ప్రీతి నిగమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రీతి నిగమ్
జననం
ప్రీతి నిగమ్

వృత్తిటెలివిజన్ నటి
జీవిత భాగస్వామినగేష్‌
పిల్లలుఆదితిశ్రీ, ఆర్యన్

ప్రీతి నిగమ్ తెలుగు సినిమా, టెలివిజన్ నటి. 1996లో దూరదర్శన్ లో వచ్చిన ఋతురాగాలు ద్వారా గుర్తింపు పొందిన ప్రీతి అనేక సీరియల్స్, సినిమాల్లో నటించింది.[1][2]

జననం - కుటుంబం[మార్చు]

ప్రీతి నిగమ్ హైదరాబాదులో జన్మించింది. ఈవిడ పూర్వీకులు ఉత్తరప్రదేశ్‌ నుంచి హైదరాబాదులోని సుల్తాన్‌బజార్‌కు వచ్చారు. నిజాం రాజ్యంలో మంత్రులుగా పనిచేసేవారు.

ప్రీతి తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేశారు, తండ్రి రంగస్థల నటుడు కూడా.

వివాహం[మార్చు]

ఋతురాగాలు సీరియల్ హరీష్ పాత్రను పోషించిన కర్ర నగేష్‌తో 1999, నవంబరు 4న ప్రీతి ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు (ఆదితిశ్రీ, ఆర్యన్).[3][4]

నృత్యరంగం[మార్చు]

చిన్నతనంలోనే అనిల్ ‌కుమార్‌ దగ్గర కూచిపూడి నృత్యం, ఏవీ శ్రీధర్ దగ్గర కథక్ నేర్చుకున్న ప్రీతి, ఏడో తరగతి బిర్లా టెంపుల్‌ దగ్గర ప్రదర్శన ఇచ్చింది. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా జరిగిన నాటక ప్రదర్శనల్లో కూడా నటించింది.లండన్, మారిషస్, పారిస్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో అనేక నృత్య ప్రదర్శనలు చేసింది.

1989లో తొలిసారిగా నృత్య నేపథ్యంతో రూపొందించిన అంబేద్కర్‌ డ్యాక్యుమెంటరీలో బాల్య అంబేద్కర్‌కు అత్తగా నటించింది.[5]

టీవీరంగం[మార్చు]

సీరియల్స్‌లో నటులకు కూచిపూడి, కథక్, ఫోక్ డ్యాన్సులపై శిక్షణ ఇస్తున్న ప్రీతి, దూరదర్శన్‌లో ప్రసారమైన ఆరాధన సీరియల్‌కి కొరియోగ్రఫీ చేయడానికి వెళ్ళగా, ప్రీతి కళ్ళతో పలికించే భావాలను చూసిన దర్శకుడు ఆ సీరియల్‌లో అవకాశం ఇచ్చాడు. ప్రీతికి తెలుగు రాకపోవడంతో ఒక మూగమ్మాయి పాత్రను సృష్టించగా, కళ్ళతోనే నటించి ప్రశంసలు అందుకుంది.

మంజులా నాయుడు దర్శకత్వంలో వచ్చిన ఋతురాగాలు సీరియల్‌లో హరిత పాత్రలో నటించింది. ఆ తరువాత అనేక సీరియళ్ళలో నాయక, ప్రతినాయక పాత్రలను పోషించింది.[6]

నటించినవి

  1. ఋతురాగాలు
  2. కస్తూరి
  3. ఆడది
  4. ఎండమావులు
  5. కావ్యాంజలి
  6. శాంతినివాసం
  7. చక్రవాకం
  8. చంద్రముఖి
  9. స్వాతిచినుకులు
  10. అమెరికా అమ్మాయి
  11. శ్రావణసమీరాలు
  12. కాంచన గంగ
  13. ఊహలపల్లకి (దూరదర్శన్-2005)
  14. ఇంటింటి గృహలక్ష్మి (స్టార్ మా)
  15. దీపారాధన

సినిమారంగం[మార్చు]

శ్యామ్ బెనగళ్ దర్శకత్వంలో హిందీ ఆర్ట్ ఫిల్మ్‌లో నటించింది. తెలుగులో తొలి సినిమా స్టూడెంట్ నంబర్ 1.

నటించినవి

  1. హరీబరీ (హిందీ)
  2. వెల్‌డన్‌ అబ్బా (హిందీ)
  3. షూబాయ్‌ (హిందీ)
  4. స్టూడెంట్ నంబర్ 1 (2001)
  5. సంతోషం (2002)
  6. శ్రీరామ్ (2002)
  7. ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
  8. కబడ్డీ కబడ్డీ
  9. ఈ అబ్బాయి చాలా మంచోడు (2003)
  10. బ్యాక్ పాకెట్ (2003)
  11. సై (2004)
  12. కానీ (2004)
  13. మీనాక్షి (2005)
  14. శుభం
  15. చాకలి ఐలమ్మ (2013)[7]
  16. జై తెలంగాణ
  17. నిన్నే కోరుకుంటా
  18. త్రిపుర
  19. త్యాగాల వీణ- జయహో తెలంగాణ
  20. స్టెప్నీ
  21. ఇన్‌కీ ఐసీకీతైసీ (ఉర్దూ)
  22. రొమాంటిక్‌ (2021)

అవార్డులు - పురస్కారాలు[మార్చు]

  1. జాతీయ అవార్డు - కావ్యాంజలి (సీరియల్)

మూలాలు[మార్చు]

  1. ఈటీవీ, ఆలీతో సరదాగా. "అందుకేనేమో నేనెక్కువ సినిమాలు చేయలేదు". m.eenadu.net. Archived from the original on 18 May 2020. Retrieved 18 May 2020.
  2. The Hindu, Hyderabad (6 December 2013). "Serial performer Preeti Nigam now awaits her big test". T. Lalith Singh. Archived from the original on 18 May 2020. Retrieved 18 May 2020.
  3. Telangana Today, Telangana (15 April 2018). "Pretty Preeti's performance peps up small screen". T Lalith Singh. Archived from the original on 18 May 2020. Retrieved 18 May 2020.
  4. Sakshi (1 March 2021). "నమ్మకమే ముఖ్యం కొంచెం నిఘా కూడా." Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021.
  5. సాక్షి, ఆంధ్రప్రదేశ్ (13 November 2014). "నా జీవితమే ఓ పుస్తకం". Sakshi. Archived from the original on 18 May 2020. Retrieved 18 May 2020.
  6. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (17 November 2015). "విలన్‌గా భయపెడుతున్నా". andhrajyothy.com. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020.
  7. సాక్షి, తెలంగాణ (2 July 2014). "తెలంగాణ వీరవనిత పాత్రలో నటించడం నా అదృష్టం". Sakshi. Archived from the original on 18 May 2020. Retrieved 18 May 2020.

ఇతర లంకెలు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసులో ప్రీతి నిగమ్