స్వప్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వప్న
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం రాజా ,
స్వప్న,
రాంజీ,
చాట్ల శ్రీరాములు
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ లలిత ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

స్వప్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రం ద్వారా సినీనటి స్వప్న పరిచయం చేయబడింది. రాజా, స్వప్న, రాంకీ, నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

స్వప్నని రాజా ప్రేమిస్తాడు. అది చెప్పే లోపలే ఆమె తండ్రి స్వప్నకి రాంజీతో పెళ్ళి నిశ్చయం చేస్తారు. రాంజీ అన్ని విధాల తగిన వాడు అని స్వప్న కూడా ప్రేమలో పడుతుంది. ఈ లోపల స్వప్న తండ్రి మరణిస్తారు. స్వప్న ఆస్తి మొత్తం కోర్టు గొడవల్లో ఉండటంతో రాంజీ ఇంకో డబ్బున్న అమ్మాయి వెనకాల పడతాడు. ఆ అమ్మాయి రాంజీ స్వభావం తెలిసి వదిలేస్తుంది. రాంజీ తిరిగి స్వప్న దగ్గరకి వస్తాడు. స్వప్న ఛీకొట్టి రాజాతో వెళ్ళిపోతుంది.

పాటలు[మార్చు]

  • అంకితం, నీకే అంకితం, నూరేళ్ళ ఈ జీవితం ! ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ., రచన: దాసరి నారాయణరావు.
  • అందాలు రాశిగా పోసి ఆ రాశికి ప్రాణం పోసి
    ఆ బ్రహ్మ చేసిన బొమ్మ నీవు, నీకు జోహారు, స్వప్నా, స్వప్న!
  • ఇదే నా మొదటి ప్రేమలేఖ, రాసాను నీకు చెప్పలేక
    ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేతకాక
  • ముద్ద ముద్ద మందారాలు, లేత బుగ్గ సింగారాలు
  • శ్రీరస్తు అబ్బాయి, శుభమస్తు అమ్మాయి...

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=స్వప్న&oldid=4148704" నుండి వెలికితీశారు