హృదయశ్వాసకోశ పునరుజ్జీవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్డియో పల్మనరీ రీససిటేషన్
Intervention
CPR being performed on a medical-training manikin
ICD-9మూస:ICD9proc
MeSHD016887
OPS-301 codeమూస:OPS301
MedlinePlus000010
ఛాతీ కుదింపులు ఒక బొమ్మపై నిమిషానికి 100 చొప్పున ప్రదర్శించబడతాయి

హృదయశ్వాసకోశ పునరుజ్జీవన చర్య (Cardiopulmonary resuscitation - కార్డియోపల్మోనరీ రిససిటేషన్ - CPR - సీపీఆర్) అనగా వ్యక్తి యొక్క గుండె కొట్టుకోవడం స్తంభించినప్పుడు లేదా ఊపిరితిత్తులు శ్వాస తీసుకోని స్థితిలో ఉన్ననప్పుడు వెంటనే ఆ చర్యల పునరుద్ధరణకు చేయు అత్యవసర ప్రక్రియ. హృదయశ్వాసకోశ పునరుజ్జీవన చర్య గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు చేసే అత్యవసర ప్రాణాలను రక్షించే విధానం. తక్షణ హృదయాశ్వాసకోశ పునరుజ్జీవన చర్య గుండెపోటు బారిన పడిన వ్యక్తులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడ వచ్చును [1]

ఏ పరిస్థితులలో ప్రారంభించాలి[మార్చు]

తీవ్రమైన గుండెపోటు వలన కాని, గుండె లయ తప్పడం వలన కాని గుండె కొట్టుకోవడం ఆగిపోతే శరీరంకు రక్తప్రసరణ ఆగిపోయి అవయవాలకు ప్రాణవాయువు (ఆక్సిజన్) సరఫరా ఆగిపోతుంది. అవయవాల్లో ఉత్పత్తి అయిన బొగ్గుపులుసువాయువు రక్తంనుంచి విసర్జించబడదు. అప్పుడు శరీరంలో ఎటువంటి కదలికలు ఉండవు. అప్పుడు శ్వాస ఆడదు, ధాతునాడి (పల్స్) అందదు. అటువంటప్పుడు ప్రాణరక్షణకు ఈ హృదయశ్వాసకోశ పునరుజ్జీవన చర్య వెంటనే ప్రారంభించాలి.

CPR వెంటనే ఎందుకు ప్రారంభించాలి[మార్చు]

శరీరంలో మెదడు అత్యంత సున్నితమైనది. ఆక్సిజన్ అందకపోతే మెదడు ఎక్కువ సేపు పనిచేయదు, త్వరగా చెడిపోతుంది, అందువలన మెదడుకు ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని వెంటనే అందించాలి, అందుకు వెంటనే CPR వెంటనే ప్రారంభించాలి. CPR చర్యల వలన సహజంగా గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పటికీ కృత్రిమంగా గుండె నుండి ప్రాణవాయువుతో (ఆక్సిజన్)‌ కూడిన రక్తం మెదడుతో పాటు అన్ని అవయవాలకు ప్రసరిస్తుంది. ఈ చర్య ద్వారా మెదడుకు ఆక్సిజన్ అందుతూ పాడవకుండా వుంటుంది. ఒకవేళ CPR వెంటనే ప్రారంభించక కొంత సమయం తరువాత ప్రారంభిస్తే తిరిగి గుండె కొట్టుకోవడం ప్రారంభించినప్పటికీ అప్పటికే మెదడు పాడయివుంటుంది, తిరిగి మెదడు కోలుకోవడం కష్టం. కాబట్టి గుండెపోటు వలన పడిపోయిన మనిషికి వెంటనే CPR చర్య ప్రారంభించాలి.

హృదయశ్వాసకోశ పునరుజ్జీవన చర్య[మార్చు]

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ దాని ప్రకారం ఆరోగ్య సంరక్షకులు వచ్చేవరకు గుండెపోటు పడిన వ్యక్తిని చేతుల ద్వారా మాత్రమే ( సి.పి .ఆర్ ) నిమిషానికి 100 నుండి 120 వరకు ఇవ్వ వలెను . పల్స్, శ్వాస ఉందా అని చూడాలి,10 సెకన్లలో శ్వాస లేదా పల్స్ లేకపోతే, ఛాతీ కుదింపులను ప్రారంభించండి. రెండు రెస్క్యూ శ్వాసలను ఇచ్చే ముందు 30 ఛాతీ కుదింపులతో సిపిఆర్ ప్రారంభించవలెను . ఈ ప్రథమ చికిత్స ప్రారంభించే ముందు గుండెపోటు బారిన పడిన వ్యక్తికి వాతావరణం సురక్షితంగా ఉందా, స్పృహ లేదా అపస్మారక స్థితిలో ఉన్నారా, వ్యక్తి అపస్మారక స్థితిలో కనిపించినట్లయితే, అతని లేదా ఆమె భుజానికి నొక్కండి లేదా కదిలించండం, ఈ క్రియకు ఒకవేళ వ్యక్తి స్పందించకపోతే, ఇద్దరు వ్యక్తులు అందుబాటులో ఉంటే, ఇంకొక వ్యక్తి స్థానిక అత్యవసర నంబర్‌కు ఫోన్ చేసి ఆసుపత్రులకు సమాచారం చేరవేయవలెను . అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపిన ప్రకారం గుండె పోటు పడిన వ్యక్తులకు తక్షణమే శ్వాసను ఇవ్వడం ( నోటి ద్వారా, బయట నుంచి ), గుండె ఫై నొక్కడం వంటి చర్యలతో వ్యక్తులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడ వచ్చును [2]

ప్రయోజనాలు[మార్చు]

  • గుండె ఆగిపోవడం ద్వారా శరీరంలో నిలిచిపోయిన రక్తం, ఆక్సిజన్ సరఫరాను, CPR చర్య తిరిగి శరీరంలో రక్తం, ఆక్సిజన్ ప్రవహించేలా చేస్తుంది. తిరిగి గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. పడిపోయిన మనిషి తిరిగి కోలుకుంటాడు.

