భీమపాక భూపతిరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భీమపాక భూపతిరావు
భీమపాక భూపతిరావు


మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1983 - 1985
నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ సిపిఐ
జీవిత భాగస్వామి శాంతమ్మ
సంతానం ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు

భీమపాక భూపతిరావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే.[1] 1983 నుండి 1985 వరకు పాలేరు శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[2]

జననం[మార్చు]

భూపతిరావు తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జన్మించాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

భూపతిరావుకు శాంతమ్మతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో ఒక కుమారుడు నగేష్‌ భీమపాక, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాడు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ తరపున పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంభాని చంద్రశేఖర్‌పై 8,264 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందాడు. 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినప్పటికీ పాలేరులో సీపీఎం మద్దతుతో పోటీ చేసిన భూపతిరావు గెలుపొందాడు. భూపతిరాజుకు 35950 ఓట్లు రాగా, చంద్రశేఖర్‌కు 27686 ఓట్లు లభించాయి. 1983లో గెలిచిన భూపతిరావు 1985లో అసెంబ్లీని రద్దు చేయటంతో పూర్తిస్థాయి ఎమ్మెల్యేగా పనిచేయలేకపోయాడు.[4]

ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గన్‌మెన్‌లు, సెక్యూరిటీ సిబ్బందిని వద్దన్నాడు. ఎమ్మెల్యేగా తనకు వచ్చిన జీతాన్ని పార్టీకి అందజేసి పార్టీ ఇచ్చిన 800 రూపాయల గౌరవ వేతనంతో జీవనం సాగించాడు.

మరణం[మార్చు]

భూపతిరావు 2022 ఆగస్టు 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో మరణించాడు.[5]

మూలాలు[మార్చు]

  1. telugu, NT News (2022-09-05). "పాలేరు మాజీ ఎమ్మెల్యే భూపతిరావు మృతి". Namasthe Telangana. Archived from the original on 2022-09-05. Retrieved 2022-09-05.
  2. "మాజీ ఎమ్మెల్యే భూపతిరావు కన్నుమూత". EENADU. 2022-09-06. Archived from the original on 2022-09-06. Retrieved 2022-09-06.
  3. telugu, NT News (2022-08-16). "హైకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణం". Namasthe Telangana. Archived from the original on 2022-08-16. Retrieved 2022-09-06.
  4. "భూపతిరావు.. రెండేళ్లు ఎమ్మెల్యేగా". EENADU. 2022-09-06. Archived from the original on 2022-09-06. Retrieved 2022-09-06.
  5. "పాలేరు మాజీ ఎమ్మెల్యే భూపతిరావు మృతి". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-09-06. Archived from the original on 2022-09-06. Retrieved 2022-09-06.