బ్యాక్‌బెంచ్ స్టూడెంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్యాక్‌బెంచ్ స్టూడెంట్
బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ సినిమా పోస్టర్
దర్శకత్వంమధుర శ్రీధర్ రెడ్డి
స్క్రీన్ ప్లేమధుర శ్రీధర్ రెడ్డి
వెంకట్ సిధారెడ్డి
లక్ష్మీభూపాల్
కథమధుర శ్రీధర్ రెడ్డి
నిర్మాతఎం.వి.కె. రెడ్డి
తారాగణంమహత్ రాఘవేంద్ర
పియా బాజ్‌పాయ్
అర్చన కవి
బ్రహ్మానందం
ఛాయాగ్రహణంప్రసాద్. జి.కె.
కూర్పుధర్మేంద్ర కాకరాల
సంగీతంసునీల్ కష్యప్
నిర్మాణ
సంస్థ
శిరిడి సాయి కంబైన్స్
విడుదల తేదీ
2013 మార్చి 15 (2013-03-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ 2013, మార్చి 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. శిరిడి సాయి కంబైన్స్ పతాకంపై ఎం.వి.కె. రెడ్డి నిర్మాణ సారథ్యంలో మధుర శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహత్ రాఘవేంద్ర, పియా బాజ్‌పాయ్, అర్చన కవి, బ్రహ్మానందం నటించగా, సునీల్ కష్యప్ సంగీతం అందించాడు.[1][2] 16 సబ్జెక్టులలో ఫెయిల్ అయిన ఒక విద్యార్థి జీవితం ఎలా మారింది అన్న కథాశంతో ఈ చిత్రం రూపొందింది. హైదరాబాదు, విశాఖపట్నంలలో 55 రోజుల చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రానికి ప్రసాద్ జి.కె. ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.[3]

కథా సారాంశం[మార్చు]

కార్తీక్ (మహాత్ రాఘవేంద్ర) చదువుమీద ఆసక్తి లేని ఒక ఇంజనీరింగ్ విద్యార్థి. 16 సబ్జెక్టులలో ఫెయిల్ అవుతాడు. కార్తీక్, తన స్నేహితురాలు ప్రియాంక (అర్చన కవి) ప్రేమిస్తుంటాడు. ప్రియాంక అతని నుండి విడిపోయి ఎం.ఎస్. చదవడానికి యుఎస్ఎకు వెలుతుంది. తను ఫెయిల్ అయిన విషయం తల్లిదండ్రులు (శరత్ బాబు, ప్రగతి) లకు తెలిసి, తనని దూరం పెడుతారు. దాంతో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో చిత్ర (పియా బాజ్‌పాయ్) పరిచయం అవుతుంది. అదే సమయంలో ప్రియాంక తన చదువును ఆపేసి, కార్తీక్ ను వెతుక్కుంటూ యుఎస్ నుండి తిరిగి వస్తుంది. కార్తీక్ చైత్రతో ప్రేమలో ఉన్నాడని ఆమె తెలుసుకుంటుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • కథ, దర్శకత్వం: మధుర శ్రీధర్ రెడ్డి
  • నిర్మాత: ఎం.వి.కె. రెడ్డి
  • చిత్రానువాదం: మధుర శ్రీధర్ రెడ్డి, వెంకట్ సిధారెడ్డి, లక్ష్మీభూపాల్
  • సంగీతం: సునీల్ కష్యప్
  • ఛాయాగ్రహణం: ప్రసాద్. జి.కె.
  • కూర్పు: ధర్మేంద్ర కాకరాల
  • నిర్మాణ సంస్థ: శిరిడి సాయి కంబైన్స్

పాటలు[మార్చు]

బ్యాక్‌బెంచ్ స్టూడెంట్
పాటలు by
సునీల్ కశ్యప్
Released2013 ఫిబ్రవరి 17 (2013-February-17)
Genreసినిమా పాటలు
Length25:39
Languageతెలుగు
Labelఆదిత్యా మ్యూజిక్
External audio
పాటలు యూట్యూబ్లో

ఈ చిత్రంలోని 7 పాటలకు సునీల్ కశ్యప్ సంగీతం అందించగా, సిరాశ్రీ, లక్ష్మీభూపాల్ పాటలు రాశారు.[4] 2013, ఫిబ్రవరి 17న ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[5]

పాటలు జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఇంజనీరింగ్ (రచన: సిరాశ్రీ)"సిరాశ్రీహేమచంద్ర & శ్రీజ్యోతి04:16
2."జగడ జగడ (రచన: సిరాశ్రీ)"సిరాశ్రీహేమచంద్ర03:47
3."వెన్నెలమ్మ (రచన: లక్ష్మీభూపాల్)"లక్ష్మీభూపాల్దినకర్03:44
4."ఐ ఆమ్ సారీ వినరా (రచన: సిరాశ్రీ)"సిరాశ్రీశ్రీజ్యోతి & హేమచంద్ర03:40
5."తెలిసి తెలిసి (రచన: లక్ష్మీభూపాల్)"లక్ష్మీభూపాల్దినకర్, ప్రణవి & సునీల్ కశ్యప్03:50
6."సింబస్ పవర్ (రచన: సిరాశ్రీ)" (రిమిక్స్)సిరాశ్రీసింబు03:15
7."సచిన్ టెండూల్కర్ బ్యాక్‌బెంచర్ (రచన: లక్ష్మీభూపాల్)"లక్ష్మీభూపాల్అనిరుధ్ రవిచందర్03:06
Total length:25:39

స్పందన[మార్చు]

నటీనటుల నటన, సంగీతం, ఛాయాగ్రహణం విషయంలో అనుకూల స్పందనలు వచ్చాయి.[6]

మూలాలు[మార్చు]

  1. "First look of Back Bench Student". Times of India. Archived from the original on 2013-04-11. Retrieved 24 June 2020.
  2. "First Look: Back Bench Student". Rediff. Retrieved 24 June 2020.
  3. "Back Bench Student to hit screens on March 15". The Hindu. Retrieved 24 June 2020.
  4. "Back Bench Student - By Sunil Kashyap". Saavn. Archived from the original on 2018-06-30. Retrieved 2020-06-24.
  5. "Back Bench Student (Original Motion Picture Soundtrack)". iTunes.
  6. "Backbench Student: View from the backbench". The Hindu.