Jump to content

భూమిపుత్ర శ్రీహరిమూర్తి

వికీపీడియా నుండి
భూమిపుత్ర శ్రీహరిమూర్తి
జననం
సాకే శ్రీహరి మూర్తి

1985 జనవరి, 16
విద్యఅనంతపురం
వృత్తిరచయిత,పాత్రికేయుడు
తల్లిదండ్రులు
  • కుల్లాయప్ప (తండ్రి)
  • గంగమ్మ (తల్లి)
వెబ్‌సైటుhttps://www.bhumiputra.net/

భూమిపుత్ర శ్రీహరి మూర్తిగా సుపరిచితులైన సాకే శ్రీహరి మూర్తి పాత్రికేయుడు, రచయిత. ఈయన ప్రస్తుతం భూమిపుత్ర దినపత్రికకు, రాయలసీమ జాగృతి మాసపత్రికకు సంపాదకుడు, ప్రచురణకర్తగా ఉన్నారు.[1] ఈ పత్రికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం నుండి వెలువడుతున్నాయి.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈయన 1985 జనవరి 16 న సాకే గంగమ్మ కుల్లాయప్ప దంపతులకు జన్మించారు. ఇతని స్వస్థలం అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామం. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసం నాన్నగారి దగ్గరే జరిగింది. గురుకులాల ప్రవేశ పరీక్ష రాసి కొడిగెనహళ్ళి గురుకుల పాఠశాలకు ఎంపికై ఆ తరువాత ఉన్నతపాఠశాల నార్పల ప్రభుత్వ ఉన్నతపాఠశాలలోనే చదివారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్య బ్రహ్మంగారి మఠం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నందు పూర్తి చేసి  నిలిచారు. అనంతరం మైదుకూరు నందు డిగ్రీ పూర్తి చేశారు. ఆ తదనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎం.ఏ జర్నలిజం పూర్తి చేసి, శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం, అనంతపురం నుండి లా డిగ్రీ కూడా పూర్తి చేశారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుండి ఎం.ఏ హిందీ కూడా పూర్తి చేసిన శ్రీహరిమూర్తి హిందీ పండిట్ విద్యను కూడా అభ్యసించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నాగార్జుననగర్, గుంటూరు నుండి తెలుగులో ఎం.ఏ పూర్తి చేశారు.ప్రస్తుతం అనంతపురం జిల్లా కోర్టునందు మరియు అమరావతి హైకోర్టు నందు న్యాయవాదిగా కొనసాగుతున్నారు.[2]

విద్యార్థి నాయకుడు

[మార్చు]

విద్యార్థి దశ నుండే సామజిక స్పృహ కలిగిన శ్రీహరిమూర్తి వివిధ వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. సమాజంలోని అసమానతలపై వామపక్ష విద్యార్థి ఉద్యమాలలో మండల నాయకుడిగా మొదలైన ప్రస్థానం రాష్ట్ర స్థాయి నాయకుడిగా తన పయనం కొనసాగింది.

పాత్రికేయ ప్రస్థానం

[మార్చు]

సామజిక ఉద్యమాలలో తలమునకలై ఉంటూనే సామాజిక దురాచారాలను రూపుమాపడానికి  ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొనిరావాలని భావించారు. దీనిలో భాగంగానే తాను సంపాదకుడుగా ‘‘భువనవిజయం’’  పత్రికను 2011లో స్థాపించారు. దాన్ని కొన్నాళ్ళు నడిపారు.

ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక అంశాలను, రాయలసీమ ప్రాధాన్యాన్ని తెలియజేయాలనే సంకల్పంతో తాను సంపాదకుడు, ప్రచురణ కర్తగా ఉంటూ ‘‘రాయలసీమ జాగృతి’’ మాసపత్రికను 2016లో ప్రారంభించారు. పరిశోధనాత్మక కథనాలతో, రాయలసీమ వైభవాన్ని చక్కని చిత్రాలతో అందించేవారు. క్రమేపీ ఈ పత్రికకు పరిశోధకులు వ్యాసాలు రాసేవారు. అందువల్ల దీనికి ఐ.ఎస్.ఎస్.ఎన్ నెంబరు: 2581-3153 కూడా వచ్చింది. రాయలసీమకు ప్రాధాన్యాన్నిస్తూనే, రాష్ట్రంలోని అన్నిప్రాంతాల సాహిత్య, సాంస్కృతిక వ్యాసాలను ఈ పత్రిక ప్రచురిస్తుంది.

తాను సంపాదకుడు, ప్రచురణ కర్తగా ఉంటూ "భూమిపుత్ర" దినపత్రికను 2018 ప్రారంభించి సమకాలీన పత్రికా ప్రపంచంలో, ఆధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుని వర్ధమాన పత్రికలలో జాతీయ స్థాయిలో నిలబడేలా కృషిచేస్తుంది. కరోనా సమయంలో పత్రికల పంపిణీ ఒక పెద్ద సమస్య అయినప్పుడు, డిజిటల్ ఎడిషన్స్ కి ప్రాధాన్యం పెరగడం, సామాజిక మాధ్యామాలే వాటికి ప్రధాన వాహికగా నిలవడం వల్ల స్థానిక పత్రికలు పుంజుకున్నాయి. దీనిలో భాగంగానే భూమిపుత్ర దినపత్రిక కూడా చిరకాలంలోనే ఎందరో మన్ననలను పొందుతుంది. ప్రస్తుతం అన్ని పుటలు కలర్ లో ప్రచురిస్తూ, అనంతపురం జిల్లాకు ప్రత్యేకించి ప్రతిదినం ఒక అనుబంధాన్ని కూడా ప్రచురిస్తుంది. దీనిలో రోజువారీ ప్రపంచ, దేశవ్యాప్త, రాష్ట్రాల వార్తలతో పాటు స్థానిక వార్తలకు కూడా అధిక ప్రాధాన్యాన్నిస్తుంది.

పురస్కారాలు

[మార్చు]
  • 2021 సంవత్సరానికి గానూ హైదరాబాదులోని జ్యోత్స్నా కళాపీఠం వారిచ్చే ప్రతిష్టాత్మక డా.యస్.టి. జ్ఞానానందకవి స్మారక పురస్కారాన్ని అందుకున్నారు.[3]

అనంతపురం జిల్లా రచయితల సంఘం

[మార్చు]

క్రొత్త జిల్లాల ఏర్పాటుతో ఇదివరకు ఉన్న జిల్లా రచయితల సంఘం రెండుగా చీలిపోయింది. కొత్తగా ఏర్పడిన "అనంతపురం జిల్లా రచయితల సంఘాని(అ.జి.ర.సం)"కి శ్రీహరిమూర్తి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "ఆశావాదికి ఆత్మీయ సత్కారం | Prajasakti". www.prajasakti.com. Archived from the original on 2021-07-26. Retrieved 2021-07-26.
  2. "Search By Enrollment Number". barcouncil (in ఇంగ్లీష్). Retrieved 2024-10-26.
  3. ప్రభాతవార్త (17 July 2021). "తెలుగు పద్యానికి పర్యాయపదం పద్మశ్రీ ఎస్.టి.జ్ఞానానందకవి". వార్త దినపత్రిక. Archived from the original on 26 September 2021. Retrieved 26 September 2021.
  4. విలేకరి (25 June 2022). "జిరసం జిల్లా అధ్యక్షులుగా సాకే శ్రీహరిమూర్తి". ప్రజాశక్తి దినపత్రిక. Archived from the original on 24 జూలై 2022. Retrieved 24 July 2022.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)