భూపాలపల్లి రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భూపాలపల్లి రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాజయశంకర్ భూపాలపల్లి

భూపాలపల్లి రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోవున్న ఒక రెవెన్యూ డివిజన్ ఇది. ఈ డివిజను పరిపాలనలో 11 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం భూపాలపల్లి పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం, భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

వివరాలు[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

పరిపాలన[మార్చు]

భూపాలపల్లి డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం భూపాలపల్లి రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 భూపాలపల్లి మండలం 21 రెవెన్యూ గ్రామాలు (1 రెవెన్యూ గ్రామం)
2 ఘనపూర్‌ మండలం 9 రెవెన్యూ గ్రామాలు (1 రెవెన్యూ గ్రామం)
3 రేగొండ మండలం 18 రెవెన్యూ గ్రామాలు
4 మొగుళ్ళపల్లి మండలం 17 రెవెన్యూ గ్రామాలు
5 చిట్యాల మండలం 16 రెవెన్యూ గ్రామాలు
6 టేకుమట్ల మండలం 18 రెవెన్యూ గ్రామాలు
7 మల్హర్రావు మండలం 22 రెవెన్యూ గ్రామాలు (5 రెవెన్యూ గ్రామాలు)
8 కాటారం మండలం 31 రెవెన్యూ గ్రామాలు (3 రెవెన్యూ గ్రామాలు)
9 మహాదేవ్‌పూర్ మండలం 32 రెవెన్యూ గ్రామాలు (7 రెవెన్యూ గ్రామాలు)
10 పల్మెల మండలం 17 రెవెన్యూ గ్రామాలు (5 రెవెన్యూ గ్రామాలు)
11 ముత్తారం మండలం 22 రెవెన్యూ గ్రామాలు (1 రెవెన్యూ గ్రామం)

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-05-23.
  3. "Revenue Villages | Jayashankar Bhupalpally District | India". Archived from the original on 2021-01-21. Retrieved 2022-05-23.
  4. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-05-23. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)