బీస్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీస్ట్
దర్శకత్వంనెల్సన్ దిలీప్ కుమార్
నిర్మాతకళానిధి మారన్
దిల్ రాజు
తారాగణం
ఛాయాగ్రహణంమనోజ్ పరమహంస
కూర్పుఆర్. నిర్మల్
సంగీతంఅనిరుధ్ రవిచందర్
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీ
2022 ఏప్రిల్ 13 (2022-04-13)
దేశంభారతదేశం
భాషతెలుగు

బీస్ట్ 2022లో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకతవం వహించాడు. విజయ్, పూజా హెగ్డే, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు విడుదల చేయనున్నాడు.[1] బీస్ట్ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 2న విడుదల చేసి[2] సినిమాను 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.[3]

కథ[మార్చు]

వీర రాఘ‌వ (విజ‌య్‌) ఓ `రా` ఏజెంట్‌. క‌శ్మీర్‌లో జ‌రిపిన ఓ ఆప‌రేష‌న్‌లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్ర‌రిస్ట్ ఉమ‌ర్ ఫ‌రుక్‌ని ప‌ట్టుకుంటాడు. అయితే ఆ మిష‌న్ లో చిన్న పాప చ‌నిపోతుంది. ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో ఆ పాప చ‌నిపోవ‌డానికి కార‌ణం త‌నే అనే భావనతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఓ మాల్‌లో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ప‌ద‌కొండు నెల‌ల త‌ర‌వాత ఉమ‌ర్ ఫారుక్‌ని విడిపించుకోవ‌డానికి ఉగ్ర‌వాదులు ఓ కుట్ర ప‌న్నుతారు. చెన్నైలోని ఓ షాపింగ్ మాల్ ని హైజాక్ చేసి అందులో ఉన్న ప్ర‌జ‌ల్ని బంధీలుగా ప‌ట్టుకుని, ప్ర‌భుత్వాన్ని బెదిరించి ఉమ‌ర్ ఫారుక్‌ని విడిపించుకోవాల‌న్న‌ది ప్లాన్‌. అయితే టెర్ర‌రిస్టులు షాపింగ్ మాల్ ని హైజాగ్ చేసిన‌ప్పుడు అక్క‌డే పనిచేస్తున్న వీర ఆ టెర్ర‌రిస్టుల నుంచి ప్ర‌జ‌ల్ని ఎలా కాపాడాడు? ఉమ‌ర్ ఫారుక్ పాకిస్థాన్ పారిపోకుండా ఎలా అడ్డుకున్నాడు? అనేదే మిగతా సినిమా క‌థ‌.[4]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 10TV (4 April 2022). "బీస్ట్ తెలుగు రైట్స్ ఆయనకే..!" (in telugu). Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. TV9 Telugu (2 April 2022). "బీస్ట్ ట్రైలర్ వచ్చేసింది.. టెర్రరిస్ట్‌ల అంతుచూసే సోల్జర్ వీర రాఘవన్‌గా దళపతి". Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Namasthe Telangana (22 March 2022). "'బీస్ట్' విడుద‌ల తేదీ ఖ‌రారు." Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.
  4. "విజయ్‌ 'బీస్ట్'మూవీ రివ్యూ". 13 April 2022. Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  5. Eenadu (12 November 2021). "'బీస్ట్‌' కోసం ఎదురుచూస్తున్నా". Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బీస్ట్&oldid=4041576" నుండి వెలికితీశారు