భగవంత్ మాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భగవంత్ మాన్
భగవంత్ మాన్


17వ పంజాబ్ ముఖ్యమంత్రి
పదవీ కాలం
2022 మార్చి 16 – ప్రస్తుతం
గవర్నరు భన్వారీలాల్ పురోహిత్
ముందు చరణ్‌జిత్ సింగ్ చన్నీ

శాసనసభ్యుడు
పదవీ కాలం
10 మార్చి 2022 – ప్రస్తుతం
ముందు దాల్విర్ సింగ్ ఖంగురా
నియోజకవర్గం ధూరీ అసెంబ్లీ నియోజకవర్గం

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
16 మే 2014 – ప్రస్తుతం
ముందు విజయ్ ఇందర్ సింగ్లా
నియోజకవర్గం సంగ్రూర్

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్
పదవీ కాలం
10 మే 2017[1] – 17 మార్చి 2018[2]
ముందు గురుప్రీత్ గుగ్గి
తరువాత బల్బీర్ సింగ్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
31 జనవరి 2019 - ప్రస్తుతం[3]
ముందు బల్బీర్ సింగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1972-10-17) 1972 అక్టోబరు 17 (వయసు 51)
సతోజ్ గ్రామం, సంగ్రూర్ జిల్లా, పంజాబ్‌ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (2014- ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు పంజాబ్ పీపుల్స్ పార్టీ (2012-2014)
జీవిత భాగస్వామి ఇంద్రప్రీత్ కౌర్‌ (2015లో విడిపోయారు)
గురుప్రీత్ కౌర్ ( మ. 2022)[4]
సంతానం శీరత్ కౌర్, దిల్షాన్ మాన్‌
వృత్తి రాజకీయ నాయకుడు, సామజిక కార్యకర్త, నటుడు, నాయకుడు
సంతకం భగవంత్ మాన్'s signature

భగవంత్‌ సింగ్ మాన్‌ భారతదేశానికి చెందిన సినీ నటుడు, రాజకీయ నాయకుడు. అతను పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఎంపీగా గెలిచాడు. భగవంత్‌ సింగ్‌ మాన్‌ పంజాబ్ 17వ ముఖ్యమంత్రిగా 2022 మార్చి 16న ప్ర‌మాణం స్వీకారం చేశాడు.[5]

జననం, విద్యాభాస్యం[మార్చు]

భగవంత్ సింగ్ మాన్ 1972 అక్టోబరు 17న పంజాబ్‌ రాష్ట్రం, సంగ్రూర్ జిల్లా, సతోజ్ గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి పేరు మోహిందర్ సింగ్, అతను ఉపాధ్యాయుడు. అతను పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని ఎస్.యూ.ఎస్ ప్రభుత్వ కళాశాల నుండి బి.కామ్ చేశాడు.[6]

సినీ జీవితం[మార్చు]

భగవంత్ మాన్ 1992లో క్రియేటివ్ మ్యూజిక్ కంపెనీలో చేరి చాలా షోలు చేయడం ప్రారంభించి, యూత్ కామెడీ ఫెస్టివల్, ఇంటర్ కాలేజీ పోటీలలో పాల్గొన్నాడు. అతను 1994లో ‘కచారి’ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి 2018 వరకు 12కి పైగా సినిమాల్లో నటించాడు. అతను పాటియాలాలోని పంజాబీ యూనివర్సిటీలోని షహీద్ ఉధమ్ సింగ్ ప్రభుత్వ కళాశాలలో రెండు బంగారు పతకాలు సాధించాడు. భగవంత్ మాన్ మొదటి కామెడీ ఆల్బమ్ జగ్తార్ జగ్గీతో, 2006లో భగవంత్ మాన్, జగ్గీ వారి నో లైఫ్ విత్ వైఫ్ షోలు, 2008లో మాన్ గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్‌ వంటి కార్యక్రమాలతో మంచి గుర్తింపునందుకున్నాడు. “మెయిన్ మా పంజాబ్ ది” సినిమాకు గాను భగవంత్ మాన్ జాతీయ అవార్డు అందుకున్నాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

