బడుగుల సుమతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బడుగుల సుమతి
జననం
వృత్తిపోలీస్, ఐపీఎస్‌ అధికారిణి
క్రియాశీల సంవత్సరాలు2000 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిశ్రీనాథ్‌
పిల్లలుప్రకృతి & సంస్కృతీ
తల్లిదండ్రులుతిరుపతి రెడ్డి, సుజాతమ్మ

బడుగుల సుమతి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్‌ అధికారిణి. ఆమె 2022లో మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విశిష్ట మహిళ పురస్కారంకు ఎంపికైంది.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

బడుగుల సుమతి తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, ఉండవెల్లి మండలం, కలుగోట్ల గ్రామంలో తిరుపతిరెడ్డి, సుజాతమ్మ దంపతులకు జన్మించింది. ఆమె డిగ్రీ పూర్తి చేసి 2000లో గ్రూప్‌–1 సాధించింది.

తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ విశిష్ట మహిళ పురస్కారం అందుకుంటున్న సుమతి

వృత్తి జీవితం[మార్చు]

2000లో గ్రూప్‌–1 సాధించి శిక్షణ అనంతరం 2001లో డీఎస్‌పీగా తొలి పోస్టింగ్‌ అందుకొని 2007లో ఐపీఎస్‌ (కన్ఫర్డ్ ఐపీఎస్‌గా) పదోన్నతి అందుకొని తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి కేవలం ఆరేళ్ల సర్వీసుకే ఒక గ్రూప్‌–1 అధికారి ఐపీఎస్‌ అయ్యి రికార్డు నెలకొల్పింది. ఆమె 2020లో ఎస్పీ ర్యాంకు నుంచి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ)గా పదోన్నతి అందుకుంది.[3]

నిర్వహించిన భాద్యతలు[మార్చు]

  • వరంగల్ అదనపు ఎస్పీ
  • మెదక్ ఎస్పీ
  • హైదరాబాద్ నార్త్‌జోన్‌ డీసీపీ[4]
  • చిక్కడపల్లి ఏసీపీ
  • సీఐడీ
  • తెలంగాణ మహిళా భద్రత విభాగం డీఐజీ

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (8 March 2018). "మా సుమతమ్మ.. పోలీసాఫీసర్‌..!". Archived from the original on 8 March 2022. Retrieved 8 March 2022.
  2. Hindustantimes Telugu (8 March 2022). "వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలకు అవార్డులు.. జాబితా ఇదే." Archived from the original on 8 March 2022. Retrieved 8 March 2022.
  3. HMTV (16 April 2020). "తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
  4. Andhra Jyothy. "భారీగా ఐపీఎస్‌ల బదిలీ". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
  5. Andhra Bhoomi (6 May 2016). "మెదక్ ఎస్పీ సుమతికి ఫిక్కీ అవార్డు". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
  6. Telangana Today (1 February 2021). "Telangana cop bags Covid warrior award". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
  7. ETV Bharat News (8 March 2022). "40 మంది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.