ఇక్కడ CPR చేయకూడనివి ఉన్నాయి[మార్చు]

కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) అనేది శ్వాస తీసుకోవడం ఆగిపోయిన లేదా గుండె కొట్టుకోవడం ఆగిపోయిన వ్యక్తిని పునరుద్ధరించడానికి ఉపయోగించే ప్రాణాలను రక్షించే సాంకేతికత. అయితే, CPR చేస్తున్నప్పుడు మీరు చేయకుండా ఉండవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని CPR చేయకూడనివి ఉన్నాయి:

  • మీరు శిక్షణ పొందినట్లయితే CPRని ప్రారంభించడానికి వెనుకాడకూడదు. అత్యవసర పరిస్థితుల్లో, ప్రతి సెకను గణించబడుతుంది, CPR ప్రారంభాన్ని ఆలస్యం చేయడం ప్రాణాపాయం కావచ్చు.
  • సాధారణంగా ఊపిరి పీల్చుకుంటున్న లేదా గుండె కొట్టుకునే వారికి CPR చేయవద్దు. వ్యక్తి శ్వాస తీసుకోనప్పుడు లేదా వారి హృదయ స్పందన ఆగిపోయినప్పుడు మాత్రమే CPR అవసరం.
  • వైద్య సహాయం వచ్చే వరకు లేదా వ్యక్తి శ్వాస తీసుకోవడం ప్రారంభించి, మళ్లీ పల్స్ వచ్చే వరకు CPRని ఆపవద్దు. CPR చాలా సేపు చేయవలసి వుంటుంది, చాలా త్వరగా ఆపడం ప్రమాదకరం.
  • ఛాతీ కుదింపులు చేసేటప్పుడు అధిక శక్తిని ఉపయోగించవద్దు. ఛాతీని కుదించడానికి తగినంత గట్టిగా నెట్టడం చాలా ముఖ్యం, కానీ మీరు గాయం కలిగించే లేదా వ్యక్తి యొక్క పక్కటెముకలు విరిగేంత గట్టిగా చేయకూడదు.
  • CPRని ప్రారంభించే ముందు వారి వాయుమార్గాన్ని తెరవడానికి వ్యక్తి తలను వెనుకకు వంచి, వారి గడ్డం పైకి లేపడం మర్చిపోవద్దు. వారి ఊపిరితిత్తులలోకి గాలి ప్రవహించేలా ఇది సహాయపడుతుంది.
  • అత్యవసర వైద్య సహాయం కోసం కాల్ చేయడం మరచిపోవద్దు.

భారతదేశం[మార్చు]

భారత దేశ జనాభాలో 98% మంది హృదయాశ్వాసకోశ పునరుజ్జీవన చర్య (సిపిఆర్) యొక్క ప్రాథమిక పద్ధతిలో శిక్షణ పొందలేదు, ఇది ఒక సర్వేలో మనకు కనబడుతుంది . గుండె పోటు సంభవించినప్పుడు ప్రాణాలను కాపాడటానికి ఇది చాలా కీలకమైన, ప్రాథమిక విధానం. అమెరికా, జపాన్, సింగపూర్, ఐరోపా దేశాల విద్యావిధానంలో హృదయాశ్వాసకోశ పునరుజ్జీవన చర్యను బోధించ వలననని చట్టబద్ధంగా చేశారు [3] హృదయాశ్వాసకోశ పునరుజ్జీవనంపై అవగాహన లేకపోవడం వల్ల మరణాలు పెరుగుతున్నాయి. ప్రపంచంలో ప్రతిరోజూ గుండె పోటు కారణంగా 1.15 లక్షల మంది మరణిస్తున్నారు . ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, సంవత్సరంలో గుండె పోటు కారణంగా సంవత్సరంలో దాదాపు 5.8 కోట్ల మంది మరణిస్తున్నారు. గుండె పోటు సమయంలో, రోగికి ఆకస్మిక రక్త ప్రసరణ, శ్వాసను పునరుద్ధరించడానికి అత్యవసర ప్రక్రియ అయిన హృదయాశ్వాసకోశ పునరుజ్జీవనం ( సిపిఆర్ ) పై వైద్యులు, ప్రజలు తెలుకొనవలెను [4]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "What is CPR". cpr.heart.org (in ఇంగ్లీష్). Retrieved 2020-11-24.
  2. "Cardiopulmonary resuscitation (CPR): First aid". Mayo Clinic (in ఇంగ్లీష్). Retrieved 2020-11-24.
  3. Sep 28, Sreemoyee Chatterjee / TNN /; 2016; Ist, 18:16. "98% Indians not trained in Cardiopulmonary Resuscitation, the basic life-saving technique: Study | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-11-24. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  4. Reporter, Staff (2013-04-07). "'About 1.15 lakh people die due to cardiac arrest every day in the world'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-11-24.