని దగ్గర ఎవరూ డబ్బు తీసుకోరు. అందుకని అతను చుట్టుపక్కల గ్రామాలలో షాపింగ్ చేస్తూంటాడు. మార్కెట్ వద్ద, సూర్యం పాము నుండి రక్షించేందుకు ప్రమీలను (సౌందర్య ) చెయ్యిపట్టి లాగుతాడు. దురదృష్టవశాత్తు, అలీ, సూర్యం మాత్రమే పామును చూస్తారు. సూర్యం ఒక రోగ్ అని భావించి సౌందర్య ఈ సంఘటనను పెద్ద రచ్చ చేస్తుంది. మహేశ్వరరావు, చక్రం అతను చెప్పేది వినకుండా కొడతారు.

ల్యాండ్ బ్రోకరు, కుటుంబ స్నేహితుడు త్రిమూర్తులు ( సుత్తివేలు ) ఆ గ్రామంలో గాయపడిన సూర్యుడిని చూస్తాడు. సూర్యం అది కేవలం అపార్థం అని చెబుతాడు. కోపంతో ఉన్న త్రిమూర్తులు ఆ మార్కెట్‌కు వెళ్లి, వారు ఎంత పెద్ద తప్పు చేశారో గ్రామస్తులకు అర్థమయ్యేలా చేబుతాడు. సూర్యం గ్రామస్థులు నిజం తెలుసుకుంటే ఈ సంఘటన తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించాడు. మహేశ్వర రావు, చక్రం తమ తప్పును గ్రహించి తాము చేసిన పనికి చింతిస్తారు. ఈలోగా, సూర్యమ్ తన డ్రైవర్‌ను ఎవరితోనూ ఆ అవమానకరమైన సంఘటన గురించి మాట్లాడవద్దని హెచ్చరిస్తాడు. ప్రమాదంలో గాయాలు తగిలినట్లు అబద్ధం చెప్పమంటాడు

ఇంటికి తిరిగి వచ్చాక, వ్యక్తి సూర్యం తనకు కారు ప్రమాదం జరిగిందని గ్రామస్తులకు అబద్ధం చెబుతాడు. ఈ సంఘటనపై కోపంగా ఉన్న బాబీ చివరకు అదే రాత్రి గ్రామస్తులకు అసలు విషయాన్ని వెల్లడిస్తాడు. ఇంతలో, మామయ్య సలహా ప్రకారం, మహేశ్వర రావు క్షమాపణ కోరడానికి ఆ రాత్రి సూర్యం గ్రామానికి గుర్రంపై వెళ్తాడు. అతను ఈ సంఘటనను సూర్య తల్లికి వెల్లడించినప్పుడు, ఆమె అతన్ని కొడుతుంది. కాని సూర్యం ఆమెను ఆపుతాడు.. మహేశ్వరరావు సూర్యం పాదాల వద్ద పడి క్షమాపణ కోరతాడు. సూర్యం అతనిని క్షమించి, మహేశ్వర్ తన గ్రామానికి తిరిగి పంపిస్తాడు.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న సూర్యం గ్రామస్తులకు కోపం వస్తుంది. వారందరూ సూర్యమ్‌ను చెప్పకుండా ఆయుధాలతో మహేశ్వర్ గ్రామానికి వెళతారు. వారు మహేశ్వర్ గ్రామంలో గందరగోళాన్ని సృష్టించి, వారి ఇళ్లకు నిప్పంటిస్తారు. ఈ అల్లర్లు మహేశ్వర్ కుటుంబం, ప్రమీల తల్లితో సహా చాలా మంది గ్రామస్తుల మరణానికి కారణమవుతుంది.

మరుసటి రోజు ఉదయం, మహేశ్వర్ తన గ్రామానికి తిరిగి వస్తాడు. జరిగిన నష్టాన్ని మరణాలనూ గమనిస్తాడు. సురక్షితంగా ఉండమని చెప్పడానికి జిల్లా కలెక్టరు, పోలీసులు సూర్యం గ్రామానికి చేరుకుంటారు. ఇప్పుడు వారు రెండు గ్రామాల మధ్య సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. మునుపటి రాత్రి జరిగిన అల్లర్ల గురించి తెలుసుకున్నప్పుడు సూర్యం తన డ్రైవరు పైన, గ్రామ ప్రజల పైనా కోపంగా ఉంటాడు. మహేశ్వర్, సూర్యం ద్రోహం చేసినట్లు భావిస్తాడు. తన గ్రామాన్ని నాశనం చేయడం సూర్యం యొక్క మోసపూరిత ప్రణాళికేనని భావిస్తాడు, కోపంతో ఉన్న మహేశ్వర్ అప్పుడు సూర్యం విగ్రహాన్ని సూర్యం గ్రామస్తుల ముందే నాశనం చేస్తాడు.

ప్రమీల, చక్రం, నారాయణరావు, మహేశ్వర్ అదేవిధంగా మోసపూరిత పద్ధతిలో సూర్యంపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు. తరువాత, సూర్యం బాధితులకు ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటాడు కాని వారు అతని డబ్బును నిరాకరిస్తారు. ప్రమీలను వివాహం చేసుకుంటానని సూర్యం చెబుతాడు, ఎందుకంటే ఆమెకు తనవారంటూ ఎవరూ మిగల్లేదు. సూర్యాన్ని నాశనం చేసే అవకాశంగా భావించి ఆమె సరేనంటుంది. మహేశ్వర్, చక్రం ఇద్దరూ కూడా దానికి ఒప్పుకుంటారు.

పెళ్ళి తరువాత, ప్రమీల సూర్యం నిజమైన స్వభావాన్నీ, బంగారం లాంటి అతని మనసునూ తెలుసుకుంటుంది. ఆమె మంచి భార్య అవుతుంది. మరోవైపు, మహేశ్వర్, చక్రం సూర్యంపై ప్రతీకారం తీర్చుకోవాలనే చూస్తూంటారు. తదుపరి ఏం జరిగుతుందనేది మిగతా కథ.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ట్రాక్ పాటలు గాయనీ గాయకులు సాహిత్యం వ్యవధి
1 'ఘల్లు ఘల్లు అందెలు' కె.ఎస్.చిత్ర సామవేదం షణ్ముఖశర్మ
2 'ఓ ప్రియా నీకోసం' ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సిరివెన్నెల
3 'సెలయేటికి' కె.ఎస్.చిత్ర భువన చంద్ర
4 'మా తండ్రి సూర్యుడు' కెజె యేసుదాస్ సిరివెన్నెల
5 వెళ్ళమ్మా కార్తిక జ్యోతి కె.ఎస్.చిత్ర సిరివెన్నెల
6 'మనసు మమత' ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత శ్రీహర్ష

మూలాలు[మార్చు]