Jump to content

భారత కేంద్ర బడ్జెట్ 2022 - 23

వికీపీడియా నుండి

భారత కేంద్ర బడ్జెట్ 2022 - 23 (ఆంగ్లం: Union Budget 2022-23) - ఇది దాదాపు 130 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును నిర్దేశిస్తుంది. దేశంలో బడ్జెట్‌ది దాదాపు 162 సంవత్సరాల చరిత్ర. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా నాలుగో బడ్జెట్‌ను 2022 ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్ట్ంది.[1] ముందుగా వార్షిక బడ్జెట్ ను ప్రొటోకాల్ ప్రకారం భారతదేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి  రామ్‌నాథ్‌ కోవింద్‌ను మంత్రి తన బృందంతో కలిసి బడ్జెట్ పై వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలిపింది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం కేంద్ర బడ్జెట్‌ తప్పనిసరి. గతంలో కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్లను వేర్వేరుగా ప్రవేశపెట్టేవారు. కానీ 2017లో రెండింటినీ విలీనం చేశారు.[2]

ముఖ్యాంశాలు

[మార్చు]

రాబోయే 25 ఏళ్ళలో భార‌త్‌ను అగ్ర‌దేశంగా నిల‌బెట్టేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించామ‌ని నిర్మలా సీతారామన్‌ చెప్చింది. దీని కోసం ప్ర‌ధాని గ‌తిశ‌క్తి యోజ‌న‌, స‌మీకృత అభివృద్ధి, అభివృద్ధి ఆధారిత పెట్టబడులు, ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆర్థిక ఊతం.. ఇలా నాలుగు సూత్రాల ఆధారంగా కేంద్ర బ‌డ్జెట్ 2022-23ని రూపొందించిన‌ట్లు ఆమె పేర్కొంది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Union Budget 2022: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం". EENADU. Retrieved 2022-02-01.
  2. "Union Budget 2022: భారత్‌ బడ్జెట్‌ విశేషాలు ఇవి." EENADU. Retrieved 2022-02-01.
  3. "Live Blog 2022-23లో 5జీ సర్వీసులు.. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు". EENADU. Archived from the original on 2022-02-01. Retrieved 2022-02-01.