ఫెర్డినాండ్ మోనోయర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫెర్డినాండ్ మోనోయర్
జననం(1836-05-09)1836 మే 9
లైయాన్, ఫ్రాన్సు
మరణం1912 జూలై 11(1912-07-11) (వయసు 76)
లైయాన్, ఫ్రాన్సు
జాతీయతఫ్రెంచ్
వృత్తినేత్ర వైద్యుడు

ఫెర్డినాండ్ మోనోయర్ (9 మే 1836 – 11 జూలై 1912[1]) ఫ్రెంచ్ నేత్రవైద్యుడు. ఆయన 1972 లో డైఆప్టర్ అనే పదాన్ని నేత్రవైద్య శాస్త్రంలో  పరిచయం చేసాడు.[2]

Monoyer chart. Reading upwards on both ends (ignoring the last line), the name "Ferdinand Monoyer" can be seen

ఆయన నేత్రవైద్యంలో నేత్రాలను పరీక్షించుటకు మోనోయర్ ఛార్టు ను ఆవిష్కరించారు.[3]

ఆయన ఆ ఛార్టులో తన పేరును క్రింది నుండి పైకి అక్షరాలు వచ్చేవిధంగా ఎడమ, కుడివైపులలొ అమర్చాడు. [4]

జీవిత చరిత్ర[మార్చు]

ఆయన తల్లి చేత అలసేటియన్ వారసత్వాన్ని పొందాడు. ఆయన తండ్రి ఫ్రెంచ్ మిలిటరీ డాక్టరు.[5]

ఆయన మెడికల్ ఫిజిక్స్ లో అసోసియేట్ ఫ్రొఫెసరుగా 1871 లో యూనివర్శిటీ ఆఫ్ స్ట్రాస్ బర్గ్ లోని మెడిసన్ ఫాకల్టీగా పనిచెసాడు.[6] తరువాత 1871 నుండి 1877 వరకు నాన్సీ విశ్వవిద్యాలయంలోని మెడిసన్ ఫాకల్టీగా నేత్ర వైద్య విభాగంలో డైరక్టరుగా కొనసాగాడు. 1877 నుండి 1909 వరకు లైయాన్ విశ్వవిద్యాలయంలొ మెడికల్ ఫిజిక్స్ లో ప్రొఫెసరుగా సేవలనందించాడు.[7]

మరణం[మార్చు]

మోనోయర్ తన 76 వ యేట మరణించాడు. ఆయన సమాధి లైలాన్ లోని "సిమిటెరె డి లా గులోతిరె" ప్రాంతంలో ఉంచబడినది. జూలై 13, 1912 న ఆయన స్నేహితులు, లైయాన్ విశ్వవిద్యాలయ ఫాకల్టీ సభ్యులు కలసి ఆయన సమాధి ప్రాంతంలోనికి పెద్ద ఊరేగింపుగా వెళ్లారు. ప్రొఫెసర్ హుగొనెక్ లైయాన్ విశ్వవిద్యాలయంలో మోనోయర్ యొక్క వృత్తి జీవితం, సేవల గూర్చి, అసోసియేట్ ప్రొఫెదర్ నోజియర్ మోనోయర్ జీవితం గూర్చి, లూయీస్ డోర్ అనే ప్రొఫెసర్ లైయాన్ నేత్రవైద్య సమాజంలో మోనోయర్ పాత్ర గూర్చి ప్రసంగించారు. [5]

మే 09 2017 గూగుల్ సెర్చ్ ఇంజన్ ఆయన గౌరవార్థం గూగుల్ డూగుల్ ను ప్రచురించింది.[8]

మూలాలు[మార్చు]

  1. "MONOYER (Ferdinand)". BIU Santé. Archived from the original on 2018-02-27. Retrieved September 12, 2014.
  2. "Vergence, vision, and geometric optics" (PDF). American Journal of Physics. 43 (9): 766–769. 1975-09-01. doi:10.1119/1.9703. ISSN 0002-9505.
  3. Koki, G.; Bella, A.-L.; Ndocko, K.-E. Mbassi; Epée, E.; Mvogo, C. Ebana; Bella, A.-L.; Ndocko, K.-E. Mbassi; Eballé, A. Omgbwa. "Complications oculaires, à l'exclusion de la rétinopathie diabétique, chez le jeune diabétique de type 1, au Cameroun". Médecine des Maladies Métaboliques. 7 (5): 473–476. doi:10.1016/s1957-2557(13)70546-7.
  4. "Le test d'acuité visuelle Monoyer cache le nom de son inventeur". secouchermoinsbete.fr (in ఫ్రెంచ్). Retrieved September 11, 2014.
  5. 5.0 5.1 Various (July 1912). "LE PROFESSEUR FERDINAND MONOYER". Lyon médical : Gazette médicale et Journal de médecine réunis (in French). Société médicale des hôpitaux de Lyon. CXIX (27). ISSN 0024-7790. Retrieved September 12, 2014.{{cite journal}}: CS1 maint: unrecognized language (link)
  6. Wundt, L. D. W. (1871). Traité élémentaire de physique médicale [Elementary Treatise of Medical Physics.] (in French). Paris: JB Bailliere et Fils. Retrieved September 12, 2014.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  7. "MONOYER (Ferdinand)". BIU Santé. Archived from the original on 2018-02-27. Retrieved September 12, 2014.
  8. Monoyer was known for this groundbreaking research in opthalmology