బి. జీవన్ రెడ్డి
Jump to navigation
Jump to search
బి. జీవన్ రెడ్డి | |
---|---|
జననం | డిసెంబరు 6 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | సినిమా దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2008 - ప్రస్తుతం |
బి. జీవన్ రెడ్డి భారతీయ చలనచిత్ర దర్శకుడు. 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి, 2013లో విడుదలైన దళం సినిమాలకు దర్శకత్వం వహించాడు.
జీవిత విషయాలు
[మార్చు]జీవన్ రెడ్డి డిసెంబరు 6న సిద్ధిపేట జిల్లాలో జన్మించాడు.
సినిమారంగం
[మార్చు]2008లో వచ్చిన రక్ష, 2011లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు సినిమాలకు జీవన్ రెడ్డి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 2013లో తొలిసారిగా దళం సినిమాకు దర్శకత్వం వహించాడు.[1] ఈ చిత్రం ఏకకాలంలో తమిళంలో కూట్టంగా రూపొందించబడి, 2014లో విడుదలైంది.[2] ఈ చిత్రం విడుదలైన తరువాత మిశ్రమ స్పందనలను అందుకుంది.[3] తరువాత 2019లో జార్జ్ రెడ్డి సినిమా తీశాడు. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందించబడింది. జీవన్ ఈ చిత్రంకోసం జార్జ్ రెడ్డి జీవితం గురించి ఒకటిన్నర సంవత్సరాలు పరిశోధన చేశాడు.[4]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | దర్శకుడు | రచయిత | ఇతర వివరాలు | Ref. |
---|---|---|---|---|---|
2008 | రక్ష | మాటల రచయిత, సహాయ దర్శకుడు | |||
2013 | దళం | ద్విభాషా చిత్రం (తెలుగులో దళం, తమిళంలో కూట్టం) | |||
2019 | జార్జ్ రెడ్డి |
- నిర్మాతగా
- గువ్వ గోరింక (2020)
మూలాలు
[మార్చు]- ↑ "Piaa Bajpai in Jeevan Reddy's Dhalam - Times of India". The Times of India.
- ↑ Dundoo, Sangeetha Devi (October 28, 2019). "George Reddy: Story of a rebel". The Hindu.
- ↑ "Dalam Movie Review {2.5/5}: Critic Review of Dalam by Times of India". The Times of India.
- ↑ "I'm satisfied with how I have introduced George Reddy onscreen: Jeevan Reddy - Times of India". The Times of India.