భగవంత్ మాన్ ఇంద్రప్రీత్ కౌర్‌ ను వివాహం చేసుకొని కౌర్‌కు 2015లో విడాకులు ఇచ్చాడు. వారికీ మన్ కుమార్తె సీరత్, కుమారుడు దిల్షాన్ ఉన్నాడు. ఆయన గుర్‌ప్రీత్ కౌర్ ను 2022 జూలై 7న రెండవ వివాహం చేసుకోగా[7] వారికీ 2024 మార్చి 28న కుమార్తె జన్మించింది.[4]

రాజకీయ జీవితం[మార్చు]

భగవంత్ మాన్ 2011లో కొత్తగా ఏర్పడిన పంజాబ్ పీపుల్స్ పార్టీ నుండి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2012లో పంజాబ్ పీపుల్స్ పార్టీ టిక్కెట్‌పై లెహ్రా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అతను ఆ తర్వాత పంజాబ్ పీపుల్స్ పార్టీకి రాజీనామా చేసి 2014లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు. అతను 2014 లోక్‌సభ ఎన్నికల్లో సంగ్రూర్ నుండి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సుఖ్‌దేవ్ సింగ్ ధిండాపై గెలిచి తొలిసారి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు. అతను తిరిగి 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. భగవంత్‌ సింగ్ మాన్‌ను పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా 2022 జనవరి 18న ప్రకటించింది.[8][9] అతను 2022లో ఎన్నికల్లో ధురీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి 58,206 ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[10]

భగవంత్ మాన్ ధురి స్థానం నుండి అసెంబ్లీకి ఎన్నికవడంతో అతను 2022 మార్చి 15న తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడు.[11] అతను పంజాబ్ 17వ ముఖ్యమంత్రిగా 2022 మార్చి 16న స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు భ‌గ‌త్ సింగ్ స్వ‌గ్రామం ఖ‌త్క‌ర్ క‌లాన్‌లో ప్ర‌మాణం స్వీకారం చేశాడు.[12][13]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. The Economic Times (10 May 2017). "Bhagwant Mann appointment as party Punjab chief". Archived from the original on 18 January 2022. Retrieved 18 January 2022.
  2. The Economic Times (17 March 2018). "Bhagwant Mann resigns as AAP Punjab chief". Archived from the original on 18 January 2022. Retrieved 18 January 2022.
  3. NDTV (31 January 2019). "A Year After Exit, Bhagwant Mann Re-Appointed Punjab Aam Aadmi Party Chief". Archived from the original on 18 January 2022. Retrieved 18 January 2022.
  4. 4.0 4.1 Eenadu (29 March 2024). "మరోసారి తండ్రైన పంజాబ్‌ సీఎం మాన్‌". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
  5. Zee News Telugu (16 March 2022). "పంజాబ్ 17వ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం." Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.
  6. TV9 Telugu (18 January 2022). "హాస్యనటుడు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి దాకా.. భగవంత్ మాన్‌ ప్రస్థానం సాగింది ఇలా..." Archived from the original on 18 January 2022. Retrieved 18 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. The Hindu (7 July 2022). "Punjab CM Bhagwant Mann gets married to doctor from Kurukshetra" (in Indian English). Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
  8. Prajasakti (18 January 2022). "సిఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్‌". Archived from the original on 18 January 2022. Retrieved 18 January 2022.
  9. Andhra Jyothy (10 March 2022). "పంజాబ్ సీఎం కానున్న భగవత్ మాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?... కమెడియన్ నుంచి సీఎం వరకూ." Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
  10. Eenadu (11 March 2022). "నాడు హాస్యనటుడు.. నేడు ముఖ్యమంత్రి". Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.
  11. V6 Velugu (14 March 2022). "ఎంపీ పదవికి రాజీనామా చేసిన భగవంత్ మాన్" (in ఇంగ్లీష్). Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  12. "election result 2022: చన్నీ, ధామీ రాజీనామా.. 16న భగవంత్‌ మాన్‌ సీఎంగా ప్రమాణం." EENADU. Retrieved 2022-03-15.
  13. Andhra Jyothy (17 March 2022). "ఉడ్‌తా పంజాబ్‌ కాదు.. బఢ్‌తా పంజాబ్‌!". Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.