మంజులారెడ్డి
డా. మంజులారెడ్డి | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | శాస్త్రవేత్త |
డా. మంజులారెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన శాస్త్రవేత్త. బ్యాక్టీరియా సెల్‌వాల్ (కణత్వచం)పై పదేండ్ల పాటు పరిశోధనలు చేసి కొత్త పద్ధతులతో బ్యాక్టీరియా వాల్ తయారయ్యే విధానాన్ని కనుగొన్నది. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ శాస్త్రవేత్తగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]మంజులారెడ్డి మహబూబ్ నగర్ లో జన్మించింది. తండ్రి డీఎఫ్ఓగా పనిచేశాడు. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన మంజులారెడ్డి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తిచేసింది. పెళ్ళి అయిన తరువాత పీహెచ్.డి చదువును మథ్యలోనే వదిలేసింది. పదేళ్ళ విరామం తరువాత 1996లో మళ్ళీ పీహెచ్.డి పరిశోధనని ప్రారంభించి 2001లో ‘బ్యాక్టీరియా మ్యూటేషన్' అంశంపై పీహెచ్‌డీ పట్టా పొందింది.[2]
ఉద్యోగం
[మార్చు]1990లో సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలెక్యులర్ బయోలజీ (సీసీఎంబీ)లో జూనియర్ సైంటిస్ట్‌గా చేరింది. ప్రస్తుతం ఛీఫ్ సైంటిస్టుగా పనిచేస్తున్నది.
పరిశోధనరంగం
[మార్చు]ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీబయోటిక్స్ ఏవి బ్యాక్టీరియాను నిరోధించలేకపోతున్నాయి. దీనికిగల కారణాలపై మంజులారెడ్డి పరిశోధన చేసింది. బ్యాక్టీరియా సెల్‌వాల్‌ను నిరోధించగలిగితే దీనివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, డిఫ్తిరీయా, టీబీ, టైఫాయిడ్, కలరా, కుష్టు వంటి వ్యాధులను అరికట్టవచ్చని తన పరిశోధనల ద్వారా నిరూపించింది. బ్యాక్టీరియా నిర్మూలన, వాటి గోడల తయారీని ఆపడం, అందుకు కొత్త యాంటీబయోటిక్స్ కనుక్కోవడానికి మంజులారెడ్డి పరిశోధన ఉపయోగపడుతోంది.[3] తెలంగాణ సైన్స్ అకాడమీ నుండి ఫెలోషిప్ కూడా అందుకుంది.
పురస్కారాలు
[మార్చు]- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2020 మార్చి 8.[4]
- ఇన్ఫోసిన్ లైఫ్‌సైన్స్ పురస్కారం (ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్ చేతుల మీదుగా), 2020 జనవరి 7.
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, ప్రధానాంశాలు (8 March 2020). "30 మంది మహిళలకు పురస్కారాలు". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 1 April 2020.
- ↑ బ్యాక్టీరియా పతనమే.. మంజులారెడ్డి విజయం,డప్పు రవి, నమస్తే తెలంగాణ (జిందగీ), 13 నవంబరు 2019, పుట. 7.
- ↑ నమస్తే తెలంగాణ, జిందగీ (8 March 2020). "సరిలేరు మీకెవ్వరు". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 1 April 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 March 2020). "ఉమెన్ సేఫ్టీ స్టేట్ తెలంగాణ : మంత్రులు". Archived from the original on 9 మార్చి 2020. Retrieved 1 April 2020.