Jump to content

మంథా భానుమతి

వికీపీడియా నుండి
మంథా భానుమతి
జననం (1946-01-11) 1946 జనవరి 11 (వయసు 78)
అమలాపురం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ India
నివాస ప్రాంతంహైదరాబాదు
వృత్తికెమిస్ట్రీ లెక్చరర్, సిటీ కాలేజీ (రిటైర్డ్)
ప్రసిద్ధికథా, నవలా రచయిత్రి
మతంహిందూ
భార్య / భర్తమంథా రామారావు
పిల్లలుమంథా రమేష్, మంథా రవికాంత్
తండ్రివడ్లమాని సత్యనారాయణమూర్తి
తల్లిసుభద్ర
వెబ్‌సైటు
http://bhanuramarao.blogspot.in/

మంథా భానుమతి ప్రముఖ రచయిత్రి. ఈమె 22 నవలలు, 100 కు పైగా కథలు వ్రాసింది.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈమె 1946 జనవరి 11న తూర్పు గోదావరి జిల్లా, అమలాపురంలో వడ్లమాని సుభద్ర, సత్యనారాయణమూర్తి దంపతులకు జన్మించింది. ఈమె గుంటూరులో బి.హెచ్.ఉన్నత పాఠశాలలో మాధ్యమిక విద్య, ప్రభుత్వ మహిళా కళాశాలలో బి.ఎస్సీ చదివింది. ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి రసాయనశాస్త్రంలో ఎం.ఎస్సీ చదివి అక్కడే ఫోటో కెమిస్ట్రీలో పి.హెచ్.డి. పట్టాను సంపాదించింది. అమెరికాలోని డెన్వర్ యూనివర్సిటీ నుండి ఎం.ఎస్. పట్టా స్వీకరించింది. తెలుగు విశ్వవిద్యాలయంలో కర్ణాటక సంగీతములో డిప్లొమా చేసింది. ఈమె హైదరాబాదులోని ప్రభుత్వ సిటీకళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేసి 2000లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసింది. ఈమెకు 1965లో మంథా రామారావుతో వివాహం జరిగింది. ఈమె భర్త ఎ.పి.జెన్‌కోలో సూపరింటెండెంట్ ఇంజనీరుగా పనిచేసి పదవీ విరమణచేశాడు. వీరికి ఇద్దరు కుమారులు.వారు విదేశాలలో స్థిరపడ్డారు. యోగా, సంగీతము ఈమె అభిమాన విషయాలు.

రచనారంగం

[మార్చు]

ఈమె రచనలు చేయడం కాస్త ఆలస్యంగా మొదలు పెట్టింది. ఈమె తొలి రచన 1993లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. కథలు, నవలలు మాత్రేమే కాక ఈమెకు పద్యరచనలో కూడా ప్రావీణ్యం ఉంది.[1] ఈమె రచనలు రచన, స్వాతి, నవ్య, పత్రిక, ఆంధ్రభూమి, చతుర మొదలైన పత్రికలతో పాటు కౌముది, తెలుగు వన్.కామ్‌, మాలిక మొదలైన అంతర్జాల పత్రికలలో ప్రచురితమయ్యాయి.

నవలలు

[మార్చు]
  1. గ్లేషియర్
  2. అంతా ప్రేమమయం
  3. రామాయణం మామయ్య
  4. శివానీ
  5. అగ్గిపెట్టిలో ఆరుగజాలు
  6. అరుణోదయం
  7. మౌనంగానే ఎదగమని
  8. మారని భారతంలో మరో శకుంతల
  9. మాయ పండు
  10. సిస్టర్ కరుణ
  11. అనుబంధాలు
  12. జీవన పోరాటం
  13. సగం ఇక్కడా సగం అక్కడా!
  14. జనని
  15. నిన్నటినాతో రేపటి నేను
  16. మేఘం లేని మెరుపు
  17. మొదటిఅడుగు
  18. ప్రేముడి
  19. చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు
  20. అజ్ఞాత కుల శీలస్య
  21. కలియుగంలో వామనావతారం
  22. పద్మప్ప

ప్రబంధాలు

అద్వితీయుడు

శతకాలు

1. అర్కశతకం

2. అంశు శతకం

3. సిరి శతకం.

కథాసంపుటాలు

[మార్చు]
  1. అనంతవాహిని[2]
  2. 'మంథా'రమాల
  3. జీవనవాహిని

పురస్కారాలు

[మార్చు]
  • గ్లేసియర్ నవలకు రచన మాసపత్రిక వారు నిర్వహించిన నర్శిపురం ఆదిలక్ష్మి స్మారక నవలల పోటీలో బహుమతి.
  • రామాయణం మామయ్య నవలకు ఆంధ్రభూమి వారపత్రిక బహుమతి.
  • అంతా ప్రేమమయం స్వాతి సపరివార పత్రికలో పదహారు వారాల నవలల పోటీలో బహుమతి.
  • అమూల్య అనే కథకు ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహించిన కథల పోటీలో బహుమతి.
  • తెలుగు జ్యోతి, న్యూజెర్సీ వారు నిర్వహించిన కథలపోటీలో చిన్నమ్మ కథకు బహుమతి.
  • నవ్యాంధ్ర పుస్తక సంబరాలలో విశాఖపట్నంలో సన్మానం
  • మౌనంగానే ఎదగమని నవలకు అనిల్ అవార్డు.
  • అచ్చంగా తెలుగు బృందం నిర్వహించిన ఛందో బద్ధమైన పద్యాలపోటీలలో బహుమతి
  • అనుబంధాలు నవలకు నవ్యవీక్లీ ఎనిమిది వారాల నవలల పోటీలో బహుమతి
  • చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు అనే నవలకు నది మాసపత్రిక నవలలపోటీలో బహుమతి.
  • లేఖిని సంస్థ వారి మాతృదేవ పురస్కారం,
  • కళానిలయం వారి జీవితకాల సాఫల్య పురస్కారం
  • బోయి హైమవతి గారిచే భీమన్న సాహితీనిధి నుండి కొత్తూరి సుబ్బయ్య దీక్షితులు జీవిత పురస్కారం.
  • వంశీ సంస్థ వారి వాసిరెడ్డి సీతాదేవి స్మారక పురస్కారం.

మూలాలు

[మార్చు]
  1. గురజాడ, శోభాపేరిందేవి (1 March 2017). "పద్యకవితా ప్రవీణురాలు డా.మంథా భానుమతి". సాహితీకిరణం. 9 (1): 64.
  2. ఆర్., కె. (11 February 2011). "The all-rounder". The Hindu. Retrieved 20 March 2017.

బయటి లింకులు

[మార్చు]