Jump to content

భారతదేశములో పెద్ద నదులు

వికీపీడియా నుండి
గోదావరి నది
పాట్నా వద్ద గంగానది

నది అనగా సహజమైన జల ప్రవాహము. ఎత్తైన కొండలలో, సరస్సులలో పుట్టి వాలుకు ప్రవహించి, మైదానముల ద్వారా ప్రవహించి చివరికి సముద్రములో కలుస్థాయి. నదులు నాగరికథకు నిలయాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రసిద్ధి పొందిన నాగరికథలు నదీతీరాల వెలసినవే.

నదులు రకాలు

[మార్చు]

నదులను ముఖ్యంగా రెండు రకాలుగా విభజించ వచ్చు. 1. జీవ నదులు. 2. వర్షాధార నదులు. జీవనదులు ఎల్లప్పుడు ప్రవహిస్తుంటాయి. సామాన్యంగా ఇవి హిమాలయా పర్వతాలలో పుట్టి మైదానాల ద్వారా ప్రవహించి సముద్రములో కలుస్తాయి. ఎండా కాలంలో మంచు కొండల్లో మంచు కరగడం వల్లనూ, వర్షా కాలంలో వర్షపు నీటితోను ఈ నదులు సంవత్సకాలమంతా ప్రవహిస్తుంటాయి. కనుక వీటిని జీవ నదులు అని అంటారు. కొన్ని నధులు వర్షాకాలములోనే ప్రవహిస్తాయి.

విజయవాడ వద్ద కృష్ణా నది

నదులు:ఉపయోగములు

[మార్చు]

ప్రజల మనుగడ నదులమీదనే ఆధారపడి యున్నది. నదీ జలాలు పంట పొలాలకు ఉపయోగ పడి వంటలు పండుతున్నాయి. త్రాగునీటికుపయోగ పడుతున్నాయి. నదులు రవాణా మార్గాలుగాను ఉపయోగపడుతున్నాయి. చేపల పెంపకానికి ఉపయోగ పడి అనేక మందికి జీవనోపాది లభిస్తున్నది. జలవిద్యుత్ తయారీకి నదులపైనే ఆదారపడవలసి యున్నది.sri Ram

బ్రహ్మపుత్రా నది

పెద్దనదులు

[మార్చు]

నదులు సముద్రములో కలుస్తాయి . ఆ విధంగా నదులను రెండు విభాగాలుగ విభజించ వచ్చు. 1. బంగాళాఖాతంలో కలిసే నదులు. 2. అరేబియా సముద్రములో కసిసే నదులు. బంగాళా ఖాతములో కలిసే నదులలో ముఖ్యమైనవి.

  1. బ్రహ్మపుత్ర
  2. గంగానది (గంగ నదికి ప్రధాన ఉపనదులు: రాంగంగ, కాళి లేదా శారద, గోమతి, యమున, చంబల్, బెట్వా, కెన్, సింధ్, గండకి, )
  3. మహానది
  4. గోదావరి
  5. కృష్ణానది
  6. కావేరి

అరేబియా సముద్రములో కలిసే నదులు.

  1. సింధునది
  2. నర్మదానది
  3. తపతి

ఇతర నదులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • Bhalerao, S.M., Bharatiya Sarita Kosh (in Marathi), (Encyclopedia of Indian Rivers)
  • Vol. 1: Scientific Information, pages 1–788 + 16 pages of colour photographs (ISBN 978-81-89959-50-0),
  • Vol. 2: Scientific Information, pages 789-1660 + 16 pages of colour photographs (ISBN 978-81-89959-51-7),
  • Vol. 3: Scientific, Cultural, Historical Information, pages 1661-2468, + 36 pages of colour photographs (ISBN 978-81-89959-52-4)
  • Book of 60 Maps (ISBN 978-81-89959-57-9), Published Nov. 2007, Diamond Publications, 1691 Sadashiv Peth, Shankar

Prasad Society, Tilak Road, Pune 411 030, INDIA