ప్రపంచ కొబ్బరి దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ కొబ్బరి దినోత్సవం
ప్రపంచ కొబ్బరి దినోత్సవం
యితర పేర్లుకొబ్బరికాయల దినోత్సవం
జరుపుకొనే రోజుసెప్టెంబరు 2
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

ప్రపంచ కొబ్బరి దినోత్సవం (కొబ్బరికాయల దినోత్సవం) ప్రతి సంవత్సరం సెప్టెంబరు 2న నిర్వహించబడుతోంది.[1] పోషకాలతో కూడిన ఆహారాన్ని, పానీయాన్ని అందించడంతోపాటు ఆరోగ్యాన్ని కలిగిస్తున్న కొబ్బరికాయ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.[2]

చరిత్ర[మార్చు]

ప్రపంచ కొబ్బరి దినోత్సవం 2009 సంవత్సరంలో ప్రారంభమైంది. కొబ్బరి ఉత్పత్తులను మరింత పెంచి, దాని ప్రాధాన్యాన్ని తెలుపడంకోసం 1969, సెప్టెంబరు 2న ఇండోనేషియా రాజధాని జకార్తాలో ది ఏషియా- పసిఫిక్‌ కొకోనట్‌ కమ్యూనిటి (ఎపిసిసి) అనే అంతర్జాతీయ సంస్థ ఏర్పాటయింది.[3] ఆరోజు ఆసియా, పసిఫిక్‌ దేశాల ప్రతినిధులు సమావేశమై ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి పరిశ్రమలను ఏర్పాటుచేయడంలో భాగంగా కొబ్బరి అభివృద్ధి కోసం అనేక తీర్మానాలు చేశారు. అందుకు గుర్తుగా సెప్టెంబరు 2ను అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవంగా ప్రకటించి, ప్రతి సంవత్సం వేడుకలు జరుపుకుంటున్నారు.[4] ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కొబ్బరి అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, సమన్వయం చేయడానికి ది ఏషియా- పసిఫిక్‌ కొకోనట్‌ కమ్యూనిటిలో 18 సభ్య దేశాలు ఉన్నాయి.[5]

కార్యక్రమాలు - వేడుకలు[మార్చు]

  • ఈ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు, ఎగ్జిబిషన్లు నిర్వహించబడుతాయి.
  • ఈ రోజున కొబ్బరికాయలను పగులగొడతారు. కొబ్బరితో చేసిన వంటకాలతో, కొబ్బరి నీళ్ళతో విందులు జరుపుకుంటారు.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు (2020-09-02). "మనసు పెడితే.. మనమే మేటి!". www.eenadu.net. Archived from the original on 2020-09-02. Retrieved 2020-09-02.
  2. నమస్తే తెలంగాణ (2020-09-02). "కొబ్బరి ఆరోగ్యసిరి". ntnews. Archived from the original on 2020-09-02. Retrieved 2020-09-02.
  3. The Times of India. "Why is September 2 celebrated as Coconut Day? - Times of India". The Times of India. Archived from the original on 2020-09-02. Retrieved 2020-09-02.
  4. ఆంధ్రజ్యోతి (2019-09-02). "ఉద్దానం.. ఏదీ పచ్చధనం?". www.andhrajyothy.com. Archived from the original on 2020-09-02. Retrieved 2020-09-02.
  5. fresherslive. "World Coconut Day 2020 - History of Coconut Day". latestnews.fresherslive.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-08-09. Retrieved 2020-09-02.