బూర్గుల నర్సింగరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బూర్గుల నర్సింగరావు

వ్యక్తిగత వివరాలు

జననం (1932-03-14)1932 మార్చి 14
బూర్గుల, షాద్‌నగర్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ,భారతదేశం
మరణం 19 జనవరి 2021
హైదరాబాదు
రాజకీయ పార్టీ సీపీఐ

బూర్గుల నర్సింగరావు (మార్చి 14, 1932 - జనవరి 19, 2021) తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో అతను కీలక పాత్ర పోషించాడు.[1][2]

జననం[మార్చు]

బూర్గుల నర్సింగరావు 1932 మార్చి14న రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్ సమీపంలోని బూర్గుల గ్రామంలో జన్మించాడు. అతనుది స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం.[3] నర్సింగరావు హైదరాబాదు రాష్ట్ర‌ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడైన బి. వెంకటేశ్వరరావు కుమారుడు. అతనుకు వరసకు పెదనాన్న.[4]

వివాహం & పిల్లలు[మార్చు]

నర్సింగరావు 1957లో డాక్టర్‌ మంజూతను కులాంత‌ర వివాహం చేసుకున్నాడు. అతనుకు ముగ్గురు సంతానం కూతురు మాళవిక, కొడుకులు అజయ్, విజయ్‌. నర్సింగరావు వివాహ అనంతరం 1960లో ఉన్నత చదువులకోసం ఇంగ్లాండ్ వెళ్ళాడు, తిరిగి వచ్చి ప‌లు క‌ళాశాల‌ల్లో రాజ‌నీతి శాస్త్రం అధ్యాప‌కుడిగా ప‌ని చేశాడు.

సీపీఐ నాయకుడిగా[మార్చు]

బూర్గుల నర్సింగరావు విద్యార్థి దశలో 1947 నుండి 1949 ఆల్‌ హైదరాబాద్‌ స్టూడెంట్‌ యూనియన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశాడు. సీపీఐ హైదరాబాద్‌ జిల్లాకమిటీ సభ్యుడిగా పనిచేశాడు, కొంతకాలం ముంబైలోని సీపీఐ కార్యాలయంలో పనిచేశాడు. 1955 నుండి 1959 వరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) మొదటి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు.[5]

ఉద్యమాలకు నాయకత్వం \ పాల్గొన్న ఉద్యమాలు[మార్చు]

  1. నిజాం వ్య‌తిరేక పోరాటంలో 1949లో చంచ‌ల్‌గూడలో జైలుశిక్ష అనుభ‌వించాడు.[6]
  2. 1952లో ముల్కీ ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఉద్యంలో విద్యార్థుల ఊరేగింపుపై ముస్లిం జంగ్ వంతెన వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది చ‌నిపోవ‌డంతో బూర్గుల రామకృష్ణారావు ప్ర‌భుత్వం సంక్షోభ ప‌రిస్థితి ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.
  3. తెలంగాణ తొలి ద‌శ ఉద్య‌మంపై 1969లో మేధావుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపాడు.
  4. తెలంగాణ ప‌ట్ట‌భ‌‌ద్రుల సంఘం స్థాపించాడు.
  5. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షుడిగా పనిచేశాడు.
  6. 2013లో ఎల్బీ స్టేడియంలో సీమాంధ్ర నాయకులు నిర్వహించిన సమైక్య సభలో బూర్గుల రామకృష్ణారావు, కొమురంభీం కటౌట్లను పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.[7]
  7. సాంస్కృతిక, పురాతన కట్టడాలను పరిరక్షించే ఉద్యమాల్లోనూ అతను పాల్గొన్నాడు.

మరణం[మార్చు]

అతను గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ 2021, జనవరి 19న హైదరాబాదులోని కేర్‌ ఆసుపత్రిలో మరణించాడు.[8]

మూలాలు[మార్చు]

  1. The Hans India (26 January 2021). "Burgula Narsing Rao was one of a kind". Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.
  2. Disha daily (దిశ) (18 January 2021). "కమ్యూనిస్టు నేత బూర్గుల నర్సింగరావు కన్నుమూత". Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.
  3. "తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బూర్గుల కన్నుమూత". సాక్షి. 19 January 2021. Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.
  4. Sakshi (14 September 2014). "నేను సంపాదించుకున్నది అదే." Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.
  5. Eenadu. "సాయుధ పోరాటయోధుడు బూర్గుల నర్సింగరావు కన్నుమూత". Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.
  6. Andhrajyothy. "స్మృతిగా మిగిలిన చైతన్యచరిత్ర". www.andhrajyothy.com. Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.
  7. V6 Velugu (19 January 2021). "బూర్గుల నర్సింగరావు ఇకలేరు - V6 Velugu". Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. The New Indian Express (18 January 2021). "Senior CPI leader Narsing Rao who took part in Telangana armed struggle dies at 90". Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.