బి.వి. రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బండ వాసుదేవ్ రావు
జననం1935
మరణం2004
క్రియాశీల సంవత్సరాలు1970–1996
జీవిత భాగస్వామిఉత్తర దేవి, రూపారావు
పిల్లలుఅనురాధ దేశాయ్
వెంకటేశ్ రావు
బాలాజీ రావు
పురస్కారాలుపద్మశ్రీ
వరల్డ్ పౌల్ట్రీ సైన్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ పౌల్ట్రీ హాల్ ఆఫ్ ఫేమ్

బండ వాసుదేవ్ రావు, తెలంగాణకు చెందిన వ్యవసాయవేత్త, పౌల్ట్రీ రైతు.[1] జాతీయస్థాయిలో ప్రసిద్ధి చెందిన వాసుదేవ్ రావును చాలామంది భారతదేశ పౌల్ట్రీ వ్యవసాయ పితామహుడిగా భావిస్తారు.[2][3] నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వ్యవస్థాపక చైర్మన్ గా పనిచేశాడు.[2] 2004లో వరల్డ్ పౌల్ట్రీ సైన్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ పౌల్ట్రీ హాల్ ఆఫ్ ఫేమ్ గా ప్రవేశపెట్టబడ్డాడు.[4] 1990లో భారత ప్రభుత్వం ఇతనికి నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని ఇచ్చి గౌరవించింది. ఇతను మరణించేనాటికి, ఇతని కుటుంబ సంపద $ 325 మిలియన్లు (1300 కోట్లు) గా ఉంది. 1996 నాటికి ఇతని కంపెనీ నేరుగా 5000 మంది ఉద్యోగులను నియమించుకుంది.[5]

తొలి జీవితం[మార్చు]

వాసుదేవ్ రావు 1935, నవంబరు 6న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చంచల్‌గూడలో జన్మించాడు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

వాసుదేవ్ రావుకు అతి చిన్న వయస్సులోనే ఉత్తర దేవితో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె (అనురాధ దేశాయ్), ఇద్దరు కుమారులు (వెంకటేశ్ రావు, బాలాజీ రావు) ఉన్నారు.[6] ముగ్గురు పిల్లలు కుటుంబ వ్యాపారంలో పాలుపంచుకున్నారు. జితేంద్ర దేశాయ్‌ని వివాహం చేసుకున్న అనురాధ దేశాయ్ ప్రస్తుతం గ్రూప్‌కు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా పనిచేస్తోంది.[7]

కెరీర్[మార్చు]

వాసుదేవ్ రావుకు మంచి చదువు లేదు. దాంతో కొంతకాలం తక్కువ స్థాయి ఉద్యోగాలలో (టెలిఫోన్ ఆపరేటర్‌గా, లోయర్ గ్రేడ్ రైల్వే ఉద్యోగి) పనిచేస్తూ జీవనోపాధి పొందాడు. ఆ తరువాత తమకున్న కొన్ని ఎకరాల వ్యవసాయ భూములను ఉపయోగించి వ్యాపారం చేయాలనుకున్నాడు. అలా కోళ్ళ వ్యాపారం ప్రారంభించాడు.

రాజేంద్రనగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిప్లోమా కోర్సులో చేరి వ్యవసాయంలో మెళకువలు నేర్చుకున్నాడు. అక్కడ పాడి, పౌల్ట్రీ పెంపకంలో శిక్షణను పూర్తిచేసి, ఒక అమెరికన్ ఉపాధ్యాయుడు మూర్ వద్ద శిష్యుడిగా చేరాడు.[3] మూర్ సహాయంతో 500 పక్షులను పోషించడంకోసం తన 7 ఎకరాల స్థలంలో రావు తన సొంత వెంచర్‌తో తన మొట్టమొదటి వ్యాపారాన్ని ప్రారంభించాడు.[3] 1970లో ప్రారంభమైన ఈ వ్యాపారంలో ప్రస్తుతం పౌల్ట్రీ, మాంసం, ఫార్మాస్యూటికల్స్, పశువుల దాణా, క్రీడలు మొదలైనవి ఉన్నాయి. భారతదేశం, బంగ్లాదేశ్, యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్, వియత్నాం, బ్రెజిల్ మొదలైన దేశాలలో తన వ్యాపారాన్ని విస్తరించాడు.[6][8]

సామాజిక కార్యక్రమాలు[మార్చు]

1980ల ప్రారంభంలో గుడ్ల ధర తగ్గినప్పుడు, వాసుదేవ్ రావు రైతులను కలిసి 1982లో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీని స్థాపించాడు. దానికి వ్యవస్థాపక చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.[9] ప్రపంచ పౌల్ట్రీ సైన్స్ అసోసియేషన్ తో కూడా అనుబంధమున్న రావు 1993 నుండి 1996 వరకు భారత ఛాప్టర్ కు నాయకత్వం వహించాడు.[3] 1996లో న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ పౌల్ట్రీ కాన్ఫరెన్స్ నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషించాడు.[4] డాక్టర్ బివి రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పౌల్ట్రీ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ అనే ఒక ఉన్నత విద్యాసంస్థను స్థాపించాడు.[10]

పురస్కారం[మార్చు]

1990లో భారత ప్రభుత్వం రావుకు పద్మశ్రీ పురస్కారంను ప్రదానం చేసింది.[5] 2004లో వరల్డ్ పౌల్ట్రీ సైన్స్ అసోసియేషన్ అతనిని వారి హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చించి. కానీ ఆ వేడుక జరగకముందే రావు మరణించాడు.[4]

మరణం[మార్చు]

వాసుదేవ్ రావు 2004లో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "Newly Carved Telangana CM Opened Basket of Fruits for Poultry Industry". Poultry Express. 2015. Archived from the original on 3 ఆగస్టు 2018. Retrieved 18 October 2021.
  2. 2.0 2.1 "Father of Indian poultry industry remembered". The Hindu. 7 November 2013. Retrieved 18 October 2021.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "B.V. Rao - 'Father of Indian Poultry Industry'" (PDF). www.livelihoods.net.in. Livelihoods.net. 2015. Archived from the original (PDF) on 25 సెప్టెంబరు 2015. Retrieved 18 October 2021.
  4. 4.0 4.1 4.2 "International Poultry Hall of Fame". World Poultry Science Association. 2015. Archived from the original on 26 September 2015. Retrieved 18 October 2021.
  5. 5.0 5.1 "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 November 2014. Retrieved 18 October 2021.
  6. 6.0 6.1 "About us". www.venkys.com. Venky's. 2015. Retrieved 18 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "Indian poultry group closes in on Blackburn". Financial Times. 26 October 2010. Retrieved 18 October 2021.
  8. "Rao family buy Blackburn Rovers from Jack Walker Trust". BBC Sports. 19 November 2010. Retrieved 18 October 2021.
  9. "The beginning". NECC. 2015. Archived from the original on 23 October 2018. Retrieved 18 October 2021.
  10. "Dr B.V. Rao Institute of Poultry management and Technology". India Study Channel. 2015. Retrieved 18 October 2021.