ప్రపంచ రేడియో దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ రేడియో దినోత్సవం
ప్రపంచ రేడియో దినోత్సవం
రేడియో
జరుపుకొనేవారుయునెస్కో
జరుపుకొనే రోజు13 ఫిబ్రవరి

ప్రపంచ రేడియో దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న నిర్వహించబడుతుంది.[1] రేడియో మాధ్యమ ప్రాధాన్యతను తెలియజేయడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.

మెుదటి సారిగా రేడియా తరంగాలను కనిపెట్టిన వ్యక్తి[మార్చు]

విద్యుదయస్కాంత శక్తి గల రేడియో తరంగాలను 1886లో మెుదటి సారిగా ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త అయిన హెన్రిచ్ హెర్ట్జ్  కనిపెట్టారు. రేడియో తరంగాలను తొలిసారిగా గుర్తించిన హెన్రిచ్ హెర్ట్జ్  పేరిట రేడియో తరంగాల  ఫ్రీక్వెన్సిని హెర్ట్జ్ (Hertz) లతో కొలవడం కొలవడం ప్రారంభించారు.  ఇటాలియన్ శాస్త్రవేత్త గుగ్లిఎల్మో మార్కోనీ  1895 - 96 సంవత్సరం నాటికి  రేడియో తరంగాలను శబ్ద తరంగాలుగా మార్చి ప్రసార మాధ్యమాలుగా  వాడుకలోకి తీసుకు వచ్చారు.

మెుదటి సారిగా రేడియో ప్రసారాలు:[మార్చు]

1920 నవంబరు 2 న అమెరికాలోని పిట్స్‌బర్గ్ లో  మెుట్టమెుదటి రేడియో ప్రసారం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.   అమెరికా అధ్యక్షుడిగా హార్డింగ్ ఎన్నికయ్యారు అనే వార్తను పిట్స్‌బర్గ్ కేంద్రంగా  ప్రపంచంలోనే తొలిసారిగా రేడియో వార్తా ప్రసారం మొదలైంది. అనంతరం ఇంగ్లాండ్ లో 1922 అక్టోబర్ 18 న బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్  స్థాపించారు. 1922 నవంబరు 14 బీబీసీ లండన్ కేంద్రంగా తన ప్రసారాలను ప్రారంభించింది.  

భారతదేశంలో రేడియో చరిత్ర:[మార్చు]

దేశంలోనే తొలిసారిగా, 1923 లో రేడియో క్లబ్ ఆఫ్ బాంబే  రేడియో ప్రసారాలను ప్రారంభించింది. బ్రిటిష్ హయాంలో 23 జూలై 1927 న తొలి రేడియో స్టేషన్ బాంబేలో ప్రారంభమైంది. ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ  అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. 1936 లో ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ పేరును  ఆలిండియా రేడియోగా మార్చారు. ఆలిండియా రేడియో అధికారికంగా 1956 నుండి ఆకాశవాణిగా పిలువబడుతుంది.

ఆల్ ఇండియా రేడియో:[మార్చు]

ఆలిండియా రేడియోను ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది.  ఇది కేంద్ర  ప్రభుత్వ సమాచార, ప్రసార యంత్రాంగ ఆధ్వర్యములో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతికి చెందిన విభాగము.  భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికీ భారత దేశంలో కేవలం 6 ఆలిండియా రేడియో కేంద్రాలు మాత్రమే ఉండేవి.  అవీ: 1) బొంబాయి 2) కలకత్తా  3)ఢిల్లీ 4) మద్రాసు5) తిరుచిరాపల్లి6) లక్నో కేంద్రాలు.  2024 నాటికీ  దేశవ్యాప్తంగా 479 ఆలిండియా రేడియో కేంద్రాలు పని చేస్తున్నాయి.

ప్రపంచ రేడియో దినోత్సవం[మార్చు]

1946, ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి రేడియో ప్రారంభించబడింది కాబట్టి, ఆ సందర్భంగా ప్రతిఏటా ఫిబ్రవరి 13న ఈ దినోత్సవం జరుపుకునేలా జనరల్ కాన్ఫరెన్స్ 36వ సమావేశంలో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రకటించాలని బోర్డు యునెస్కోకు సిఫారసు చేసింది. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు, అంతర్జాతీయ ప్రాంతీయ సంస్థలు, వృత్తి సంఘాలు, ప్రసార సంఘాలు, ప్రభుత్వయేతర సంస్థలు మొదలైనవన్ని ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకోవాలని బోర్డు ఆహ్వానించింది. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జనరల్ అసెంబ్లీలో ఆమోదించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం జరుపుకునే విధంగా యునెస్కో డైరెక్టర్ జనరల్ ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ దృష్టికి తీసుకురావాలని బోర్డు అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ పరిగణించి, 36 సి/63 ఫైల్‌లో ఉన్న తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 2011 నవంబరులో యునెస్కోలోని అన్ని సభ్య దేశాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి.[2][3][4] అప్పటి నుంచి ప్రతి ఏటా 13న ఈ రేడియో దినోత్సవం జరుపుకుంటారు.

కార్యక్రమాలు[మార్చు]

  • స్త్రీ పురుషుల సమానత్వం కోసం లింగబేధం సంబంధిత అంశాల, విధానాల రూపకల్పనకు శ్రీకారం చుట్టేందుకు రేడియో స్టేషన్ యజమానులకు, ప్రభుత్వాలకు, కార్యదర్శులకు యునెస్కో అవగాహన కల్పిస్తుంది.
  • మహిళా రేడియో జర్నలిస్టుల రక్షణను పెంపొందించడం కోసం కృషి చేస్తుంది.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, జిల్లాలు (13 February 2020). "ఆ పాత మధురం.. ఆనంద శ్రవణం". www.eenadu.net. Archived from the original on 13 ఫిబ్రవరి 2020. Retrieved 13 February 2020.
  2. File 36 C/63, UNESCO's General Conference Resolution http://unesdoc.unesco.org/images/0021/002131/213174e.pdf
  3. Proclamation, Resolution 63 http://unesdoc.unesco.org/images/0021/002150/215084e.pdf
  4. UN General Assembly file http://www.un.org/ga/search/view_doc.asp?symbol=A/RES/67/124