ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం
Appearance
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం | |
---|---|
జరుపుకొనే రోజు | 15 అక్టోబరు |
ఉత్సవాలు | "మన చేతులు, మన భవిష్యత్తు!" |
సంబంధిత పండుగ | Menstrual hygiene day |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదే రోజు |
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 15న నిర్వహించబడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంకోసం ప్రతిరోజూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్న విషయం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.[1]
చరిత్ర
[మార్చు]అతిసార, శ్వాస కోస వంటి వ్యాధులతో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పిల్లలు చనిపోతున్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడమే దీనికి కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో 2008లో ఐక్యరాజ్య సమితి అక్టోబరు 15న ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవంగా ప్రకటించింది.[2]
లక్ష్యాలు
[మార్చు]- తల్లిదండ్రులు చిన్నారులకు తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయించడం
- చేతి శుభ్రతపై అవగాహన కల్పించి అంటురోగాలను అరికట్టడం, శుభ్రమైన చేతులే వ్యాధులను నివారించగలవని చెప్పడం
కార్యక్రమాలు
[మార్చు]- ప్రభుత్వ పాఠశాలల్లో సర్వశిక్ష అభియాన్ ద్వారా చేతులు - పరిశుభ్రత కార్యక్రమం అమలు
- ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా 2015లో మధ్యప్రదేశ్ గిన్నిస్ రికార్డులను నమోదు చేసింది. అక్టోబర్ 15న రాష్ట్రంలోనే 51 జిల్లాల నుంచి 12,76,425 మంది చిన్నారులు చేతులు కడిగే కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ రికార్డు సాధించారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, మహబూబాబాద్ (15 October 2019). "రోగాలను కడిగేద్దాం". www.ntnews.com. Archived from the original on 20 October 2019. Retrieved 20 October 2019.
- ↑ ఆంధ్రభూమి, సంపాదకీయం (15 October 2019). "మన చేతుల్లో మన ఆరోగ్యం". andhrabhoomi.net. కె.రామ్మోహన్‌రావు. Archived from the original on 16 October 2019. Retrieved 20 October 2019.
- ↑ ప్రజాశక్తి, రాజోలు (తూర్పుగోదావరి) (15 October 2019). "చేతుల శుభ్రతతోనే ఆరోగ్యానికి రక్ష". www.prajasakti.com. డాక్టర్ ప్రభాకర్. Archived from the original on 15 October 2019. Retrieved 20 October 2019.
ఇతర లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Global handwashing Dayకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.